మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది

micromax

ఫీచర్ ఫోన్ల సెగ్మెంట్లో ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత ఆండ్రాయిడ్ మొబైళ్ల విషయంలో ఎంతో వెనుకబడిపోయింది. షియోమీ, శాంసంగ్, వివో, ఒప్పో లాంటి సంస్థలకు పోటీనివ్వలేక చతికిలపడింది. దీంతో భారత మార్కెట్లో ఆ సంస్థ వాటా క్రమంగా పడిపోతూ వచ్చింది. దీంతో ఉత్పత్తిని సైతం తగ్గించింది. # మైక్రోమ్యాక్స్ మళ్లీ వచ్చేసింది #

అయితే తాజాగా మైక్రోమ్యాక్స్  మళ్లీ కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. మంచి ఫీచర్లతో రెండు మిడ్రేంజ్ మెబైల్స్ను  విడుదల చేసింది. మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఇన్ నోట్ 1, ఇన్ 1బీ పేరిట రెండు ఫోన్లను తీసుకొచ్చింది. షియోమీ, రియల్ మీ ఫోన్లకు ధీటుగా ఫీచర్లను పొందుపరిచింది. ముఖ్యంగా ఈ ఫోన్లలో స్టాక్ ఆండ్రాయిడ్ ఉండడం ప్రత్యేకం. 

Micromax IN note 1:

  • డిస్ప్లే – 6.67ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్, హోల్ పంచ్ డిజైన్
  • ప్రాసెసర్ – మీడియాటెక్ హీలియో జీ85 ఎస్వోసీ
  • నాలుగు వెనుక కెమెరాలు : 48 మెగాపిక్సెల్(ఎంపీ) ప్రైమరీ+ 5 ఎంపీ వైడ్యాంగిల్ + 2 ఎంపీ మాక్రోషాట్స్+ 2 ఎంపీ డెప్త్ సెన్సింగ్ కెమెరాలు
  • ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్, 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్
  • ఆపరేటింగ్ సిస్టం : స్టాక్ ఆండ్రాయిడ్ 10
  • రామ్ + ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ+64జీబీ, 4 జీబీ+128 జీబీ
  • ధర : రూ.10,999, రూ.12,499

Micromax IN 1B :

  • డిస్ప్లే – 6.52ఇంచుల మినీ డ్రాప్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
  • ప్రాసెసర్ – మీడియాటెక్ హీలియో జీ35 ఎస్వోసీ
  • రెండు వెనుక కెమెరాలు : 13 మెగాపిక్సెల్ ప్రైమరీ + 2 ఎంపీ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
  • ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్, 10 వాట్స్ చార్జర్
  • ఆపరేటింగ్ సిస్టం: స్టాక్ ఆండ్రాయిడ్ 10
  • రామ్ + ఇంటర్నల్ స్టోరేజ్: 2 జీబీ+32 జీబీ, 4 జీబీ+64జీబీ,
  • ధర: రూ. రూ.6,999, రూ.7,999

Click here: మీరు Whatsapp Pay చేశారా?

Click here: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?