స్టాక్‌మార్కెట్‌లో short-termలో మంచి లాభాలు సంపాదించాలి అనుకునేవారు కచ్చితంగా టెక్నికల్ ఎనాలసిస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. # stock market technical analysis #
టెక్నికల్ ఎనాలసిస్ ద్వారా మనం నేర్చుకునే అంశాలు:
- ఒక స్టాక్‌ను మనం ఏ ధర వద్ద కొనాలి. మరియు దానిని ఏ ధర వద్ద అమ్మాలి.
- స్టాప్‌లాస్ ఎంత పెట్టుకోవాలి.
- రిస్క్-రివార్డ్ ఎంత ఉంటుంది.
- ఎంత కాలం ఆ స్టాక్‌ను హోల్డ్ చేయాలి.
ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్
స్టాక్ మార్కెట్‌లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనే నానుడి ఉంది. మరి ఆ ట్రెండ్‌ను మనం క్యాష్ చేసుకోవాలంటే, కచ్చితంగా టెక్నికల్ ఎనాలసిస్ నేర్చుకోవాల్సి ఉంటుంది.
మనం అర్థం చేసుకోలేకపోవడానికి, టెక్నికల్ ఎనాలసిస్ అనేది బ్రహ్మ పదార్థమేమీ కాదు. సరిగ్గా దృష్టి పెడితే కేవలం నెల రోజుల్లో టెక్నికల్ ఎనాలసిస్‌ను నేర్చుకోవచ్చు. తరువాత కొంత కాలం డమ్మీ ట్రేడింగ్ చేసి, మన స్కిల్‌ను టెస్ట్ చేసుకొవాలి. ఆ తరువాత రియల్ ట్రేడింగ్ ప్రారంభించవచ్చు.
ప్రధాన వ్యత్యాసం
ఫండమెంటల్ ఎనాలసిస్ ఏ స్టాక్ కొనాలో చెబుతుంది. ఆ స్టాక్‌ను మనం long term investment కోసం కొనుక్కోవాల్సి ఉంటుంది.
టెక్నికల్ ఎనాలసిస్ ఒక పర్టిక్యులర్ స్టాక్‌ను ఏ ధర వద్ద కొనాలో, దానిని ఏ ధర వద్ద అమ్మివేయాలో చెబుతుంది. అయితే ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవడం తప్పనిసరి. ఎందుకంటే, కొన్నిసార్లు మన అంచనాలు తప్పుతాయి. అలాంటప్పుడు మనం భారీగా నష్టపోకుండా ఉండాలంటే, స్టాప్‌లాస్ పెట్టుకోవడం ఉత్తమం. . # stock market technical analysis #
నేర్చుకోవాల్సిందే..
స్టాక్ మార్కెట్‌లో వెల్త్ జనరేట్ చేయాలంటే, టెక్నికల్ ఎనాలసిస్‌లో భాగంగా ఛార్ట్స్, క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, మూవింగ్ యావరేజెస్, ఫెబోనాచీ రీట్రేస్మెంట్స్ ఇలా చాలా విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.
Note: సాధారణంగా మనలో చాలా మంది, తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలను తీసుకొని, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. లాభాలు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు ఆ ఎనలిస్ట్‌ని లేదా అడ్వైజర్‌ని నిందిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. స్వయంగా మనం టెక్నికల్ ఎనాలసిస్‌ను నేర్చుకొనడం ఎంతో ఉత్తమం. . # stock market technical analysis #
ఇదీ చదవండి: ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?
ఇదీ చదవండి: రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు!!!