మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా..

rape victim

ఓ మగాడ.. మృగాడ..

మేలుకోరా.. ఇకనైనా మానుకోరా..

ఆడదంటే అంత అలుసా.. నీ కంట్లో నలుసులా నలిపేయడానికి…

ఆడదంటే అంత చులకనా.. పలక మీద రాసే ఆక్షరమా చేరిపేయడానికి..

చొక్కాకి అంటుకున్న మరకనా.. గడ్డి పరకనా తీసిపారేయాడానికి…

మేలుకోరా మృగాడా.. ఇకనైనా మానుకోరా…

మారిపోరా మగాడా.. ఇకనైనా మారిపోరా…

అమ్మా అని అంటావు.. యాసిడ్లు పోస్తుంటావు..

చెల్లి అని అంటావు.. చీరపట్టి లాగేస్తావు…

అక్క అని అంటావు.. ఎత్తుకెళ్లిపోతావు…

ఆడదాన్ని ఆట బోమ్మ చేసి ఆడుకుంటున్నావు..

మేలుకోరా మగాడా.. ఇకనైనా మేలుకోరా..

మారిపోరా మగాడా.. ఇకనైనా మారిపోరా…

ఈ సృష్టికి మూలం ఆడది… మగాడి జన్మకి కారణం ఆడది…

మానవ జీవనానికి దారం.. ఆధారం ఆడది..

ఈ పుట్టుకకి కారణం ఆడది.. నీతో ఏడడుగులు నడిచేది ఆడది..

ఆడదంటే అబల కాదురా.. రగిలే అగ్గిరవ్వరా…

ఇకనైనా మేలుకోరా మగాడా..

ఓ దరిద్ర మానవుడా…

                                                   – శివ కృష్ణ

ఇదీ చదవండి: తాత.. ఎందుకిలా చేశావ్?

ఇదీ చదవండి: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?