స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు

Strategies to follow when the stock market is in correction

స్టాక్‌ మార్కెట్‌లో కరెక్షన్లు సర్వసాధారణం. అయితే ఈ కరెక్షన్స్‌ దీర్ఘకాలం పాటు ఉండడం అనేది చాలా అరుదు. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు మంచి జోరులో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన స్టాక్‌ మార్కెట్‌ కరెక్షన్‌ను కేవలం మార్కెట్ స్వల్పకాల దిద్దుబాటుగానే చూడాలి.

బేర్‌ మార్కెట్‌ Vs కరెక్షన్‌

దీర్ఘకాలం పాటు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉంటే, దానిని బేర్‌ మార్కెట్‌ అంటారు. ఇది నెలలు, సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ఉదాహరణకు కొవిడ్‌-19 సంక్షోభంలో స్టాక్‌ మార్కెట్‌కు దీర్ఘకాలంపాటు నష్టాలను చవిచూసింది. స్వల్పకాలం పాటు మార్కెట్ నష్టాల్లో ఉంటే, దానిని కరెక్షన్ అంటారు. ఇది కొన్ని రోజులు, లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. ఇదే బేర్‌ మార్కెట్‌, కరెక్షన్ మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం.

ధైర్యే సాహసే లక్ష్మిః

కరోనా సంక్షోభం సమయంలో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు తరువాత కాలంలో తారాజువ్వలాగా దూసుకుపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొవిడ్‌-19 భయాలు కమ్ముకుంటున్న సమయంలో చాలా మంది భయంతో తమ స్టాక్స్‌ను తక్కువ ధరకే అమ్మేసి, భారీగా నష్టపోయారు. కానీ స్టాక్ మార్కెట్‌ మీద అవగాహన ఉన్నవారు, దీర్ఘకాలిక దృష్టి ఉన్నవారు, కరోనా సంక్షోభ సమయంలోనూ, తమ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ అమ్మలేదు. ఇంకా తమ పోర్టుఫోలియోలో మరిన్ని స్టాక్స్‌ను చేర్చుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి భయాలు తగ్గిన తరువాత, ఊహించని స్థాయిలో భారీ లాభాలను సొంతం చేసుకున్నారు.

మంచి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోండి

స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాలా సహజం. కనుక నష్టాలను కూడా తట్టుకునేలా మంచి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం అత్యవసరం. ఇందు కోసం మీరు మీ సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ పోర్ట్‌ఫోలియోను మంచిగా Blend చేయాలి. అంటే ఒకే రంగానికి చెందిన స్టాక్స్‌ కాకుండా, వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలి. అప్పుడే సెక్టోరియల్‌ రొటేషన్‌ వచ్చినప్పుడు, మీ పోర్ట్‌ఫోలియో మంచిగా లాభపడుతుంది. ఒక వేళ నష్టాలు వచ్చినా, మీ లాభనష్టాల నిష్పత్తిని అదుపులో ఉంచుతుంది.

టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి…

ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్స్‌నే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్మాల్‌ క్యాప్‌ షేర్స్‌ ఎంచుకునేటప్పుడు మంచి గ్రోత్‌ పొటెన్షియల్‌ ఉన్న స్టాక్స్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం మీరు స్వయంగా కొంత రీసెర్చ్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిస్క్‌- రివార్డ్‌లను కచ్చితంగా బేరీజ్‌ వేసుకోవాలి. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో భారీ లాభాలు వస్తే, కొద్దిగా పార్శియల్‌ ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవాలి.

అవకాశాన్ని అందిపుచ్చుకోండి:

వాస్తవానికి మార్కెట్‌ కరెక్షన్‌లో ఉన్నప్పుడే, ఇన్వెస్టర్లకు మంచి అవకాశం లభిస్తుంది. మంచి షేర్స్‌ కూడా చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి. అందుకే పెట్టుబడిదారులు  ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ తమ దగ్గర కొంత ధనాన్ని ఉంచుకోవాలి.

ఏస్‌ ఇన్వెస్టర్స్‌ యొక్క సూచనలు:

“తను నమ్మిన పెట్టుబడి విధానాలను కొనసాగించిన పెట్టుబడిదారులనే విజయం వరిస్తుంది. ఓపిక లేని వారి నుంచి ఓపికగా ఎదురుచూసే వారికి, సంపదను బదిలీ చేసేదే స్టాక్ మార్కెట్‌.” – వారెన్‌ బఫెట్‌

“మార్కెట్‌ కరెక్షన్‌లో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు పొగొట్టుకునే సంపద కన్నా, మార్కెట్లో కరెక్షన్‌ రావచ్చనే భయంతో, మంచి అవకాశాలు చేజార్చుకుని పోగొట్టుకున్న సంపదే అధికం.” – పీటర్‌ లించ్‌

“నిరాశాపరుల నుంచి స్టాక్స్‌ కొని, ఆశావహులకు స్టాక్స్‌ విక్రయించే వాడే తెలివైన పెట్టుబడిదారుడు.” – బెంజిమెన్ గ్రాహమ్‌

ఇదీ చదవండి: మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ఎలా?

ఇదీ చదవండి: టాప్‌ 10 ఫార్మా స్టాక్స్‌ 2021

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?