మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా?

How to build a best portfolio?

స్టాక్‌ మార్కెట్లో లాభాలను పొందాలనుకునేవారు, కచ్చితంగా మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. అయితే ఇందుకోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సాయం తీసుకోవడం, సాధారణ ఇన్వెస్టర్లకు ఆర్థికంగా కొంత భారమే. అందుకే స్వయంగా మనకు మనమే ఒక మంచి పోర్ట్‌ఫోలియోను ఎలా రూపొందించుకోవాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం. # మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా? #

Best steps to build a Portfolio

1. Set your goals:

ఇన్వెస్టర్లు ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి. అది కూడా ఎంత కాలం (టైమ్‌ హోరిజోన్‌)లో మీ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో గుర్తించాలి.

ఉదాహరణకు మీరు భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడాలనుకుంటున్నారా?, లేదా మంచి ఇళ్లు కొందామనుకుంటున్నారా?,  లేదా మీ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెడదామనుకుంటున్నారా? అనే విషయాలపై మీకు స్ఫష్టత ఉండాలి.

2. Identify your budget:

ఇన్వెస్ట్‌ చేసేముందు మీ బడ్జెట్‌ లెక్కలను సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే మీ సామర్థ్యానికి మించి మీరు ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టారంటే, మీ , నిత్యావసరాలకు, అత్యవసరాలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడవచ్చు.

(స్టాక్‌మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజమన్న విషయం మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.)

3.Asses Risk Profile:

పెట్టుబడులు పెట్టేముందు మీరు కచ్చితంగా మీ రిస్క్‌ ప్రొఫైల్‌ని; మీ రిస్క్‌ అపటైట్‌ లేదా రిస్‌ టోలరెన్స్‌ను అంచనా వేసుకోవాలి.

సాధారణంగా ఇన్వెస్టర్లు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా లాంటి ఏస్‌ ఇన్వెస్టర్లను ఫాలో అవుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్‌ కాదు. ఎందుకంటే ఏస్‌ ఇన్వెస్టర్ల రిస్క్‌ అపటైట్‌కు, మన రిస్క్ అపటైట్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.

(రిస్క్‌ అపటైట్‌ అంటే నష్టాన్ని భరించే సామర్థ్యం.)

NOTE: అసలు పెట్టుబడి పెట్టకుండా మీ సంపదను, నగదుగా ఉంచుకోవడం కూడా మీకు నష్టాన్నే కలిగిస్తుంది. ఎలా అంటే పెరుగుతున్న ద్రవ్యోల్భణం కాలక్రమంలో మీ కొనుగోలు శక్తిని చాలా వరకు తగ్గిస్తుంది. # మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా? #

రిస్క్‌తోనే రివార్డ్‌

రిస్క్‌ను అనుసరించే రివార్డ్‌ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. రిస్క్ ఎక్కువ ఉంటే రివార్డ్‌ ఎక్కువగా ఉంటుంది. రిస్క్‌ తక్కువున్న చోట, రివార్డ్‌ కూడా తక్కువగానే ఉంటుంది.

ఉదాహరణకు ప్రభుత్వ సెక్యూరిటీలలో రిస్క్‌ తక్కువగా ఉంటుంది. దానికి వచ్చే రివార్డ్‌ కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్వెస్టర్లకు స్థిరమైన రాబడి వస్తుంది. వారి పెట్టుబడికి ఎలాంటి నష్టం రాదు.

కానీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రివార్డ్‌ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

4.List of Options

ఇన్వెస్టర్లు తమ ముందున్న పెట్టుబడి మార్గాల గురించి ముందుగా తెలుసుకోవాలి. తమ పెట్టుబడిని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టాలా?, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టాలా?, బంగారం కొనాలా?, బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలా?, వ్యాపారంలో పెట్టాలా?, నగదుగానే ఉంచుకోవాలా? ఇలా అన్ని మార్గాలను ఒక సారి చూసుకోవాలి.

5.Allocate capital:

మీ దైనందిన జీవిత అవసరాలకు సరిపడా బడ్జెట్‌ను రూపొందించుకున్నాక, మీరు ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడదామనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.

ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా SIP చేయడాన్ని ఎంచుకోవచ్చు.

6.Ensure to Diversify:

ఇన్వెస్టర్లు కచ్చితంగా తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయాలి. అప్పుడే మీ పెట్టుబడి పదిలంగా ఉంటుంది. రివార్డ్‌ కూడా లభిస్తుంది.

ఉదాహరణకు కరోనా (కొవిడ్‌ -19) మహమ్మారి లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతూ ఉంటాయి. కానీ అలాంటి విపత్కర సమయాల్లోనూ కొన్ని రంగాలు రాణిస్తుంటాయి. మనం మన పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం వలన ఇలాంటి ఊహించని విపత్కర సమయాల్లో కూడా మనం నష్టపోకుండా ఉండగలుగుతాం. # మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా? #

7.Regularly Revisit:

ఒక సారి మనం ఇన్వెస్ట్‌ చేసిన తరువాత, దానిని అలా వదిలివేయడానికి వీలులేదు. మనం లాంగ్‌టెర్మ్‌ ఇన్వెస్టర్‌ అయినప్పటికీ కూడా కచ్చితంగా రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో మన పోర్ట్‌ఫోలియోను, మార్కెట్‌ను కూడా పరిశీలిస్తూ ఉండాలి.

ఎందుకంటే నేడు సమాచార వ్యవస్థ అత్యంత క్రియాశీలకంగా ఉంది. ఒక వార్త క్షణాల్లో ప్రపంచమంతటికీ తెలిసిపోతోంది. ఇందువల్ల మనం హోల్డ్‌ చేస్తున్న కంపెనీ స్టాక్స్‌కు సంబంధించిన పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ వార్తలు, కచ్చితంగా ఆ స్టాక్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి.

8.If needed, Rebalance:

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పోర్ట్‌ఫోలియోను బిల్డ్‌ చేసుకున్నప్పటికీ, కొన్ని సార్లు వాటిని రీబ్యాలెన్స్‌ చేయాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో కచ్చితంగా మన పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసి తీరాలి.

మీ ఫేవరెట్‌ స్టాక్స్‌ విషయంలో కూడా ఎలాంటి సెంటిమెంట్‌లకు లోను కాకూడదు.

ఇదీ చదవండి: What is “CANSLIM” strategy?

ఇదీ చదవండి: Risk, volatility, liquidity in the stock market

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?