WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’?

Best app between WhatsApp-telegram- Signal
  • WhatsApp privacy రగడ పుణ్యమా అని ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న Telegramకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న Signalకు WhatsApp వల్ల అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎటు చూసినా Telegram, Signal పేర్లే మారుమోగిపోతున్నాయి. అయితే WhatsAppపై వ్యతిరేకతతోనే వీటికి డౌన్లోడ్స్ పెరుగుతున్నాయా? లేక నిజంగానే దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsAppకు దీటుగా పోటీనిచ్చే సామర్థ్యం ఈ రెండింటికీ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫీచర్స్, యాప్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిందే. # WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? #

WhatsApp

యూజర్స్:- 2billion+

ఫీచర్స్:-

  • 256 సభ్యుల లిమిట్తో గ్రూప్ చాట్స్.
  • ఒకేసారి వేరువేరు కాంటాక్ట్స్కు మెసేజెస్ బ్రాడ్క్యాస్ట్ చేయవచ్చు.
  • వాయిస్, వాయిస్ కాల్స్(గ్రూప్ కాల్స్లో ఒకేసారి 8మంది మాత్రమే ఉండగలరు.)
  • WhatsApp status
  • అన్ని రకాలా ఫైల్స్, డాక్యుమెంట్స్ షేర్ చేయవచ్చు. కానీ డేటా సైజ్లో మాత్రం లిమిట్ ఉంది. వీడియోలు, ఫొటోలు, ఆడియోకు 16MB.
  • డాక్యుమెంట్స్కు 100MB.
  • లైవ్ లొకేషన్ షేర్ ఆప్షన్.
  • గుగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ ద్వారా backup, restore ఆప్షన్.
  • cloud backup పూర్తిగా ఉచితం.

Telegram

యూజర్స్:- 400million+

ఫీచర్స్:-

  • WhatsAppలాగే బేసిక్ గ్రూప్ చాట్స్, చాట్స్, ఛానెల్స్ ఫీచర్స్. కానీ WhatsAppలాగా 256 సభ్యుల లిమిట్ కాకుండా ఇక్కడ లిమిట్ 2,00,000.
    క్విజ్, హ్యాష్ట్యాగ్స్, బోల్ట్స్ ఆప్షన్స్. గ్రూప్లలో సభ్యుల మధ్య interaction పెంచుతాయి.
  • Self-destructing messages.
  • 1.5GB సైజ్ లిమిట్.
  • వాయిస్, వీడియో కాల్స్. # WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? #

Signal:-

యూజర్స్:- 20million active users/month

ఫీచర్స్:-

  • సెక్యూర్ వాయిస్, వీడియో కాల్స్. అన్ని end-to-end encrypted.
  • గ్రూప్స్ ఆప్షన్, గ్రూప్ కాలింగ్ ఉన్నప్పటికీ.. ఒకేసారి వేరువేరు కాంటాక్ట్స్కు మెసేజెస్ బ్రాడ్క్యాస్ట్ చేయలేము.
  • Telegramలాగే self destructive ఆప్షన్.
    “Note to Self”.
  • దీని ద్వారా, ఒవైపు చాట్ చేస్తూనే మరోవైపు మీ ఆలోచనలు, భావాలను రాసుకోవచ్చు.
  • WhatsApp, telegram కన్నా తక్కువ emojis, stickers.

Security

WhatsApp: అన్ని మెసేజెస్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, ఫొటోలకు end-to-end encryption. అయితే backups మాత్రం encrypt చెయ్యదు. మెటాడేటా కూడా encrypt అవ్వదు. దీనివల్ల ఇతరులెవరు మీ మెసేజెస్ చూడలేరు కానీ మీరు ఎప్పుడు, ఎవరితో, ఎంతసేపు చాట్, కాల్ చేశారనేది అధికారులు తెలుసుకోవచ్చు.
మొత్తానికి చెప్పుకోవాలంటే WhatsAppతో security బాగుంటుంది. కానీ ప్రైవసీ విషయంలో అనేకమార్లు విమర్శలు ఎదుర్కొంది.

Telegram: end-to-end encryption ఉన్నప్పటికీ అది default కాదు. సీక్రెట్ చాట్స్ ఫీచర్తోనే E2Eని ఉపయోగించుకోవాలి. అయితే ఎవరైనా మెసేజ్లు చూడాలన్నా, decryption కావాలన్నా కోర్టు ఉత్తర్వులు తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికే పేర్కొంది. ఇప్పటివరకు third party apps, governmentతో ఎలాంటి డేటా షేర్ చేసుకోలేదని చెప్పింది.
Telegram groups encrypted కాదు. అదే సమయంలో Telegram desktopలో macOS తప్ప మరే ఇతరి వేదికలోనూ E2E పనిచేయదు. # WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? #

Signal: సెక్యూరిటీ విషయంలో ఇప్పటికి వరకు ఈ యాప్ను మించింది ఏదీ లేదు. WhatsAppలాగే E2E encryption అన్ని ఆప్షన్స్కు ఉంటుంది.

ప్రైవసీకి భంగం కలగకుండా, sender-receiver మధ్య సరికొత్త వ్యవస్థనే నిర్మించింది Signal. దీనిని Sealed sender అని పిలుస్తారు. ఈ sealed sender ద్వారా.. ఎవరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారో ఎవరూ తెలుసుకోలేరు. Signalతో సహా. ఇది అల్టిమేట్ ప్రైవసీ అనే చెప్పుకోవాలి. 4-digit passphraseతో ఫైల్స్ encrypt చేసే వెసులుబాటు ఉంటుంది. లోక్ల్ backup కూడా చేసుకోవచ్చు.

Data:-

WhatsApp:- User ID, contacts, advertising data, purchase history, device ID, coarse location, phone number, email ID, product interaction, crash data, performance data, diagnostic data, payment info, customer info, other user content.

Telegram:- Contact Info, contacts, User ID

Signal:- Phone number. # WhatsApp-Telegram-Signalలో ఏది ‘భద్రం’? #

                                               – VISWA (WRITER)

click here: WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే!

click here: ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?