Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

fundamental analysis part 4

Fundamental analysis Part-4

ఆన్యువల్ రిపోర్ట్‌ (Annual Report) అంటే ఏమిటి? దానిని ఎలా అధ్యయనం చేయాలి?

పాఠశాలలో చదువుకున్న రోజులు గుర్తున్నాయా? ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఓ రిపోర్ట్ కార్డును మనకి ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ కార్డులో ఆయా సబ్జెక్ట్లలో మనకు వచ్చిన మార్కులు ఉండేవి. వాటితోపాటు మన ప్రవర్తన పట్ల టీచర్లు ఇచ్చే రిమార్క్స్ కూడా ఉండేవి! అంటే ఆ రిపోర్ట్‌ కార్డులో మనకు సంబంధించిన క్వాంటిటేటివ్(quantitative) మరియు క్వాలిటేటివ్(qualitative) అసెస్మెంట్ ఉండేది.

ఇదే విధంగా, ఓ కంపెనీకి సంబంధించిన క్వాంటిటేటివ్మరియు క్వాలిటేటివ్ రిపోర్టులను ఒక్క చోట చేరిస్తే, దానినే ఆన్యువల్ రిపోర్ట్(annual report) అని అంటారు. కంపెనీ మేనేజ్మెంట్ దీనిని రూపొందిస్తుంది. ఈ  రిపోర్టులో కంపెనీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు చాలా వివరంగా ఉంటాయి. అందువల్ల ఆన్యువల్ రిపోర్టు చాలా పెద్దది(very lengthy)గా ఉంటుంది.

ఆన్యువల్ రిపోర్ట్‌ను ఎలా అధ్యయనం చేయాలి?

ఉదాహరణకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్‌ (HUL)కు సంబంధించిన 2019-20 ఆన్యువల్ రిపోర్టును తీసుకుందాం. కంపెనీ వెబ్సైట్ నుంచి ఈ రిపోర్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఓ ఆన్యువల్ రిపోర్టును మనం ఎలా అధ్యయనం చేయాలో దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆన్యువల్ రిపోర్టులో ఏమేమి ఉంటాయి?

వాస్తవానికి ఆన్యువల్ రిపోర్టులు ఓ స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఉండవు. ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా దీనిని రూపొందిస్తుంది. అయితే సమాచారం ఉన్న ఆర్డర్ వేరుగా ఉన్నప్పటికీ, లోపల ఉన్న విషయం మాత్రం ఒక్కటే.

ప్రస్తుతం HUL ఆన్యువల్ రిపోర్టును చూద్దాం.

ఓవర్వ్యూ (overview)

కంపెనీకి సంబంధించిన వివిధ అంశాలు ఈ ఓవర్‌వ్యూ సెక్షన్‌లో ఉంటాయి.ఈ ఓవర్‌వ్యూ సెక్షన్‌లో అనేక సబ్‌-సెక్షన్‌లు ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

  1. కంపెనీ యొక్క వివరాలు (About the company)

ఈ సబ్‌సెక్షన్‌ ద్వారా కంపెనీ యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో కంపెనీ సాంధించినవి ఇందులో ఉంటాయి.

HULలో అయితే కంపెనీ బ్రాండ్, ప్రోడక్ట్‌ లైనప్‌, సప్లై చైన్ మెట్రిక్స్‌ (supply chain metrics) తో పాటు మరికొన్ని వివరాలు ఉంటాయి.

  1. ఛైర్మన్ స్టేట్మెంట్

    షేర్ హోల్డర్లను ఉద్దేశించి కంపెనీ ఛైర్మన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇందులో ఏడాది కాలంలో కంపెనీ పర్ఫార్మెన్స్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. HUL ఆన్యువల్ రిపోర్టులో కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, అచీవ్మెంట్స్, పరిశ్రమకు చెందిన ట్రెండ్స్ గురించి ఛైర్మన్‌ సవివరంగా మాట్లాడారు.

  1. బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్

    ఇది బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ను షేర్హోల్డర్లకు పరిచయం చేస్తుంది. డైరెక్టర్ల పేర్లు, కంపెనీలో వారి పొజిషన్స్‌ (Positions) గురించి ఇక్కడ ఉంటుంది. వారి ఫొటోలను కూడా జతచేస్తారు.

  1. మేనేజ్మెంట్ కమిటీ

కంపెనీకి సంబంధించిన వివిధ కార్యకలాపాలను చూసుకునేందుకు వేరువేరు కమిటీలు ఉంటాయి. ఇక్కడ ఆ కమిటీల పేర్లు, వాటిలో ఉన్న ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్ల పేర్లు ఉంటాయి. మరియు వారి ఫొటోలు కూడా ఉంటాయి.

  1. కంపెనీ పర్ఫార్మెన్స్

    గతేడాది కంపెనీ పర్ఫార్మెన్స్కు సంబంధించిన హైలైట్స్ ఇందులో ఉంటాయి. ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంశాలు ఇందులో ఉంటాయి.

HULలో అయితే పర్ఫార్మెన్స్ సెక్షన్ను రెండుగా విభజించారు.

  • ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్:-

    ఇందులో కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ (profit and loss statement), బ్యాలెన్స్ షీట్ (balance sheet), ముఖ్యమైన ఫైనాన్షియల్ రేషియోలు, షేర్ ధరల వివరాలను హైలైట్ చేశారు.

  • యూనిలివర్ సస్టైనబుల్ లివింగ్ ప్లాన్:

    పర్యావరణానికి సంబంధించి కంపెనీ తీసుకున్న ఇనీషియేటివ్స్ గురించి ఇందులో వివరించారు.

  1. మ్యాక్రో ఎకనామిక్‌ కండిషన్స్‌ అండ్ ఔట్లుక్ (macro economic conditions and outlook)

    ప్రతి కంపెనీ ఏదో ఒక ఇండస్ట్రీకి చెందినదై ఉంటుంది. కనుక కంపెనీ ఏ ఇండస్ట్రీకి చెందిందో, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరుస్తారు.  అలాగే కంపెనీని, షేర్హోల్డర్లని ప్రభావితం చేయగలిగే కీ ట్రెండ్స్ గురించి, ఆర్థిక పరిస్థితులను గురించి… వాటికి తగ్గట్టుగా కంపెనీ తీసుకుంటున్న చర్యలను గురించి ఇందులో పొందుపరుస్తారు.

HUL ఆన్యువల్‌ రిపోర్ట్‌లో ‘Our fast-changing world’ అనే టైటిల్తో ఉన్న సెక్షన్లో ఈ వివరాలు ఉంటాయి.

  1. కంపెనీ స్ట్రాటెజీ (strategy)

కంపెనీ విజన్, మిషన్ స్టేట్‌మెంట్స్‌ను ఇందులో పొందుపరుస్తారు. తన విజన్ వైపు అడుగులు వేసేందుకు కంపెనీ తీసుకున్న బిజినెస్, నాన్-బిజినెస్ స్ట్రాటజీలను కూడా ఇందులో వివరిస్తారు.

  1. కంపెనీ యొక్క బిజినెస్ మోడల్

    కంపెనీ బిజినెస్ మోడల్కు సంబంధించిన బ్లూప్రింట్ ఇక్కడ లభిస్తుంది. కంపెనీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఎంతమేరకు పనిచేస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుస్తుంది.

రిపోర్ట్స్ (Reports):-

కంపెనీ పర్ఫార్మెన్స్, రెగ్యులేటరీ, గవర్నెన్స్ ఆస్పెక్ట్(governance aspect)కు సంబంధించిన వివిధ అంశాలు ఈ సెక్షన్లో ఉంటాయి. వీటిని చదివే కొద్దీ… కంపెనీ యొక్క నాన్-ఫైనాన్షియల్ వివరాలు తెలుస్తాయి.

రిపోర్టుల్లో లభించే వివరాలను ఓసారి చూద్దాం..

రిపోర్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్/ మేనేజ్మెంట్ డిస్కషన్స్  అండ్‌ ఎనాలసిస్

మేనేజ్‌మెంట్ డిస్‌కషన్స్‌ అండ్‌ ఎనాలసిస్‌ ఎంతో కీలకమైన సెక్షన్. దీనిలో కంపెనీని ప్రభావితం చేసే స్థూల ఆర్థిక అంశాలపై చర్చిస్తారు.

ఒక వేళ ఆ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలోనూ పనిచేస్తూ ఉంటే, కంపెనీపై ప్రభావం చూపించే అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చిస్తుంది.

అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి కంపెనీ చేపడుతున్న చర్యలు గురించి కూడా ఈ సెక్షన్‌లో వివరిస్తారు.

మార్కెట్లో కంపెనీకి ఎదురవుతున్న సవాళ్లు గురించి, మందగమనం గురించి, వాటిని ఎదుర్కొనేందుకు తాము తీసుకుంటున్న చర్యలు గురించి కూడా ఈ సెక్షన్‌లో వివరిస్తారు.

కంపెనీ యొక్క భవిష్యత్ చర్యలు గురించి స్పష్టమైన అవగాహన పొందాలంటే, ఇన్వెస్టర్లు కచ్చితంగా మేనేజ్‌మెంట్ డిస్‌కషన్ అండ్ ఎనాలసిస్‌ను చూడాల్సి ఉంటుంది.

గమనిక:

కంపెనీ మేనేజ్‌మెంట్ డిస్‌కషన్‌ అండ్ అనాలసిస్‌ సెక్షన్‌ విషయంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, సాధారణంగా చాలా కంపెనీలు తమపై ప్రభావం చూపించే ప్రతికూల అంశాలను దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కనుక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిణామాలను గురించి మీరు వేర్వేరు మార్గాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో కంపెనీకి ఎలాంటి లాభాలు ఉండవు. వృద్ధి కూడా మందగమనంలో ఉంటుంది. అయినా కూడా అధికారుల వేతనం మాత్రం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి కంపెనీల విషయంలో మదుపరులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్‌

ఏడాది కాలంలో కంపెనీకి సంబంధించిన వివిధ ఫైనాన్షియల్ హైలైట్స్, అచీవ్మెంట్స్ ఈ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ రిపోర్టులో ఉంటాయి. కంపెనీని ప్రభావితం చేయగలిగే అంశాల గురించి కూడా ఇందులో సవివరంగా ఉంటుంది.

బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ రిపోర్టులో ఉండేవి

board of directors report                                          board of directors report

 

ఇప్పటి వరకు మనం ఒక కంపెనీకి సంబంధించిన క్వాలిటేటివ్ అంశాలను మాత్రమే చూశాం. ఇకపై మనం క్వాంటిటేటివ్‌ అంశాలను తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్:-

ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే ఈ సెక్షన్తో క్వాంటిటేటివ్ అంశాలు మొదలవుతాయి. వాటిని చూద్దాం..

  1. Standalone Financial Statements

కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారానికి చెందినవి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ సెక్షన్లో ఉండే అంశాల పేర్లును ఓసారి చూద్దాం. వాటి గురించి రానున్న ఛాప్టర్లలో మరింత వివరంగా  తెలుసుకుందాం.

Standalone Financial Statements                                          Standalone Financial Statements

  1. Consolidated Financial Statements

ఓ కంపెనీకి ఒకటి లేదా అంతకు మించిన అనుబంధ సంస్థలు (subsidiaries) ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ను రూపొందిస్తారు. ఇందులో కంపెనీ ప్రధాన వ్యాపారంతో పాటు అనుబంధ సంస్థల ఫైనాన్షియల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఉండేవి..

Consolidated Financial Statements                                       Consolidated Financial Statements

ఇతర వివరాలు:-

ఈ సెక్షన్లో కంపెనీకి సంబంధించిన ఇతర వివరాలు ఉంటాయి.

  • Awards and recognition
  • Corporate information

దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి?

ఆన్యువల్ రిపోర్టులో కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా Profit and loss statement, balance sheet, cash flow statements ఉంటాయి. ఫండమెంటల్ ఎనాలసిస్కు ఇవి ఉపయోగపడతాయి. వీటి గురించి మరింత వివరంగా తరువాతి ఛాప్టర్లలో తెలుసుకుందాం.

ముఖ్యమైన అంశాలు

  • ఆన్యువల్ రిపోర్టును కంపెనీ మేనేజ్మెంట్ రూపొందిస్తుంది. కంపెనీకి చెందిన వివిధ అంశాలు ఇందులో సవివరంగా ఉంటాయి.
  • కంపెనీ చరిత్ర, ఏడాది కాలంలో కంపెనీకి సంబంధించిన హైలైట్స్ ఇందులో ఉంటాయి.
  • ఏడాది కాలంలో కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి ఆ కంపెనీ ఛైర్మన్ వివరిస్తారు (ఛైర్మన్ స్టేట్మెంట్).
  • బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల వివరాలు ఉంటాయి.
  • ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్‌ ఉంటాయి.
  • ఆన్యువల్‌ రిపోర్ట్‌లో కంపెనీ ఏ ఇండస్ట్రీకి చెందినదో, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వివరాలు ఉంటాయి.
  • కంపెనీ విజన్, మిషన్‌ స్టేట్‌మెంట్స్‌, బిజినెస్‌ మోడల్‌ గురించి ఆన్యువల్‌ రిపోర్టులో వివరిస్తారు.
  • కంపెనీ యొక్క standalone financial statements, consolidated financial statements కూడా ఈ ఆన్యువల్ రిపోర్టులో ఉంటాయి.

Click here: ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Click here: ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?