ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్

Fundamental analysis part 3

                                     Fundamental analysis Part – 3

ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరియు వారికి సలహాలు ఇచ్చే విశ్లేషకులు (Analysts)  దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్‌ను, స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు.

వ్యత్యాసం ఏమిటి?

ఫండమెంటల్ ఎనాలసిస్ – టెక్నికల్ ఎనాలసిస్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకునేందుకు మనం ఓ ఉదాహరణను తీసుకుందాం.

చిరంజీవి, బాలకృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. బాలకృష్ణ శాశ్వతంగా ఉండడానికి ఓ ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉండగా, చిరంజీవి మాత్రం కొద్ది కాలం నివసించేందుకు ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటే చాలు అనుకుంటున్నాడు.

ఇల్లు కొనే ముందు బాలకృష్ణ ఏవేవి చూస్తాడు?
 • ఇల్లు కొనేందుకు ఇది సరైన ప్రదేశమేనా?
 • భవిష్యత్తులో ఇక్కడి ల్యాండ్కున్న విలువ పెరుగుతుందా?
 • పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి?
 • ఇంటి ధర సమంజసంగానే ఉందా? లేక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉందా?
 • ఈ పెట్టుబడి భవిష్యత్తులో వృద్ధిచెందుతుందా?
మరోవైపు.. అద్దె ఇళ్లు కోసం వెతుకున్న చిరంజీవి ఆలోచనలు వేరుగా ఉన్నాయి!
 • ఇంటికి కట్టాల్సిన అడ్వాన్స్ ఎంత?
 • ఆ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా అద్దె ఛార్జీల్లో ట్రెండ్ ఎలా ఉంది?
 • వచ్చే ఏడాది అద్దె ఎంత పెరిగే అవకాశముంది?
 • ఏ నిబంధనలతో అద్దెను పెంచుతారు?
 • ఇంటి యజమాని కండీషన్లు ఏంటి?

ఈ ఉదాహరణను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఒక ఇళ్లు కొనుక్కొని, దానిలో దీర్ఘకాలంపాటు జీవించాలనుకుంటున్న బాలకృష్ణ, తను కొనాలనుకుంటున్న ప్రాపర్టీ గురించి ఫండమెంటల్ ఎనాలసిస్ చేస్తున్నాడు. మరోవైపు స్వల్పకాలంపాటు ఉండడానికి కేవలం అద్దె ఇళ్లు కోసం చూస్తున్న చిరంజీవి, టెక్నికల్ ఎనాలిసిస్ చేస్తున్నాడు.

ఇదే విధంగా, స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్ను, ట్రేడర్లు స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్ను ఉపయోగిస్తూ ఉంటారు.

ఇప్పుడు టెక్నికల్ ఎనాలసిస్ గురించి మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

టెక్నికల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

హిస్టారికల్‌ డేటాను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఓ కంపెనీ షేరు కదలికలను అంచనా వేయడమే టెక్నికల్ ఎనాలసిస్. ఇందుకోసం ఛార్ట్లు, గ్రాఫ్‌లు, పాటర్న్లను అధ్యయనం చేసి ట్రేడింగ్ అవకాశాలను గుర్తించాల్సి ఉంటుంది.

టెక్నికల్ ఎనాలసిస్ను మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణను చూద్దాం.

నాగార్జున అనే ఒక ట్రేడర్ను తీసుకుందాం. స్టాక్ మార్కెట్లో స్వల్పకాలంలో అధిక లాభాల కోసం అతను చూస్తున్నాడు. అందుకోసం అతను ABC అనే కంపెనీ స్టాక్ను కొంత కాలంగా గమనిస్తున్నాడు.

 • నెల రోజుల క్రితం వరకు ABC స్టాక్ రూ.100 వద్ద ట్రేడవుతూ ఉండేది.
 • అదే స్టాక్ ఇప్పుడు రూ.55కి పడిపోయింది.

స్టాక్ ధర పడిపోయింది కాబట్టి.. అందులో పెట్టుబడి పెట్టకూడదని మనలాంటివాళ్లం అనుకుంటాం. కానీ దీన్నే ట్రేడర్ నాగార్జున అవకాశంగా తీసుకుంటాడు.

స్టాక్ ధర పడిపోతుంటే కొనుగోలు చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా! దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది.

 • గత 52 వారాల్లో ఆ స్టాక్ కదలికలకు సంబంధించిన ఛార్ట్లను నాగార్జున పరిశీలిస్తున్నాడు.
 • ఈ ప్రైజ్ ఛార్ట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. 52 వారాల్లో ఆ స్టాక్ ఎదుర్కొన్న ఒడుదొడుకులు నాగార్జునకు అర్థమయ్యాయి.
 • ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, స్టాక్ ధర రూ.50 కన్నా దిగువకు ఎప్పుడూ పడిపోలేదు. రూ.50 మార్కు పైనే ట్రేడవుతూ వచ్చింది.
 • 52 వారాలుగా ఇదే జరుగుతోంది. కనుక ఈసారి కూడా ఇదే జరిగే అవకాశముందని నాగార్జున బలంగా నమ్మాడు. (హిస్టరీ రిపీట్స్ అనే సూత్రం ఆధారంగా.)
 • అందుకే ట్రేడర్ నాగార్జున ABD స్టాక్‌ ప్రైజ్‌ రూ.55 దగ్గర ఉన్నప్పుడు ఆ స్టాక్స్‌ను కొనుగోలు చేశాడు.
 • ఒకవేళ స్టాక్ ధర రూ.55 కన్నా కిందపడినా నాగార్జున భయపడడు. టెక్నికల్ ఎనాలసిస్ ప్రకారం కొన్ని రోజుల్లో లేదా నెలల్లో అది పుంజుకుంటుందని అతనికి తెలుసు. కనుక లాభాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న షేర్లను అమ్మేందుకు అతను ప్రణాళికలు వేసుకుంటున్నాడు.

* టెక్నికల్ ఎనాలసిస్లో ‘ప్రైజ్ – వ్యాల్యూం’ అనే రెండు అంశాలు కూడా ఎంతో కీలకం.

ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్ టెక్నికల్ ఎనాలసిస్

  ఫండమెంటల్ ఎనాలసిస్ టెక్నికల్ ఎనాలసిస్
సోర్స్ ఆఫ్ డేటా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, మేనేజ్మెంట్‌, ఇండస్ట్రీ డేటా ఆధారంగా ఫండమెంటల్ ఎనాలసిస్ చేస్తారు. స్టాక్‌ ప్రైజ్, వాల్యూం కదలికల ఆధారంగా టెక్నికల్ ఎనాలసిస్ చేస్తారు.
పర్పస్ ఆఫ్ ఎనాలసిస్ ఓ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూను లెక్కించి, ఆ కంపెనీ ధర ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అన్నది విశ్లేషించవచ్చు. ట్రేడింగ్ అవకాశాలను గుర్తించవచ్చు.
టైమ్‌లైన్ దీర్ఘకాల పెట్టుబడులు స్వల్పకాల పెట్టుబడులు

పరిశీలించే

మెట్రిక్స్

కంపెనీ అస్తులు, అప్పులు(లయబులిటీస్), ఆదాయం, ఖర్చులు, క్యాష్ ఫ్లో, ఫైనాన్షియల్ రేషియో

స్టాక్‌ ప్రైజ్, వాల్యూం, ఛార్టులు, గ్రాఫ్స్, ట్రెండ్స్, స్టాక్ పాటర్న్

నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్‌ కంపెనీ డేటాను పరిగణలోకి తీసుకుని పెట్టుబడిపై నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్ డేటాను బట్టి ట్రేడింగ్‌పై నిర్ణయం తీసుకుంటారు.

ముఖ్యాంశాలు

 • దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఫండమెంటల్ ఎనాలసిస్, స్వల్పకాల పెట్టుబడుల కోసం టెక్నికల్ ఎనాలసిస్ ఉపయోగపడతాయి.
 • హిస్టారికల్‌ డేటా ఆధారంగా షేర్ల కదలికలను అంచనా వేసేదే టెక్నికల్ ఎనాలసిస్. దీనిలో ఛార్ట్లు, గ్రాఫ్స్, పాటర్న్స్‌, ట్రెండ్స్ను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
 • ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్లు పూర్తిగా భిన్నమైనవి. వీటి సోర్స్‌ ఆఫ్ డేటా, ఇన్వెస్ట్‌మెంట్‌ టైమ్లైన్, మెట్రిక్స్ కూడా భిన్నంగా ఉంటాయి.

Click here: ఫండమెంటల్‌ ఎనాలిసిస్ పార్ట్‌ -2

Click here: మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?