FUNDAMENTAL ANALYSIS PART – 2
ఫండమెంటల్ ఎనాలిసిస్‌లో పరిగణించాల్సిన క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అంశాలు
ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్ను ఉపయోగిస్తారు.
మరి ఈ ఫండమెంటల్ అనాలసిస్ కోసం ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?
సమాధానం: పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సరైనదా? కాదా? అని తెలుసుకునేందుకు క్వాంటిటేటివ్(quantitative) మరియు క్వాలిటేటివ్(qualitative) అంశాలను చూడాల్సి ఉంటుంది.
దీనిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.
మీరు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అనుకుందాం. అందుకోసం మీరు పరిగణలోకి తీసుకునే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
QUALITATIVE AND QUANTITATIVE NUANCES
ఇలా క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ అంశాలను పరిగణలోకి తీసుకుని వెకేషన్ను ప్లాన్ చేసుకుంటారు కదా! ఇదే విధంగా ఓ కంపెనీని కూడా క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ అంశాలతో ఎనలైజ్ చేయవచ్చు.
ఫండమెంటల్ ఎనాలసిస్ ద్వారా అర్థమయ్యే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ వివరాలేంటి?
ఓ కంపెనీ యొక్క విలువను తెలుసుకునేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్ను ఉపయోగించినప్పుడు, ఆ కంపెనీ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
క్వాంటిటేటివ్ అంశాలు
- కంపెనీ ఆదాయం ఎంత?
- గతేడాది ఎంత లాభాలను ఆర్జించింది?
- ఎంత క్యాపిటల్ ఉంది?
- క్యాష్ను కంపెనీ ఎలా ఉపయోగిస్తోంది?
- వేటిపై కంపెనీ ఖర్చు చేస్తోంది?
- కంపెనీకి ఎంత మేరకు అప్పులు ఉన్నాయి?
క్వాలిటేటివ్ అంశాలు
- కంపెనీ కార్యకలాపాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయి?
- మేనేజ్మెంట్ యొక్క నాణ్యత(క్వాలిటీ) ఎలా ఉంది?
- కంపెనీ బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది?
- ఏదైనా ప్రొప్రెయిటరీ టెక్నాలజీని ఉపయోగిస్తోందా?
- సమాజహితం కోసం కంపెనీ తీసుకుంటున్న చర్యలేంటి? (కార్పొరేట్ సోషల్ రెస్పాన్షిబులిటీ)
- భవిష్యత్తుపై కంపెనీకి ఉన్న విజన్ ఏమిటి?
ఇవన్నీ తెలుసుకోవాలంటే.. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూడాల్సి ఉంటుంది. అంటే ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ (Annual report), ఫైలింగ్స్, ఇతర విశ్లేషకుల రిపోర్టులు (Analyst reports) చూడాల్సి ఉంటుంది. వీటిని గురించి తరువాతి ఛాప్టర్స్లో మరింత వివరంగా తెలుసుకుందాం.
కంపెనీ యొక్క హిస్టారికల్ పర్ఫార్మెన్స్ (Historical Performance) మాటేంటి?
ఫండమెంటల్ ఎనాలసిస్లో కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు అంశాలను పరిగణిస్తామని అర్థమవుతోంది. మరి కంపెనీ యొక్క హిస్టారికల్ పర్ఫార్మెన్స్ మాటేంటి?
కంపెనీ హిస్టారికల్ డేటా గతంలో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్, వాల్యూం మూవ్‌మెంట్స్ గురించి సమగ్ర సమాచారం అందిస్తుంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా భవిష్యత్‌లో ఆ కంపెనీ యొక్క ఫర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. దీనినే టెక్నికల్ ఎనాలసిస్ అంటారు.
హిస్టరీ రిపీట్స్
హిస్టరీ రిపీట్స్ అంటే చరిత్ర పునరావృతం అవుతుంది అనే సూత్రం ఆధారంగా టెక్నికల్ అనాలసిస్‌ను చేస్తూ ఉంటారు.
టెక్నికల్ అనలిస్టులు కంపెనీ యొక్క రిపోర్టులు, ఫైనాన్షియల్స్ను చూడరు. షేరు కదలికల ఆధారంగా రూపొందించే ఛార్ట్లను ఉపయోగించి.. గతంలో కంపెనీ షేర్లు ఎలా ట్రేడ్ అయ్యాయో తెలుసుకుంటారు. వీటి ఆధారంగా భవిష్యత్‌లో ఆ కంపెనీ షేర్లు ఎలా ట్రేడ్ అయ్యే అవకాశముందో అంచనా వేస్తారు.
ఫండమెంటల్ వర్సెస్ టెక్నికల్ అనాలసిస్
స్టాక్స్ యొక్క ఫండమెంటల్ ఎనాలసిస్లో కంపెనీకి సంబంధించిన క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అంశాలను పరిగణిస్తారు.
ఒక కంపెనీ స్టాక్ యొక్క ప్రైజ్, వాల్యూం మూవ్‌మెంట్‌లను పరిశీలించి, విశ్లేషించడం ద్వారా, ఆ కంపెనీ భవిష్యత్ ట్రెండ్‌ను అంచనా వేయడానికి టెక్నికల్ ఎనాలసిస్ ఉపయోగిస్తారు.
వీటి గురించి తదుపరి ఛాప్టర్లలో మరింత వివరంగా తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
- కంపెనీని ఇవాల్యుయేట్ చేయడానికి ఫండమెంటల్ ఎనాలసిస్ను ఉపయోగిస్తారు.
- ఫండమెంటల్ ఎనాలసిస్ వల్ల క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అంశాలు అర్థమవుతాయి.
- ఒక కంపెనీ స్టాక్ యొక్క హిస్టారికల్ ప్రైజ్ మరియు వాల్యూం మూవ్‌మెంట్‌లను విశ్లేషించడం ద్వారా, ఆ కంపెనీ భవిష్యత్ ట్రెండ్‌ను అంచనా వేయడాన్ని టెక్నికల్ ఎనాలసిస్ అంటారు.
- టెక్నికల్ ఎనాలసిస్కు కంపెనీ రిపోర్టులతో, ఫైనాన్షియల్స్తో సంబంధం ఉండదు.
Click here: ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?
Click here: ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?