పెళ్లి అంటే…

indian marriage

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే #

వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు కాబోతున్న ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవాభిమానాలు ఉండాలి. దాంపత్యం మీద, సమాజంపై అవగాహన కలిగి ఉండాలి. అవతలి వ్యక్తిని స్వార్ధంతో బాధించరాదు. ఆనందం పొందడం కంటే ఇవ్వడం ప్రధాన కర్తవ్యమని భావించాలి.

మనం నిత్యం చుట్టూ చాలామందిని చూస్తుంటాం.. అసలు వాళ్ళెందుకు వివాహం చేసుకున్నారో అనిపిస్తుంటోంది. కొట్టాంలో పశువులు కుమ్ములాడుకున్నట్లు పోట్లాడుకుంటారు. ఎంతో ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని వ్యర్థ తగాదాలతో, అర్థంలేని ఆవేశాలతో నాశనం చేసుకుంటున్నారు.

పెళ్లంటే ఒకరి నుంచి వేరొకరిని విడదీయలేని బంధంలా పెనవేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వారికున్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్ళలా కలిసిపోవాలి. తమ జంట ఇతరులకు ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాలి. అన్యోన్య దాపంత్యం ఉన్న ఇళ్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి జీవిత నిర్మాణానికి తన సహచర భాగస్వామితో కలసి సంసార కుటీరాన్ని నిర్మించుకోవాలి.

నిజానికి యువతీ యువకులకు తమ జీవితంలోకి రాబోయే సహభాగస్వామి గురించి స్పష్టమైన అవగాహన అవసరం. ఇలాంటివి ప్రేమ పెళ్లిళ్లలో ఉంటాయంటారు. కాని కొంతమంది ఆకర్షణకు ప్రేమకు తేడా తెలియక చివరకు ఒక్కటయ్యాక ఎప్పుడు విడిపోతామా అన్నట్లు ఉంటారు. అలాంటి సంబంధాలకు ప్రేమ రంగును పులమొద్దు. అది మోసం.

పెళ్లి అనే బంధంతో సహభాగస్వామే మనకు సమస్తమై ఉండాలి. వేరే ఆలోచన మీ మనసులోకి వస్తే అది మీ జీవింతంలోకి చొరబడి సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పెళ్లికి ముందు తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకుంటున్న మనమంతా… వివాహం తర్వాత అటు అత్తింటివారికి, ఇటు సమాజానికి జవాబుదారిగా ఉండాలి. కొంతమంది ఇతరుల ప్రోద్బలంతో జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. అది మీ ఇద్దరికీ చాలా ప్రమాదకరం. అలాంటి వారితో సాధ్యమైనంత దూరంగా ఉండండి. వారి మనసులోని ఆంతర్యాన్ని గ్రహించండి.

పెళ్లైన కొత్తలో జరిగే చిన్న చిన్న గొడవలు జీవితాంతం వేదిస్తుంటాయి. ఉదాహరణకు పెళ్లి వేడుకల్లో గొడవలు ఇరువైపుల వారు ఎప్పటికీ మరచిపోరు. ఇతరుల మధ్యలో ఉన్నప్పుడు భార్యను చులకనగా మాట్లాడకండి. అది మీకే ప్రతికూలంగా మారుతుంది. వీలైంనంత వరకూ ఇలాంటివి తలెత్తకుండా చూసుకోండి. # పెళ్లి అంటే #

ఎన్నో ఆశలతో మనింట అడుగెట్టిన వారికి మీరెంత ప్రాధాన్యం ఇస్తున్నారో మాటల్లో కాదు చేతల్లో తెలపండి. ఖరీదైన బహుమతులు విందు వినోదాలు తాత్కాలిక సంతృప్తిని మాత్రమే ఇస్తాయి. ఆమె/ అతడి స్థానం మీ హృదయంలో ఏస్థాయిలో ఉందో తెలిసేలా చేయండి.

భారతదేశం ఇతరదేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందంటే మన వివాహ వ్యవస్థే కారణం. కాని మనం పాశ్చాత్య పోకడల మోజులోపడి దానికి తూట్లు పొడుస్తున్నాం. మన పూర్వీకులు జీవితం పట్ల అవగాహన, భాగస్వామిపై గౌరవం, కలిగి ఉండేవారు. అప్పట్లో ఉన్నత చదువులు లేకపోయినా ఎంతో సమర్దవంతంగా కుటుంబాల్ని నడిపించారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నవ వధువరులు జీవన గమానానికి బాటలు వేసుకోవాలి. ఇదే సమాజానికి ఎలుగెత్తిచెప్పే వసుదైక కుటుంబ వ్యవస్థ.

                                                                                           – అమ్ము, (రచయిత)

ఈ మంచి కథ చదివారా: ఈ మాట అంచున నిశ్శబ్దం

ఈ మంచి కథ చదివారా: మా అమ్మమ్మ

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?