యక్ష ప్రశ్నలు

yaksha prashnalu

పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. ఒక రోజు పంచ పాండవులు అరణ్యంలో సంచరిస్తుండగా ధర్మరాజుకు బాగా దాహం వేసింది. అప్పుడు ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి “నాయనా సహదేవా! నాకు బాగా దప్పికగా ఉంది. దగ్గరలో ఎక్కడైనా మంచి నీళ్లు ఉన్నాయేమో చూసి, కొంచెం నీళ్లు తీసుకురా” అన్నాడు. # యక్ష ప్రశ్నలు #

వెంటనే సహదేవుడు ఒక పెద్ద వృక్షం ఎక్కి చుట్టూ పరికించి చూశాడు. దగ్గరలోనే ఒక మంచి నీళ్ల మడుగు కనిపించింది. సహదేవుడు అక్కడికి వెళ్లి మడుగులోకి దిగి నీరు తీసుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా ఓ యక్షుడు ప్రత్యక్షమయ్యాడు.

“ఓ సహదేవా! ముందుగా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పి, ఆ తరువాత నీళ్లు తీసుకో. లేదంటే నువ్వు ప్రాణాలు కోల్పోతావు” అన్నాడు. అయితే, సహదేవుడు ఆ యక్షుని మాటలు పట్టించుకోకుండా ఓ పత్రంలో నీళ్లు తీసుకున్నాడు. వెంటనే, యక్షుడు చెప్పినట్లు సహదేవుడు ప్రాణాలు కోల్పోయాడు.

సహదేవుడు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ధర్మరాజు నకులుడిని, ఏమి జరిగిందో చూసి రమ్మని పంపాడు. నకులుడు కూడా సహదేవుడి లానే యక్షుని మాటలు పట్టించుకోలేదు. దీనితో అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు.

నకులుడు కూడా ఎంత సేపటికీ రాకపోవడంతో ధర్మరాజు అర్జునుడిని పంపించాడు. అర్జునుడు కూడా నకుల, సహదేవులు చేసినదే చేసి ప్రాణాలు కోల్పోయాడు. మహావీరుడు అర్జునుడు కూడా ఎంత సేపటకీ రాకపోవడంతో ధర్మరాజు చివరకు భీముడిని పంపించాడు. అసలే మహాబలశాలి అయిన భీముడు యక్షుని పలుకులను లక్ష్యపెట్టలేదు.  దీనితో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు.

అప్పుడు ధర్మరాజే స్వయంగా మంచి నీళ్ల మడుగు వద్దకు వచ్చాడు. చలనం లేకుండా పడివున్న తన తమ్ములైన భీమ, అర్జున, నకుల, సహదేవులను చూసి చాలా బాధపడ్డాడు. వెంటనే తేరుకొని మడుగులోని నీళ్లు తీసుకొని, వారిపై చల్లాలనుకున్నాడు. అప్పుడు యక్షుడు, “ధర్మరాజా! అక్కడే ఆగు, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ఆ తరువాత నీళ్లు తీసుకువెళ్లు, లేదంటే నీవు కూడా నీ తమ్ముళ్లలానే ప్రాణాలు కోల్పోతావు” అని హెచ్చరించాడు. # యక్ష ప్రశ్నలు #

పరిస్థితిని అర్థం చేసుకున్న ధర్మరాజు, “ఓ యక్షుడా! నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం” అని అన్నాడు. అప్పుడు యక్షుడు ఇలా ప్రశ్నలు సంధించాడు.

యక్షుడు: ధర్మాలలో ఉత్తమమైన ధర్మము ఏది?

ధర్మరాజు: అహింసయే పరమధర్మం.

యక్షుడు: లోకంలో ఎవడు ధనవంతుడు?

ధర్మరాజు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించినవాడే నిజమైన ధనవంతుడు.

యక్షుడు: గాలికన్నా వేగవంతమైనది ఏది?

ధర్మరాజు: గాలి కన్నా వేగవంతమైనది మనస్సు.

యక్షుడు: దుఃఖానికి హేతువేది?

ధర్మరాజు: అత్యాశ

యక్షుడు: భూమి కన్నా గొప్ప ఓర్పుగలది ఏది?

ధర్మరాజు: కన్నతల్లి

యక్షుడు: అత్యంత సులభమైనది ఏది?

ధర్మరాజు: ఇతరులకు సలహాలు ఇవ్వడం.

యక్షుడు: ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది?

ధర్మరాజు: తృప్తితో జీవించడం

యక్షుడు: కీర్తికి నెలవు ఏది?

ధర్మరాజు: దానం

యక్షుడు: స్వర్గసౌఖ్యాలు ఎలా లభిస్తాయి?

ధర్మరాజు: స్వర్గానికి సత్యవర్తనం, సుఖానికి శీలం కలిగి జీవించడం ముఖ్యం.

వాస్తవానికి యక్షుని రూపంలో వచ్చినవాడు యమధర్మరాజు. ధర్మరాజు యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి ఇలా యక్షుని రూపంలో వచ్చాడు.  ధర్మరాజు యొక్క సమాధానాలు విని, అతని జ్ఞానానికి ముగ్ధుడై తన నిజరూపంతో దర్శనమిచ్చాడు.

యమధర్మరాజు: ధర్మరాజా “నీ సమాధానాలకు ఎంతో సంతోషించాను. అయితే నీ తమ్ములలో ఎవరో ఒకరిని మాత్రమే నేను బ్రతికిస్తాను. మరి ఎవరిని బతికించమంటావో నీవే చెప్పుము?

ధర్మరాజు: సమవర్తి! నకులుడిని బతికించండి.

యమధర్మరాజు: రానున్న కురుక్షేత్రంలో నీకు గాండీవి అర్జునుడు ఎంతో అవసరం. లేదంటే మహాబలశాలి అయిన భీముడు అత్యవసరం. మరి నీవెందుకు నకులుడిని బతికించమంటున్నావు.

ధర్మరాజు: ఓ సమవర్తి! మా తండ్రి పాండురాజుకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుంతి కుమారునిగా నేను జీవించి ఉన్నాను. అందువల్ల మా పినతల్లి మాద్రి కుమారుడైన నకులుడు బతకడం న్యాయంగా ఉంటుంది.

ధర్మరాజు యొక్క ధర్మబుద్ధికి ముగ్ధుడైన యమధర్మరాజు… భీమ, అర్జున, నకుల, సహదేవులు నలుగురినీ పునర్జీవితులను చేశాడు. తరువాత పంచపాండవులను దీవించి అంతర్ధానమయ్యాడు.

ఇదీ చదవండి: అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

ఇదీ చదవండి: తిలకాష్ఠ మహిషబంధనం

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?