Modern literature

words from heart

మనసు మాటున మాటలు..

# మనసు మాటున మాటలు.. # ఆశయమే ఆయుధం.. ఆశలే ఆయువు.. ఊహలే ఊపిరి.. కోపమే ఉప్పెన.. శాంతమే సాంత్వన.. అంతమే ప్రశాంతం.. ఆశల పల్లకిలో.. ఊహల ఊయలలో.. రేపటి భవితలో.. నేటి కలలో.. కన్నీటి అంచున.. కష్టాల మాటున.. గుండె రోదన.. తెలియని వేదన.. మోయలేని బాధ.. తీరని వ్యథ.. ఏది ఏమైనా సాగాలి జీవన రథం.. లాగాలి జగన్నాథ రథచక్రం.. ఏ కళ్లు చూసినా ఇదే కథ.. ఏ మనిషిని కదిలించినా ఇదే వ్యథ.. […]

మనసు మాటున మాటలు.. Read More »

wait for lover

నిరీక్షణ..

నీ కోసమే ఈ అన్వేషణ… నీ కోసమే ఈ నిరీక్షణ… యదలో పొంగే ఆనందానికి… మదిలో ఉప్పొంగే దుఃఖానికి… పెదవి చాటున మౌనానికి… గుండె మాటున భావానికి… రేపటి స్వప్నానికి… నేటి సత్యానికి… క్షణక్షణం… ప్రతిక్షణం… నీవే సాక్ష్యం… ఈ జీవితం ఓ కాగితం… ప్రేమతో నువ్వు చేసిన సంతకం… క్షణాలు కరిగిపోతున్నాయి… గంటలు గడిచిపోతున్నాయి… రోజులు యుగాల్లా గడుస్తున్నాయి… కానీ నీ జ్ఞాపకాలే ఊపిరిగా… నీ ఆశలే ఆయువుగా… నువ్వే నా సర్వంగా… బతికేస్తున్నా… ఎందుకో

నిరీక్షణ.. Read More »

street dogs

ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు?

అహమ్.. అహమ్… హాయ్! హెల్లో! నమస్తే!… ఎలా ఉన్నారు? ఏంటి? నేను ఎవరా? అని అనుకుంటున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం ఆగండి…. ‘భౌ…భౌ…భౌ….’ హా…. ఇప్పుడు గుర్తుపట్టారా? నేనే.. రోజూ మీ వీధి చివర్లో ఉన్న కారు కింద పడుకునే కుక్కని. కుక్క ఏంటి ఇలా గడగడా మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదండి… ఆ దేవుడు నాకో వరం ఇచ్చాడు. ఒక్క రోజు పాటు నా మాటలు మీకు.. అదే మనుషులకు వినపడుతుందని వరం ఇచ్చాడు.

ఏమిటి ఈ ‘మనిషి’ బ్రతుకు? Read More »

mother

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి

ఆడపిల్ల… ఆ ఆదిశక్తి అవతారం.. నిలువెత్తు మమకారం నిన్ను కని తాను అమ్మవుతుంది… నువ్వే అన్నీ అనుకుంటుంది… నీ నవ్వే చాలనుకుంటుంది.. పసిపాపలా నీ ఒడిలో ఆడినా… కనురెప్పలా నిన్ను  కాపాడినా… అది ఆమెకే సాధ్యం… దానికి నువ్వే సాక్ష్యం… చెల్లిగా ఆటపట్టించినా… అక్కలా అండగా ఉన్నా… ఆలిలా లాలించినా… అంతటా ఉన్నది తనే.. అన్నీ తానే… ఆమె ఓ ఆదర్శం.. ఆమే సృష్టికి సర్వస్వం… ఆమె లేనిది నువ్వు లేవు.. నేనూ లేను.. ప్రపంచమే లేదు…

ఆడపిల్ల = వెలకట్టలేని ఆస్తి + సృష్టికి స్ఫూర్తి Read More »

lovers

నీ స్నేహం…

నీ స్నేహం… ఓ మధుర ఙ్ఞాపకం కన్నుల ముందు వెన్నెలలా… వసంతాన కోయిలలా… అమ్మ చూపే జాబిలిలా… నీ స్నేహం…ఓ కమ్మని కావ్యం సందె పొద్దు సూరీడులా… సముద్రంలో కెరటంలా… పసిపాప చిరునవ్వులా… నీ స్నేహం…ఓ చల్లని సాయత్రం నా మనసులో మాటలా… ఎప్పటికీ నిలిచే తోడులా… నిను వీడని నీడలా… నీ స్నేహం…ఓ తియ్యని వరం నీ కోపానికి కారణంలా… నిను బుజ్జగించే మాటలా… నీ మంచి కోరే నీవాడిలా… నీ స్నేహం…ఓ మరపురాని మధుర

నీ స్నేహం… Read More »

self confidence

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు… చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు… చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు.. కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా? ఓ పిట్ట కథ… సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? Read More »

shankaracharaya

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం

ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో, భక్తితో ఉండటానికి తనంత తాను విధించుకున్న నియమాల చేత ప్రవర్తిస్తే వేరొకరికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒకసారి ఆదిశంకరాచార్యుల దగ్గరికి వచ్చింది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్లి ఒకరు ఇలా అడిగారు. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం # “మీరు భగవంతుడు ఉన్నాడు.. ఉన్నాడు.. అని చెప్తారు. మీరు ఇంత అందగాడు.. ఇంత సౌందర్యమూర్తి.. సన్యసించి.. ముండనం చేయించుకుని.. ఆ కాషాయ బట్ట కట్టుకొని.. సత్య దండం

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం Read More »

atla tadhiya

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం..

దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే… కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండుగలు మరికొన్ని… అలాగే ప్రతిరోజు పండుగలా జరుపుకునే తెలుగు ప్రజలు అనుసరించి… జరుపుకునే పండుగలు ఇంకొన్ని. అటువంటి పండుగలలో ఒకటి అట్లతద్ది… # రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. # ఇది కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునేదే కాదు… అతివల ఆటపాటలకు పెట్టింది పేరు అట్లతద్ది పండుగ. పండుగ వస్తుందంటే పల్లెల్లో ప్రతి ఇంటా ఉండే సందడే వేరు… వేడుక కోసం పెద్దలు ఏర్పాట్లు

రారండో.. అట్లతదియ వేడుక చేసుకుందాం.. Read More »

siva arjuna war

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా? Read More »

srikrishna

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »

error: Content is protected !!