తాత.. ఎందుకిలా చేశావ్​?

తాత నిన్ను తలచుకుంటూ..

నీతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తున్నా..

నువ్వు ఈ లోకంలో కనిపిస్తాను అంటే వల వేసి వెతుకుతా..

కల్లోకి వస్తా అంటే జీవితమంతా

నిద్రపోతూనే ఉంటా…

నువ్వు మళ్లీ పుడతా అంటే ఈ క్షణమే మరణిస్తా…

ఎందుకుంటే ఎప్పటికైన నీ మనుమడిలానే ఉండాలని కోరుకుంటా…

నువ్వు నా వెన్నంటే ఉంటావ్ అనుకున్నా..

కానీ వెన్నుపోటు పొడిచి వెళ్లావ్..

నేను నడిచే దారికి మార్గదర్శకత్వం వహిస్తావ్ అనుకున్నా..

కానీ గగనంలోకి ఎగిరిపోయావ్…

నా జీవితానికి దారి చూపిస్తావ్ అనుకున్నా..

కానీ నా జీవితంలో నుండి తాత అనే పలుకుని తీసుకొని వెళ్లావ్…

మాకు దూరమై ఎంత బాధపడుతున్నవో తెలీదు…

కానీ తాత అనే పదానికి దూరమై అంత కంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను…

అందరికీ తల్లితండ్రులే దైవం అంటారు..

కానీ నాకు అన్ని నువ్వే అంతా నువ్వే..

ఇకపై పండుగలను నీ జ్ఞాపకాలతో గాడుపుతాము..

నువ్వు ఉన్నావన్న భరోసా ఎప్పుడూ ఉండేది..

అదే ఇప్పుడు బలహీనమైంది.
నువ్వు బ్రతుకుతానంటే మా ఆయుష్షు కూడా నీకే ఇచ్చేవాళ్లం..

నీ రుణం ఎలా అయిన తీర్చుకోవచ్చు అనుకున్నాం..

కానీ నువ్వు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు..

నా జీవితానికి పర్యాయపదం అవుతావనుకున్నా..

కానీ అర్థమే లేకుండా చేశావ్…

మా జీవితంలోకి నువ్వు మళ్ళీ రావాలని కోరుకుంటూ…

నీ మనవడు

– శివ కృష్ణ

click here: మా అమ్మమ్మ..

click here: సెకెండ్ ఛాన్స్..

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?