ఆడపిల్ల… ఆ ఆదిశక్తి అవతారం.. నిలువెత్తు మమకారం
నిన్ను కని తాను అమ్మవుతుంది… నువ్వే అన్నీ అనుకుంటుంది… నీ నవ్వే చాలనుకుంటుంది..
పసిపాపలా నీ ఒడిలో ఆడినా… కనురెప్పలా నిన్ను కాపాడినా… అది ఆమెకే సాధ్యం… దానికి నువ్వే సాక్ష్యం…
చెల్లిగా ఆటపట్టించినా… అక్కలా అండగా ఉన్నా… ఆలిలా లాలించినా… అంతటా ఉన్నది తనే.. అన్నీ తానే…
ఆమె ఓ ఆదర్శం.. ఆమే సృష్టికి సర్వస్వం…
ఆమె లేనిది నువ్వు లేవు.. నేనూ లేను.. ప్రపంచమే లేదు…
నేటి ఆడపిల్లే రేపటి అమ్మ.. అమ్మంటే అమ్మ… ఈ సృష్టికి ఆమే అసలు బ్రహ్మ…
నీకు కష్టం వస్తే.. తల్లడిల్లిపోతుంది తల్లి మనసు… నీ కంట కన్నీరు చూస్తే.. అమ్మ హృదయంలో రక్తం కారు తుంది…
ప్రేమతో లాలించినా… పాలిచ్చి పెంచినా… ఆమెకు ఆమే సాటి… ఎవరు ఆమెకు పోటీ ?
కష్టాల సాగుబడిలో నిత్యమూ శిథిలం అవుతున్నా… నీకు గుక్కెడు బువ్వను అందించేందుకు.. రాత్రింబవళ్ళు శ్రమించే అన్నదాత… నీ భాగ్య విధాత.. ఆమే..
కటిక చీకట్లలో చిరు దీపం… అలసిన వేళ వినే సంగీతం… ఆమే
అన్నీ తానై.. నీలో లీనమై.. నీ జీవితంలో భాగమై.. నీలో సగమై… నిలిచిన దేవత.. ఆమే
ఇంత చేసే ఆమెకు ఎవరైనా ఏమివ్వగలం ?.. మరో జన్ముంటే… ఆమెకు అమ్మ అవడం తప్ప… నా అనుకునే తనకు నాన్న అవడం కాక… ఏమివ్వగలం?
– యుగ (కె.ఎం.కె)
ఇదీ చూడండి: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?
ఇదీ చూడండి: మీరు Whatsapp Pay చేశారా?