Risk and Money Management

Risk and Money Management

రిస్క్‌ అండ్‌ మనీ మేనేజ్‌మెంట్‌

ఒక ట్రేడర్​ ఒక రూపాయి లాభాపడుతున్నాడు అంటే.. అదే సమయంలో మరో ట్రేడర్​ ఆ రూపాయి నష్టపోతున్నట్టు. అదే విధంగా.. ఒక బృందంలోని ట్రేడర్లు లాభాలు పొందుతున్నారు అంటే.. మరో బృందం నష్టాలు పాలవుతున్నట్టు. # Risk and Money Management #

అయితే వీటి మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. అదే.. రిస్క్​/మనీ మేనేజ్​మెంట్​ను అర్థం చేసుకునే విధానం. ది డిసిప్లీన్డ్​ ట్రేడర్​ పుస్తకంలో మార్క్​ డౌగ్లస్​ చెప్పింది ఏంటంటే.. ట్రేడింగ్​లో విజయం అనేది.. 80శాతం మనీ మేనేజ్​మెంట్​, 20శాతం స్ట్రాటజీ(వ్యూహరచణ)పై ఆధారపడి ఉంటుంది.

మనీ మేనేజ్​మెంట్​కు సంబంధించిన అంశాలు రిస్క్​తో కూడుకున్నవి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా అర్థం చేసుకున ప్రయత్నం చేద్దాం.

రిస్క్‌ తీసుకోవాలి గురూ!

స్టాక్​ మార్కెట్​లో రిస్క్​ అంటే డబ్బును నష్టపోయే ప్రాబబిలిటీ. స్టాక్​మార్కెట్​లోకి వచ్చారు అంటే రిస్క్​ చేస్తున్నట్టే. ఉదాహరణకు.. ఓ కంపెనీ స్టాక్​ తీసుకున్నారు. అప్పటి నుంచి రిస్క్​ మొదలవుతుంది. రిస్క్​ను రెండు విధాలుగా విభజించవచ్చు.

  1. Systematic Risk
  2. Unsystematic Risk

అసలు మనం డబ్బులు ఎందుకు నష్టపోతాము? అసలు స్టాక్​ ధర ఎందుకు తగ్గుతుంది? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిల్లో కొన్నిటిని చూద్దాం.

  1. Deteriorating Business
  2. Decline in business margin
  3. Misconduct of management
  4. Competition eating margins

ఇవన్నీ రిస్క్​లే. వీటితో పాటు ఇంకా చాలా రిస్క్​లు ఉంటాయి. అయితే వీటన్నిటిలో ఒక పోలిక ఉంది. అవన్నీ ప్రత్యేకంగా కంపెనీకి సంబంధించినవే అని గమనించారా? ఉదాహరణకు.. మీ వద్ద రూ. 1,00,000 క్యాపిటల్​ ఉంది అనుకుందాం. Infosysలో మీరు పెట్టుబడి పెట్టారు. కొన్ని నెలల తర్వాత.. రెవెన్యూ పడిపోయిందని అని Infosys ప్రకటిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఆ స్టాక్​ ప్రైజ్​ పడిపోతుంది. మీరు మీ పెట్టుబడి కోల్పోతారు. అయితే.. ఈ వార్త Infosys పోటీదారు కంపెనీలను ప్రభావితం చేయదు. అదే విధంగా.. మేనేజ్​మెంట్​ ఏవైనా తప్పులు చేసినా ఇన్ఫోసిస్​ షేర్లు ధర పడిపోతుంది. పోటీదారు కంపెనీపై ప్రభావం చూపదు. అంటే.. ఈ రిస్క్​ అంతా కంపెనీనే ప్రభావితం చేస్తుంది కానీ పోటీదారు కంపెనీని కాదు.

దీనిని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. 2009 జనవరి 7న.. Satyam Scam బయటపడింది. కంపెనీలో అవకతవకలు జరిగాయని satyam Computers Limited ఛైర్మన్​ రామలింగ రాజు ప్రకటించారు. ఇది సంచలనంగా మారింది. అదే సమయంలో కంపెనీ యొక్క స్టాక్​ ప్రైజ్​ కుప్పకూలింది.

ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు.

  1. స్టాక్​ ప్రైజ్​ భారీగా పడిపోయింది.
  2. ఆ రంగంలోని ఇతర కంపెనీల షేర్ల ధరలపై ఇది ప్రభావం చూపలేదు.
  3. సెన్సెక్స్​-నిఫ్టీలు స్వల్పంగా పడ్డాయి.. కానీ ఆ కంపెనీతో పోల్చితే చాలా తక్కువే.

అంటే.. కంపెనీ వ్యవహారాలపైనే స్టాక్​ ప్రైజ్​ ఆధారపడి ఉంటుంది. ఇతర విషయాలేవీ ప్రభావం చూపవు. దీనినే Unsystematic Risk అంటారు.

Unsystematic Risk తగ్గించుకోవాలంటే…

ఈ Unsystematic riskను తగ్గించుకునేందుకు వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. దీనినే Diversification అంటారు. పెట్టుబడులను diversify చేస్తే రిస్క్​ తక్కువగా ఉంటుంది.

ఇందాక తీసుకున్న ఉదాహరణను గుర్తుచేసుకుంటే.. మొత్తం రూ. 1,00,000 ను ఒకే కంపెనీలో పెట్టడం బదులు కొంత Infosysలో, ఇంకొంత బ్యాంకు రంగంలోని కంపెనీలో పెట్టుబడి పెడితే మంచిది. ఈ పరిస్థితుల్లో.. ఒకవేళ ఎలాంటి సందర్భాల్లోనైనా Infosys షేర్ల ధర పడిపోతే.. బ్యాంకింగ్​ షేర్లు కాపాడతాయి. అంటే ఇక్కడ రిస్క్​ సగమే. అయితే రెండు స్టాక్​లతో ఆపేయకుండా.. 5,10, 20 స్టాక్స్​తో ఓ పోర్ట్​ఫోలియోను నిర్మించుకోచ్చు. పోర్ట్​ఫోలియోలో స్టాక్​లు ఎంత ఎక్కువగా ఉంటే.. diversification అంత ఎక్కువగా ఉన్నట్టు.. రిస్క్​ తక్కువగా ఉన్నట్టు. # Risk and Money Management #

మరి.. పూర్తి diversificationతో Unsystematic risk నుంచి విముక్తి పొందాలంటే మన దగ్గర ఎన్ని స్టాక్​లు ఉండాలి? పరిశోధనల ప్రకారం.. పోర్ట్​ఫోలియోలో 21 స్టాక్స్​ ఉంటే మంచిది.

Systematic risk

అయితే పోర్ట్​ఫోలియోను diversify చేసిన తర్వాత కూడా ఉండే రిస్క్​ను Systematic risk అంటారు.

మార్కెట్​లోని అన్ని స్టాక్స్​కు సాధారణంగా ఉండే రిస్క్​ను Systematic risk అంటారు. Macroconomic, political situation, geographical stability వంటి అంశాలు మార్కెట్​ను ప్రభావితం చేస్తాయి. స్టాక్​ ప్రైజ్​ను తగ్గించే కొన్ని systematic risk అంశాల గురించి తెలుసుకుందాం..

  1. GDP De-growth
  2. Tightening interest rate
  3. ద్రవ్యోల్బణం (Inflation)
  4. ద్రవ్య లోటు (Fiscal deficit)
  5. భౌగోళిక రాజకీయ ముప్పు (Geo political risk)

ఉదాహరణకు మీ పోర్ట్​ఫోలియోలో 20 స్టాక్​లు ఉన్నాయి అనుకుందాం. మంచి diversification. కానీ దేశ జీడీపీ పడిపోయింది. ఈ వార్త 20 స్టాక్​లను ప్రభావితం చేస్తుంది. షేర్లు పడిపోతాయి.

Systematic riskను diversify చెయ్యలేము అని మనం అర్థం చేసుకోవాలి. అయితే దీనిని hedge చేయవచ్చు. Hedging అనేది ఓ కళ. Systematic risk నుంచి విముక్తి పొందేందుకు ఉపయోగపడే టెక్నిక్​ ఇది. నల్ల మబ్బులతో.. వర్షం పడుతుంది అని మీకు తెలిస్తే.. అదే సమయంలో మీ వద్ద గొడుగు ఉంటే! Hedging కూడా ఇలాంటిదే. వర్షం పడుతూనే గొడుగు వాడుకోవచ్చు. # Risk and Money Management #

అయితే Hedgingకు diversificationకు సంబంధం లేదు.Unsystematic riskను తగ్గించేందుకు diversify చేస్తాం. Systematic risk ను తగ్గించేందుకు hedging చేస్తారు.

వీటన్నిటితో.. రిస్క్​ తగ్గించవచ్చు అని అర్థం చేసుకోవాలి. కానీ స్టాక్​మార్కెట్​లో శాశ్వతంగా రిస్క్​ దూరమవ్వదు.

EXPECTED RETURN

పెట్టుబడి పెట్టి రిటర్న్​ ఆశించడం సహజం. ఇన్ఫోసిస్​ మీద పెట్టుబడి పెట్టి ఏడాది కాలంలో 20శాతం పెరగాలని మీరుకు అనుకుంటే.. మీరు ఆశిస్తున్న రిటర్న్​ 2శాతం.

ఫైనాన్షియల్స్​లో expected return అనేది చాలా కీలకం. వివిధ లెక్కల గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇన్ఫోసిస్​ మీద రూ. 50వేలు పెట్టుబడి పెట్టి.. ఏడాదిలో 20శాతం రిటర్న్​ ఆశిస్తే.. expected return 20శాతం.

అదే.. రూ. 25వేలు ఇన్ఫోసిస్​లో పెట్టి 20శాతం రిటర్న్​ ఆశించి.. మగిలిన రూ. 25వేలు రిలయన్స్​లో పెట్టి రూ. 15శాతం రిటర్న్​ ఆశిస్తే… అప్పుడు మొత్తం expected return ఎంత అవుతుంది? దీనిని పోర్ట్​ఫోలియో కింద లెక్కించాలి. అందుకు ఓ ఫార్ములా ఉంది.

E(RP)= W1R1 + W2R2 + W3R3+ ———- WnRn

E(RP)= Expected return of portfolio

W= weight of investment

R= Expected return of individual asset

రెండింటిలో చరో రూ. 25వేల ఇన్​వెస్ట్​ చేశాం కాబట్టి.. W= 50శాతం. Expected return = 20%, 15%.

E(RP)= 50% * 20% + 50% * 15%

= 10% + 7.5%

= 17.5%

ఇలా ఎన్ని స్టాక్​లకైనా లెక్కించవచ్చు. అయితే ఈ expected return అనేది కచ్చితంగా వస్తుంది అని చెప్పలేము. ఇది కేవలం ఓ probabilistic expectation.

వచ్చే ఛాప్టర్​లో కొన్ని క్వాంటిటేటివ్​ అంశాల గురించి తెలుసుకుందాం.

రీక్యాప్
  1. స్టాక్​ కొంటే.. రిస్క్​ ఉంటుంది. అది systematic risk అవ్వొచ్చు.. లేదా Unsystematic risk అవ్వొచ్చు.
  2. కంపెనికి ముడిపడి ఉండే రిస్క్​ను unsystematic risk అంటారు.
  3. దీని వల్ల ఒక్క కంపెనీకే నష్టం. అదే రంగంలోని ఇతర కంపెనీలపై ప్రభావం ఉండదు.
  4. Diversificationతో ఈ రిస్క్​ను తగ్గించవచ్చు.
  5. మొత్తం వ్యవస్థలో ఉండే రిస్క్​ను systemtic risk అంటారు.
  6. ఇది అన్ని స్టాక్​లను ప్రభావితం చేస్తుంది.
  7. Hedging ద్వారా దీనిని తగ్గించవచ్చు.
  8. ఎన్ని చేసినా మార్కెట్​లో రిస్క్​ కచ్చితంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి.
  9. Probabilistic returnను Expected return అంటారు
  10. Expected returnలో గ్యారంటీ ఉండదు.

ఇదీ చదవండి: What is “CANSLIM” strategy?

ఇదీ చదవండి: ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?