2021లో మీ మనసు దోచో Smartphones ఇవే!

LATEST SMART PHONES IN 2021

2020 చేదు అనుభవాలను పక్కనపెట్టి.. ప్రపంచం 2021లోకి అడుగుపెట్టింది. ఇందుకు తగ్గట్టుగానే స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2021లో మీ మనసును దోచేందుకు వరుసపెట్టి smartphonesను సిద్ధం చేస్తున్నాయి. మరి వాటిల్లో కొన్నిటిని చూసేద్దామా!

Samsung Galaxy S21

Samsung Galaxy S series కోసం ప్రతి స్మార్ట్ఫోన్ వినియోగదారుడు ఎదురుచూస్తూ ఉంటాడు. కొత్త లుక్, ఆవిష్కరణ, విడుదల వంటి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆసక్తికనబరుస్తాడు. Samsung కూడా అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తుంది. వినియోగదారులను అస్సలు నిరుత్సాహపరచదు. ఈ ఏడాది కూడా అంతే!

సరికొత్త Exynos 2100 చిప్ ప్రాసెసర్ను ఈ ఏడాది నుంచి Samsung ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని వల్ల స్మార్ట్ఫోన్ పనితీరు ఇంకా మెరుగవుతుంది. # 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! #

అదే సమయంలో Samsung S21ను ఈ ఏడాది ఆవిష్కరించనుంది ఆ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఏడాది S21లో భాగంగా ఎన్ని మోడల్స్ బయటకు వస్తాయన్నది ఆసక్తికర విషయం.

Realme

స్మార్ట్ఫోన్ రంగంలో Realme జోరే వేరు. 2021లోనూ ఈ జోరును కొనసాగించేందుకు Realme ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. సరికొత్త Qualcomm Sandragon 888 SoCతో కూడిన తొలి స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. Realme X50 కూడా ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది.

ఈ ఏడాది తమ నుంచి వచ్చే స్మార్ట్ఫోన్స్లో Realme X7 ముందుంటుందని ఆ సంస్థ సీఈఓ మాధవ్ సేత్ సంకేతం ఇచ్చారు. ఇందులో సరికొత్త Dimenisity 1000+ chipset ఉండే అవకాశముంది. ఇదే జరిగితే ఈ chipsetను ఇండియాలో విడుదల చేసిన తొలి స్మార్ట్ఫోన్గా Realme X7 నిలబడుతుంది. # 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! #

OnePlus 9

2020లో OnePlus కొంత వెనకపడింది. OnePlus Nord ఆకట్టుకున్నప్పటికీ, OnePlus 8T Pro విడుదలకాకాపోవడంతో ప్రీమియం సెగ్మెంట్లో ఆ సంస్థ వెనకపడింది.

దీనిని సరి చేసేందుకు  OnePlus9తో వినియోగదారుల ముందుకు రానుంది సంస్థ. 2021 ప్రథమార్థంలో ఇది విడుదలయ్యే అవకాశముంది. OnePlus నుంచి వచ్చే వాటిల్లో ఈ మోడల్పై చాలా ఆశలున్నాయి. మరోవైపు దీనితో ఇండియా మార్కెట్లో సంస్థ స్థానం భవిష్యత్తు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్కు సంబంధించి కొన్ని వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. 120Hz display, 30W fast charging, Snapdragon 888 Soc ఫీచర్స్ ఇందులో ఉండే అవకాశముంది. మరిన్ని వివరాల కోసం వేచిచూడాల్సిందే. # 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! #

Mi 11

Mi 11 కోసం స్మార్ట్ఫోన్ ప్రియులు కచ్చితంగా ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన Mi 11లో Snapdragon 888 Soc, 6.81-inch OLED screen, QHD+ reslution(3,2000*1,440) ఫీచర్స్ ఉన్నాయి.

ఇండియాలో Mi 10T Pro ధర అమాంతం పెంచేసింది Xiaomi. Mi 11 కూడా ఇదే విధంగా ఉండొచ్చని ఓ అంచనా. చైనాలో ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 45,000(8/128GB). ఇండియాలో ఇది రూ. 50వేల కన్నా తక్కువకు లభిస్తే, డిమాండ్ భారీగా పెరిగే అవకాశముంది. # 2021లో మీ మనసు దోచో Smartphones ఇవే! #

ఇక ఈ సంస్థల నుంచి మరిన్ని వివరాల కోసం వినియోగదారులు ఎదురుచూడాల్సిందే. ఏది ఏమైనా.. కొత్త మోడల్స్ను యూజర్స్ ఎలా ఆదరిస్తారన్నది ఆసక్తిగా మారింది.

                                              – VISWA (WRITER)

Click here: త్వరలో OnePlus Band fitness tracker లాంఛ్‌!

Click here: త్వరలో మార్కెట్లోకి Realme C20!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?