హాయ్, మీరు మీ భవిష్యత్ అవసరాల కోసం సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకున్నారా? ఒక వేళ మీ సమాధానం ‘లేదు’ అని అయితే, ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారని అర్థం. # Guide to personal financial journey #
నేటి ఉరుకుల పరుగుల జీవన సమరంలో, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే, భవిష్యత్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మీరు సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోండి.
A guide to starting your personal finance journey
ఒక మంచి బడ్జెట్‌ను రూపొందించుకోవాలి:
మీ ఆదాయం ఎంత? మీ ఖర్చులు ఎలా ఉన్నాయి? ఖర్చులు పోగా మిగిలిన సొమ్ములో, పెట్టుబడి పెట్టడానికి ఎంత కేటాయించాలి? అనే ఒక కచ్చితమైన బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి.
ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి:
మీరు మీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలను నిర్ణయించుకోండి.
ఉదాహరణకు స్వల్పకాలిక లక్ష్యం అంటే మంచి ఫోన్ కొనుక్కోవడం, లేదా నచ్చిన ప్రదేశాలను సందర్శించడం మొదలైనవి.
దీర్ఘకాలిక లక్ష్యం అంటే మంచి ఇళ్లు కొనుక్కోవడం, లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు సరిపడా సంపదను పోగుచేయడం మొదలైనవి.
పన్నుల గురించి అవగాహన పెంచుకోవాలి:
మీ పెట్టుబడులపై ఎంత మేరకు టాక్స్ కడుతున్నారో తెలుసుకోండి. టాక్స్ విధానం గురించి కూలంకషంగా తెలుసుకోండి. తరువాత టాక్స్ బర్డెన్ తగ్గించుకునే అవకాశాలను మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.
అత్యవసరాలకు సరిపడా ధనాన్ని ఉంచుకోండి:
జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక ఎలాంటి అత్యవసరాలు ఏర్పడినా, ఇబ్బంది పడకుండా ఉండడానికి, సరైన లిక్విడ్ ఫండ్‌ను మన దగ్గర ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉండాలి. # Guide to personal financial journey #
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి:
స్వల్పకాలిక పెట్టుబడుల కంటే, దీర్ఘకాలిక పెట్టుబడులు మనకు మంచి వెల్త్‌ను జనరేట్ చేస్తాయి. మీరు రిటైర్ అయిన తరువాత మీరు సౌఖ్యంగా జీవించడానికి అవసరమైన కార్పస్‌ను సృష్టించుకోవాలి.
Note: దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మీ రిస్క్ అపటైట్‌ను కూడా ఒకసారి బేరీజు వేసుకోవాలి.
ఇదీ చదవండి: ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?
ఇదీ చదవండి: పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?