2020 సంవత్సరం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2020కి ప్రపంచం గుడ్బై చెబుతుంది. అయితే ఈ కొద్ది రోజుల్లో కూడా చైనా సంస్థలు తమ జోరును కొనసాగించాలని ఫిక్స్ అయ్యాయి. ఫలితంగా కొత్త productsను వరుస పెట్టి తమ వినియోదారుల కోసం తీసుకొస్తున్నాయి. దీంతో.. ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా!
Huawei అదుర్స్…
ఈ సోమవారం Huawei తన లేటెస్ట్ స్మార్ట్ స్క్రీన్ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ స్క్రీన్, స్మార్ట్ టీవీతో పోలి ఉంటుంది. కానీ ఇందులో అనేక advanced features ఉంటాయి. Harmony OS 2.0తో పనిచేసే తొలి డివైజ్ ఈ స్మార్ట్ స్క్రీన్ కానుంది. Multi tasking దీని విశిష్టత.
అదే రోజు GT 2 Pro ECG version స్మార్ట్ వాచ్ను చైనాలో ప్రకటించనుంది Huawei. ఇప్పటికే అక్కడ ఇది ప్రీ ఆర్డర్కు అందుబాటులో ఉంది. # ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’ #
మంగళవారం, Hisense తన తొలి ఈ-రీడర్ స్మార్ట్ఫోన్ను announce చేయనుంది. ఇది 5G సపోర్ట్తో పనిచేయనుండటం విశేషం.
23న, కొత్త స్మార్ట్ఫోన్లతో మళ్లీ ప్రపంచాన్ని పలకరించనుంది Huawei. Nova 8, Nova 8 Proలను ఆవిష్కరించనుంది. సరికొత్త డిజైన్తో ఇవి రానున్నట్టు తెలుస్తోంది. Enjoy 20 SE స్మార్ట్ఫోన్ను కూడా Huawei ఈ వేడుకలో ఆవిష్కరించే అవకాశముంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఆ సంస్థ. # ఈ వారం Tech అవుతుంది మరింత ‘స్మార్ట్’ #
Nova 8 features:-
- 6.5-inch OLED screen with 1080X 2340 pixels resolution
- in-screen fingerprint reader
- 160 X 74.1 X 7.64 mm dimensions
- 169 grams of weight
- 32MP selfie camera, 16 MP secondary lens.
- rear camera- 64MP main, 8MP ultrawide, 2MP macro, 2MP depth sensor
- 3,700mAh with 66W fast charging
- RAM/ STORAGE- 8GB/128GB, 8GB/256GB
Nova 8 Pro features (అంచనా):-
- 163.3 X 74.1 X 7.85mm dimensions, 184 grams weight
- 6.72-inch OLED panel with curved edges.
- 2676 X 1236 pixels resolution
- Integrated finger print scanner
ఈ స్మార్ట్ ఫోన్పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇండియాలో Realme
అదే రోజున భారత్లో Realme మూడు productsను ప్రకటించనుంది. అందులో Realme watch S Pro హైలైట్గా నిలవనుంది. AMOLED display, 15 sports modes, GPS ఈ స్మార్ట్వాచ్ సొంతం. ఇతర దేశాల్లో విడుదలైన Realme Watch Sను ఈ వేడుకలో భారత్లో ఆవిష్కరించనుంది ఆ సంస్థ.
వీటితో పాటు Realme Buds Air Pro masterను కూడా ఆవిష్కరించనుంది.
– VISWA (WRITER)
Click here: అయ్యో PUBG.. గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త!
Click here: ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి