Kautilya (also known as Chanakya) and Machiavelli were two influential political philosophers who lived in different parts of the world and at different times in history. While both thinkers wrote extensively about politics and statecraft, there are several key differences between their ideas and approaches. Read more…
పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం JAYAM APP
పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, నిపుణులైన అధ్యాపకులతో వీడియో క్లాస్‌లు రూపొందించడం జరిగింది.
ప్రధానంగా Bank exams, DSC, TET, UGC NET, AP SET exams కోసం వీడియో క్లాసులు రూపొందించడం జరిగింది.
TSPSC, APPSC త్వరలోనే భారీ స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కనుక అభ్యర్థులు ఇప్పటి నుంచే సరైన రీతిలో ప్రిపేర్ అయితే, తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.
అపార అనుభవం ఉన్న అధ్యాపకులు, స్వయంకృషితో ఉన్నత ఉద్యోగాలు సాధించిన విజేతలు సూచించిన ప్రామాణిక పుస్తకాల జాబితాను క్రింది పట్టికలో ఇవ్వడమైనది. Click here…
సింధు నాగరికిత ప్రధానంగా పట్టణ నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన 250కిపైగా పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని ముఖ్యపట్టణాల గురించిన సమాచారాన్ని ఇవ్వడమైనది.
మొహంజొదారో:
సింధి భాషలో మొహంజొదారో అంటే మృతులదిబ్బ అని అర్ధం. ఇక్కడి త్రవ్వకాల్లో కుషాణుల కాలం నాటి బౌద్ధ స్థూపం బయల్పడింది. ఈ నగరము Read more…
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఒక రోజు పంచ పాండవులు అరణ్యంలో సంచరిస్తుండగా ధర్మరాజుకు బాగా దాహం వేసింది. అప్పుడు ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి “నాయనా సహదేవా! నాకు బాగా దప్పికగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి నీళ్లు ఉన్నాయేమో చూసి, కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు.
వెంటనే సహదేవుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి చుట్టూ పరికించి చూశాడు. దగ్గరలోనే ఒక మంచి నీళ్ల మడుగు కనిపించింది. సహదేవుడు అక్కడికి వెళ్లి మడుగులోకి దిగి Read more…
ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికత ఒకటి. అయితే భారతదేశంలోని తొలినాగరికత అయిన ఈ సింధు నాగరికత కాలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది సుమారుగా క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లి ఉంటుందని R.S.శర్మ అభిప్రాయపడుతున్నారు.
1826లో మాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త ఈ నాగరికత అవశేషాలను మొదటిసారిగా గుర్తించారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం ఉదాసీనత వహించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. Read more…
ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు.
శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని, సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! Read more…
ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు.
ఏదీ ఆ పద్యం ఒకసారి చదవండి అని రాయలవారు అడిగారు. అప్పుడు Read more…
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు.
అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా Read more…
భారతదేశంలో ఒక మహానాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఒక కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. వేద సాహిత్యంలోనూ వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. అందుకే ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
అవినాష్ చంద్రదాస్, డా.సంపూర్ణానంద్, గంగానాథ్ ఝా మరియు డి.యస్.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని వాదించారు. Read more…
ఒక ట్రేడర్ ఒక రూపాయి లాభాపడుతున్నాడు అంటే.. అదే సమయంలో మరో ట్రేడర్ ఆ రూపాయి నష్టపోతున్నట్టు. అదే విధంగా.. ఒక బృందంలోని ట్రేడర్లు లాభాలు పొందుతున్నారు అంటే.. మరో బృందం నష్టాలు పాలవుతున్నట్టు.
అయితే వీటి మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. అదే.. రిస్క్/మనీ మేనేజ్మెంట్ను అర్థం చేసుకునే విధానం. ది డిసిప్లీన్డ్ ట్రేడర్ పుస్తకంలో మార్క్ డౌగ్లస్ చెప్పింది ఏంటంటే.. ట్రేడింగ్‌లో విజయం అనేది.. 80శాతం మనీ మేనేజ్‌మెంట్, 20శాతం స్ట్రాటజీ(వ్యూహరచణ)పై ఆధారపడి ఉంటుంది. Read more…
స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల దూకుడు కొనసాగుతోంది. అయితే ఎక్కువగా మంది ఇన్వెస్టర్లు కనీస అవగాహన లేకుండానే, స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ, భారీగా నష్టపోతున్నారు.
సహనమే విజయానికి వారధి:
మన శక్తి సామర్థ్యాల కన్నా, మన సహనమే మనల్ని లాభాలబాట పట్టిస్తుంది. ఎవరైతే తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేరో, వారు ఎప్పటికీ గెలవడం అంటూ జరగదు. తాత్కాలికంగా లాభాలు కళ్లజూసినా, చివరికి నష్టపోవడం ఖాయం. Read more…
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న, చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, తప్పనిసరిగా Investment Psychology గురించి తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకొని, సంపదను సృష్టించుకోగలుగుతారు.
మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని బలమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటిని అనుసరించే కొన్ని Bias (పక్షపాత వైఖరులు) కూడా ఉంటాయి. వాస్తవానికి ఈ Bias మనకే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.
ఒక మంచి ఇన్వెస్టర్ రెండు ముఖ్యమైన Bias విడిచిపెడతాడు. Read more…
స్టాక్ మార్కెట్లో లాభాలను పొందాలనుకునేవారు, కచ్చితంగా మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. అయితే ఇందుకోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సాయం తీసుకోవడం, సాధారణ ఇన్వెస్టర్లకు ఆర్థికంగా కొంత భారమే. అందుకే స్వయంగా మనకు మనమే ఒక మంచి పోర్ట్‌ఫోలియోను ఎలా రూపొందించుకోవాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
Best steps to build a Portfolio
Set your goals: ఇన్వెస్టర్లు ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి. అది కూడా ఎంత కాలం (టైమ్ హోరిజోన్)లో మీ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో గుర్తించాలి. Read more…
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు (Investors) అవగాహన కల్పించి, తగు రక్షణ కల్పించడం కోసం ప్రత్యేకంగా “స్టాక్ మార్కెట్ గైడ్”ను https://www.bseindia.com/ websiteలో పొందుపరిచింది.
ట్రేడ్ అమలు చేసిన ఒక్క వర్కింగ్ డే లోపల… ఆర్డర్ నెంబర్, ట్రేడ్ నెంబర్, ట్రైడ్ టైమ్, ట్రేడ్ ప్రైజ్ వివరాలతో సహా, అన్ని లావాదేవీల గురించిన సమగ్ర సమాచారంతో కూడిన కాంట్రాక్ట్ నోట్‌ను బ్రోకర్ నుంచి ఇన్వెస్టర్ పొందాల్సి ఉంటుంది.
Note: ఈ కాంట్రాక్ట్ నోట్‌లో సెబీ మరియు స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా నిర్దేశించిన విధంగా విధించిన ఛార్జీల వివరాలు కూడా ఉంటాయి. ఇందులో ఏమైనా తేడాలు ఉంటే, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. Read more…