ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11!

Xiaomi Mi 11!

Mi 11 సిరీస్లో రెండు మోడల్స్ను ఈ నెల 28న ఆవిష్కరించనుంది Xiaomi. చైనాలో ఈ వేడుక జరగనుంది. అయితే ఆవిష్కరణకు ముందు ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం.. 8/128GB వేరియంట్స్ ధరలు 565 డాలర్లు, 687 డాలర్లు. ఇండియాలో ఫోన్ ధరపై స్పష్టత లేనప్పటికీ.. లీక్ అయిన ధరతో పోల్చుకుంటే రూ. 50,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! #

రూ. 50వేలకు పైనే!

ఇండియాలో 8 GB RAM/256GB storage అయితే రూ. 55వేలు, 12GB RAM/ 256GB storage అయితే రూ. 60వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. Mi 10తో పోల్చుకుంటే ఈ Mi 11 ధర చాలా ఎక్కువగా ఉంటుందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లీక్లో కేవలం ధరల గురించే వార్తలు వచ్చాయి.

అయితే Xiaomi Mi 11 మీద ఇప్పటికే అనేక లీక్స్ బయటకు వచ్చాయి. ప్రపంచంలో Snapdragon 888ను వినియోగించే తొలి మొబైల్గా ఇది నిలవనుంది. దీనిని ఆ కంపెనీ సీఈఓ లీ జున్ కూడా ధ్రువీకరించారు. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! #

ఈ Xiaomi Mi 11లో triple camera ఉంటుందని, 108MP primary camera, ultrawide lens, 30X Zoom సపోర్ట్ చేసే మూడో లెన్స్ ఉంటుందని తెలుస్తోంది. Xiaomi Mi 11 Proకి curved display ఉండే అవకాశముంది. 28న జరిగే వేడుకలో ఈ ఫోన్కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిపోతాయి.

ఇండియాలో ఈ స్మార్ట్ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనేది ఆసక్తిగా మారింది. # ఇండియాలో రూ. 50వేలకు పైనే Xiaomi Mi 11! #

                               – VISWA (WRITER)

Click here: ఇక 15 నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

Click here: సెకండ్ ఛాన్స్

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?