Classics

Hare and Tortoise Moral Story

గర్విష్టి కుందేలు – పట్టుదల గల తాబేలు: అడవిలో మహా పరుగు పందెం!

గర్విష్టి కుందేలు – పట్టుదల గల తాబేలు: అడవిలో మహా పరుగు పందెం! అనగనగా దండకారణ్యం అనే ఒక అందమైన పెద్ద అడవి. ఆ అడవిలో చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా, పచ్చటి ఆకులతో కళకళలాడుతూ ఉండేవి. రంగురంగుల పూలు, తియ్యటి పండ్ల చెట్లు, జలజల పారే సెలయేర్లతో ఆ అడవి చూడటానికి రెండు కళ్లూ చాలనంత అద్భుతంగా ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు చాలా సరదాగా, ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించేవి. […]

గర్విష్టి కుందేలు – పట్టుదల గల తాబేలు: అడవిలో మహా పరుగు పందెం! Read More »

dhanvi story

చిట్టి ధన్వి – ఆకాశం నుండి రాలిన రంగుల మేఘం

చిట్టి ధన్వి – మాయాజాలపు రంగుల మేఘం ఒక అందమైన పల్లెటూరిలో, పచ్చని చెట్లు, కిలకిలలాడే పక్షుల మధ్య ఉన్న ఒక చిన్న పెంకుటింట్లో ధన్వి అనే ఒక చిన్న పాప ఉండేది. ధన్వికి ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని, కొత్త కొత్త ఆటలు ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. ఆమె కళ్ళు ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే పక్షుల వైపు, పూల పైన వాలే రంగురంగుల సీతాకోకచిలుకల వైపు ఆసక్తిగా చూస్తూ ఉండేవి. ఆమె

చిట్టి ధన్వి – ఆకాశం నుండి రాలిన రంగుల మేఘం Read More »

tenali ramakrishna theifs story

తెనాలి రామకృష్ణుడి తెలివి: దొంగలతో తోటకు నీళ్లు పోయించిన కథ!

విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కొలువులో తెనాలి రామకృష్ణుడికి ఎంత పేరుందో మనందరికీ తెలుసు కదా! ఆయన కేవలం రాజుగారి సమస్యలనే కాదు, తన సొంత కష్టాలను కూడా తనదైన శైలిలో చిటికెలో పరిష్కరించుకునేవాడు. రామకృష్ణుడికి ఒక అందమైన ఇల్లు, ఆ ఇంటి వెనకాల ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఉదయం, సాయంత్రం ఆ చెట్లను చూసుకుంటూ రామకృష్ణుడు ఎంతో మురిసిపోయేవాడు. ఒకసారి భయంకరమైన వేసవికాలం వచ్చింది.

తెనాలి రామకృష్ణుడి తెలివి: దొంగలతో తోటకు నీళ్లు పోయించిన కథ! Read More »

Tenali Rama Flying Horse Story

ఎగిరే గుర్రం – పాటలు పాడే కుక్క (తెనాలి రామకృష్ణ కథలు)

తెనాలి రామకృష్ణ కథలు : విజయనగర సామ్రాజ్యం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. శ్రీకృష్ణదేవరాయల భువనవిజయ సభలో ఎందరో కవులు, పండితులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి వస్తుండేవారు. ఒకనాడు ఉదయం సభలో అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆస్థాన ద్వారం గుండా ఒక వింత మనిషి లోపలికి వచ్చాడు. అతని వేషధారణ చాలా విచిత్రంగా ఉంది. తలకు పెద్ద రంగుల తలపాగా, ఒంటి నిండా మెరిసే పూసల దండలు, పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు.

ఎగిరే గుర్రం – పాటలు పాడే కుక్క (తెనాలి రామకృష్ణ కథలు) Read More »

TRAITER STORY BY Skanda Puranam

నమ్మకద్రోహి

పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై

నమ్మకద్రోహి Read More »

Tilakashtha Mahishabandhanam

తిలకాష్ఠ మహిషబంధనం

ఓసారి కాశీకి చెందిన ఓ మహాపండితుడు గొప్ప అట్టహాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని హంపి విజయనగరానికి వచ్చాడు. అతడు అప్పటికే ఉత్తర భారతదేశమంతటా పర్యటించి, అనేక మంది హేమాహేమాలాంటి కవిపండితులను వేదవేదాంగ, ఉపనిషత్తాది శాస్త్ర చర్చల్లో ఓడించాడు. #తిలకాష్ఠ మహిషబంధనం# శ్రీకృష్ణదేవరాయలవారు ఆ మహాపండితుని,  సాదరంగా ఆహ్వానించి అతిథిగృహంలో విడిది ఏర్పాట్లు చేయించాడు. మర్నాడు ఆ పండితుడు గొప్ప ఆడంభరంగా సభలోకి ప్రవేశించాడు. వస్తూ,వస్తూనే రాయలవారిని ఉద్దేశించి, “మహారాజా! మీ కొలువులో కాకలుతీరిన పండితులున్నారని విన్నాను. వారిని

తిలకాష్ఠ మహిషబంధనం Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

Tenali Ramakrishna stories

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు

ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో “మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను” అన్నాడు. # వికటకవి తెనాలి రామకృష్ణ కథలు #

వికటకవి తెనాలి రామకృష్ణ కథలు Read More »

srikurma avataram

శ్రీకూర్మావతారం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఒకటి. మత్స్యావతారం తరువాత ఆయన కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. కూర్మం అంటే తాబేలు అని అర్థం. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షంగా రాక్షస సంహారం చేయలేదు. తాబేలు రూపంలో అవతరించి, రాక్షసుల నుంచి దేవతలకు రక్షణ కల్పించాడు. దేవతలు x రాక్షసులు అప్పట్లో దేవతలు, రాక్షసుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీనితో దేవతల శక్తి రోజురోజుకు క్షీణించసాగింది. దీనిని గమనించిన శ్రీమహావిష్ణువు, మరణం లేకుండా అమృతాన్ని సాధించమని దేవతలకు సూచించాడు. అంతే

శ్రీకూర్మావతారం Read More »