బద్దెన సుమతీ శతకము
సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ! తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి. […]
బద్దెన సుమతీ శతకము Read More »