జియో 5G ఫోన్‌ – అదిరిపోయే ప్లాన్‌!

jio 5G phone

భారతదేశ నంబర్‌-1 టెలికాం ఆపరేటర్ జియో మరో అద్భతం చేయడానికి సన్నద్ధమవుతోంది. 2G వినియోగదారులను 5Gకి మార్చడమే లక్ష్యంగా గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. అత్యంత తక్కువ ధరకే 5G ఫోన్లను అందించడానికి సన్నాహాలు చేస్తోంది.

రూ.3,000లోపే 5G ఫోన్‌!

జియో 5G ఫోన్‌ను రూ.5వేలు కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు, క్రమంగా ఆ ధరను రూ.2,500 నుంచి రూ.3,000 రేంజ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జియో ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.

ఈ ఏడాది జులైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సదస్సులో… భారతదేశాన్ని 2G ముక్తదేశంగా మారుస్తామని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని అచరణలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మన దేశంలో 5G సేవలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇంకా ఈ స్పెక్ట్రంను అందించలేదు.

ఇదీ చూడండి: బ్యాంకు రుణాలపై చక్రవడ్డీ మాఫీ

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?