మోటో నుంచి 5జీ ఫోన్.. అందుబాటు ధరలోనే!

motorola 5g smart phone

మోటోరోలా 5జీ మొబైల్‌ను విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరిట యూరప్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాగా.. అతి త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న ఈ ఫోన్ ధర 299.99 యూరోలు(దాదాపు రూ.26,200). ప్రస్తుతం యూరప్‌లో ఈ మొబైల్ విడుదల కాగా.. భారత్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ సహా మరిన్ని ఆసియా దేశాల్లో రానున్న వారాల్లో ప్రవేశించనుంది. మంచి స్పెసిఫికేషన్స్‌తో రూ.30వేలలోపు ఉండే ఈ ఫోన్ భారత్‌లో ఎంత హిట్టవుతుందో చూడాలి. ప్రస్తుతం 5జీ ఫోన్లు మార్కెట్లో తక్కువగా ఉండడం మోటోకు కలిసొచ్చే అవకాశం ఉంది.

మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే : 6.7 ఫుల్ హెచ్డీ, 394 పీపీఐ
  • ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
  • ర్యామ్ : ఇంటర్నల్ స్టోరేజ్ : 4జీబీ+64జీబీ
  • మూడు వెనుక కెమెరాలు : 48 మెగాపిక్సెల్ ప్రైమరీ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్‌యాంగిల్ షూటర్ + 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్, 20 వాట్స్ ఫాస్ట్ చార్జర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్
  • ధర: 299.99 యూరోలు(దాదాపు రూ.26,200)
                                      – KP (WRITER)

Click here: iPhone 13 ఇలా ఉండనుందా?

Click here: ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?