MUHURAT TRADING అంటే ఏమిటి?

muhurat trading

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం.

MUHURAT TRADING తరతరాల ఆచారం…

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని MUHURAT TRADING నిర్వహిస్తున్నాయి.

మీకో విషయం తెలుసా… కొంత మంది పెట్టుబడిదారులు ఈ రోజు కొన్న షేర్లను మరలా విక్రయించకుండా, తమ భావితరాలకు అందించడం చేస్తుంటారు. ఇది వారికి శుభం చేకూరుస్తుందని విశ్వసిస్తారు.

ఇలా జరుగుతుంది..

MUHURAT TRADINGకి ముందు స్టాక్ బ్రోకర్లు చోప్రా పూజ నిర్వహిస్తారు. అంటే స్టాక్ ఎక్స్ఛేంజిల్లోని ఖాతా పుస్తకాలను పూజిస్తారు. ఇది తరతరాలుగా ఆచారంగా వస్తోంది. తరువాత సాయంత్రం పూట ఓ మంచి ముహూర్తం చూసుకుని  ఒక గంట పాటు MUHURAT TRADING నిర్వహిస్తారు.

ఈ ఏడాది MUHURAT TRADING TIMINGS

BSE TRADING TIMINGS:
  • ప్రీ ఓపెన్ సెషన్‌:                         6:00 PM – 6:08 PM
  • ముహురత్ ట్రేడింగ్ సెషన్‌:      6:15 PM – 7:15 PM
  • Block deal సెషన్‌:                        5:45 PM – 6:00 PM
  • Call Auction:                                  6:20 PM – 7:05 PM
  • Post closing muhurat సెషన్‌:    7:25 PM – 7:35 PM
NSE MUHURAT TRADING TIMINGS:
  • ప్రీ ఓపెన్ సెషన్‌:                         6:00 PM – 6:08 PM
  • ముహురత్ ట్రేడింగ్ సెషన్‌:      6:15 PM – 7:15 PM
  • Block deal సెషన్‌:                        5:45 PM – 6:00 PM
  • Call Auction:                                  6:20 PM – 7:05 PM
  • Post closing muhurat సెషన్‌:    7:25 PM – 7:35 PM

MUHURAT TRADING settlement timing

స్టాక్ సెటిల్మెంట్ అనేది సాధారణంగా SAMVAT TRADING తరువాతి ట్రేడింగ్ డేలో జరిగిపోతుంటుంది. అయితే ఈ ఏడాది నవంబర్ 16న బలిప్రతిపాద పండుగ నిర్వహించనున్నారు. అందువల్ల ఆ రోజు సెలవు.  So మీరు కొన్న స్టాక్స్‌ సెటిల్మెంట్‌ నవంబర్ 17న జరుగుతుంది.

మీరు కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లయితే ఈ దీపావళి పర్వదినాన జరిగే MUHURAT TRADINGలో మంచి స్టాక్స్ కొనుగోలు చేసి మీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

హెచ్చరిక: సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అనేది రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల మీరు స్టాక్ మార్కెట్ బేసిక్స్ తెలుసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో MASTERFM.IN మీకు మంచి మార్గదర్శిగా ఉంటుంది. ఏది ఏమైనా మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్‌ సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇదీ చూడండి: iPhone 13 ఇలా ఉండనుందా?

ఇదీ చూడండి: STOCK MARKET BASICS FOR BEGINNERS

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?