పేమెంట్ సర్వీసెస్ సంస్థ Paytm ఓ కొత్త ప్రకటన చేసింది. Postpaid వినియోగదారుల కోసం EMI ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ తరహా వినియోగదారులు తమ ఖర్చులను EMIకు మార్చుకోవచ్చు. దీంతో బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా ఎలాంటి వస్తువునైనా కొనుకోవచ్చు. 5లక్షల దుకాణాలు, వెబ్‌సైట్స్‌లో ఈ “Buy now Pay later” స్కీమ్ అందుబాటులో ఉంటుందని Paytm చెప్పింది.
‘బిల్ జెనరేట్ అయిన 7రోజులకు, EMIకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. Postpaidకు రూ. లక్ష క్రెడిట్ లిమిట్ ఉంది. తీసుకున్న EMIని సమయానికి కడితే ఆ క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. రుణాలు కూడా తక్కువగానే ఉంటాయ’ని Paytm వెల్లడించింది. #Paytm వాడుతున్నారా? అయితే ఈ EMI ఆప్షన్ చూడండి…#
క్రెడిట్ లిమిట్‌ను కూడా మూడు రకాలుగా విభజించింది Paytm. Lite( నెలకు రూ. 20,000), Delite, Elite( నెలకు రూ. 1,00,00).
చిన్న దుకాణాల్లో గ్రాసరీస్ నుంచి, పెద్ద మాల్స్‌లోని వస్తువుల వరకు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. బిల్లులను EMIకి మార్చుకోవచ్చు. # Paytm new EMI ఆప్షన్ చూశారా? #
– VISWA (WRITER)
Click here: మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?
Click here: పులి – బాటసారి కథ