100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’!

mitran atmanirbhar app

వీడియో షేరింగ్ app mitron, Atmanirbhar పేరుతో ఓ కొత్త appను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 100కుపైగా దేశీయ apps అన్నీ ఈ ఒక్క appలో ఉంటాయి. వాటి సర్వీసులు, మన అవసరాల తగ్గట్టు ఈ ఒక్క appలో వాటి గురించి తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఇది మరింత దోహదపడుతుందని mitron అంటోంది.

100కుపైగా Indian Apps

వ్యాపారం, ఈ లర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్, సోషన్తో పాటు వివిధ క్యాటగిరీల్లో దేశీయ apps ఇందులో దర్శనమిస్తాయి. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే చాలు, మనకు కావాల్సిన appsను సులభంగా వెతికేయొచ్చు. ఆ Apps size, downloads, appకి సంబంధించిన description కూడా Atmanirbhar appలో ఉంటాయి. Get app ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి నేరుగా ఆ appను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ app ఆండ్రాయిడ్లో మాత్రమే అందుబాటులో ఉంది. IOSలో దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Click here: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?

Click here: సెకెండ్ ఛాన్స్‌

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?