ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?

what are financial statements?

హాయ్ ఫ్రెండ్స్ Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Financial statement అంటే ఏమిటో తెలుసుకుందాం.

సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ యొక్క ఆదాయం, వ్యయాల వివరాలు తెలిపే జాబితాను Financial statement అనవచ్చు.

ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినా, కాకపోయినా… ప్రతి ఏటా చాలా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌.

{Note: భారత్‌లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది.. ఏప్రిల్‌ 1తో ప్రారంభమై… వచ్చే సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. (period of 12 months)}

వాస్తవానికి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో ఒక కంపెనీ యొక్క ఆదాయ, వ్యయాలతోపాటు… దాని వాస్తవ ఆర్థిక పరిస్థితి, financial performance వివరాలు కూడా ఉంటాయి. కనుక దీనిని financial report అని కూడా అనవచ్చు.

మరి ఒక ఇన్వెస్టర్‌గా ఈ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను మనం ఎలా చదవాలి. దానిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌కి టెక్నికల్ డెఫినిషన్‌…

ఒక వ్యక్తికి లేదా వ్యాపారానికి లేదా సంస్థకు చెందిన ఫైనాన్షియల్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్‌తో కూడుకున్న రిపోర్ట్‌ను financial statement అంటారు.

ఈ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ ద్వారా ఇన్వెస్టర్స్‌… ఆ కంపెనీకి చెందిన ఆర్థిక పరిస్థితులు గురించి financial activities గురించి తెలుసుకోవచ్చు.

Various financial statements

ఇప్పుడు మూడు ప్రైమరీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ గురించి తెలుసుకుందాం. అవి:

  1. Profit and loss statement
  2. Balance sheet
  3. Cash flow statement

Profit and Loss statement

ప్రోఫిట్‌ అండ్ లాస్ స్టేట్‌మెంట్‌నే income statement అని కూడా అనవచ్చు. ఇందులో ఒక కంపెనీకి చెందిన ఆదాయం, వ్యయాల వివరాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థకి వచ్చిన net profit (or) net loss గురించి ఉంటుంది.

ప్రోఫిట్‌ అండ్ లాస్ స్టేట్‌మెంట్‌లో Income section & Expenditure section ఉంటాయి.

Income sectionలో కంపెనీ యొక్క ఆదాయం… ఏఏ మార్గాల ద్వారా వస్తుందనే వివరాలు ఉంటాయి. అలాగే operating & non-operating income వివరాలు కూడా ఉంటాయి. ఇక్కడ operating income అంటే కంపెనీ చేసే బిజెనెస్ ద్వారా వచ్చేది. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని Non-operating income అంటారు. అంటే ఇది కంపెనీ బిజినెస్‌కి నేరుగా సంబంధం లేని ఆదాయం.

ఉదాహరణకు టైటాన్ కంపెనీ…. వాచీల వ్యాపారం ద్వారా సంపాదించేది operating income.

అలా కాకుండా టైటాన్ కంపెనీ తనకు సంబంధించిన ఆస్తులను అమ్మడం ద్వారా పొందిన ఆదాయం non-operating income.

Expenditure sectionలో కంపెనీకి చెందిన వ్యయాలు ఉంటాయి. ఉద్యోగుల జీతాలు, ప్రయాణ ఖర్చులు, depreciation of assets, equipment costsతో పాటు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్‌ వివరాలు కూడా ఈ expenditure sectionలో ఉంటాయి.

ఒక ఇన్వెస్టర్‌గా మీరు ఈ income and expenditure స్టేట్‌మెంట్‌ను చూసి ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు.

Balance sheet

బ్యాలెన్స్‌ షీట్‌లో కంపెనీకి చెందిన assets మరియు equity and liabilities వివరాలు ఉంటాయి.

బ్యాలెన్స్‌ షీట్‌లోని assets sideలో కంపెనీకి చెందిన current & non-current assets వివరాలు ఉంటాయి.

ఉదాహరణకు, ఓ కంపెనీ విలువైన Land కొన్నది అనుకుందాం. అప్పుడు ఆ landని బ్యాలెన్స్ షీట్‌లోని non-current assets జాబితాలో పొందుపరుస్తారు. బ్యాంకు అకౌంట్‌లోని సొమ్మును current assets sectionలో పొందుపరుస్తారు.

బ్యాలెన్స్ షీట్‌లోని The equity and liabilities sideలో కంపెనీ యొక్క share capital; current and non-current liabilities వివరాలు ఉంటాయి.

ఉదాహరణకు… ఒక కంపెనీ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది అనుకుందాం. దాన్ని non-current liabilities జాబితాలో ఉంచుతారు. అలాకాకుండా వచ్చే ఏడాదికల్లా తీర్చేలా రుణదాతలకు అప్పు తీసుకుంటే దానిని current liabilities sectionలో ఉంచుతారు.

ఒక ఇన్వెస్టర్‌గా మీరు బ్యాలెన్స్ షీట్‌ను చూసి…. ఒక కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకోవచ్చు.

Cash flow statement

ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సంపాదించిన మరియు ఖర్చు చేసిన డబ్బు వివరాలు…. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. ఏంటీ profit and loss statement…… cash flow statement ఒకేలా ఉన్నాయనుకుంటున్నారా? లేదండీ.. రెండింటికీ మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది.

Profit and loss statementలో depreciation of assets లాంటి non-cash ఐటెమ్స్ ఉంటాయి. కానీ Cash flow statementలో కేవలం cash inflow మరియు cash outflow వివరాలు మాత్రమే ఉంటాయి.

క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో ముఖ్యమైన మూడు విభాగాలు ఉంటాయి. అవి:

  1. Cash flows from operating activities
  2. Cash flows from investing activities
  3. Cash flows from financing activities

ఈ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ ద్వారా కంపెనీ యొక్క ఆదాయ మార్గాలను తెలుసుకోవచ్చు. అలాగే ఆ కంపెనీ యొక్క cash generation capacity గురించి కూడా ఒక అంచనాకు రావచ్చు.

ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ – Notes

ఒక కంపెనీకి చెందిన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌లో… కొన్ని ముఖ్యమైన NOTEs ఉంటాయి. ఇవి కంపెనీలకు చెందిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. అలాగే Financial statementను మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఇప్పటి వరకు మీరు చదివింది… ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌కి చెందిన బేసిక్స్ మాత్రమే. తరువాతి ఆర్టికల్స్‌లో ఈ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను ఎలా చదవాలో.. ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకుందాం.

Click here: Different types of markets

Click here: పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?