ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ – టైమింగ్స్‌

INDIAN STOCK MARKET TIMINGS

BASICS OF STOCK MARKET

ఇండియన్‌ స్టాక్ మార్కెట్లో నిర్దిష్ట సమయ ప్రమాణాల ప్రకారం ట్రేడింగ్ జరుగుతుంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, ప్రతి రోజూ ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఈ ట్రేడింగ్ జరుగుతుంది.

శని, ఆదివారాలు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు దినాలు. కొన్ని ప్రత్యేకమైన పండుగ రోజులు, జాతీయ దినోత్సవాల రోజున కూడా స్టాక్‌ మార్కెట్లకు సెలవులు ప్రకటిస్తారు.

దీపావళి పర్వదినాన Muhurat trading నిర్వహిస్తారు. అది శనివారమైనా, ఆదివారమైనా సరే మూరత్‌ ట్రేడింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా దీనిని సాయంత్రం వేళ నిర్వహిస్తుంటారు.

(మూరత్ ట్రేడింగ్ గురించి సవివరంగా మరో ఛాప్టర్‌లో చర్చిద్దాం.)

ట్రేడింగ్‌ టైమింగ్స్‌

భారతదేశంలో ప్రధానంగా రెండు స్టాక్ ఎక్స్ఛేంజిలు ఉన్నాయి. అవి: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (NSE). ఈ స్టాక్ ఎక్స్ఛేంజిల్లోనే, రిటైల్‌ ఇన్వెస్టర్లు (పెట్టుబడిదారులు) సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలను చేస్తుంటారు.

ఇండియన్ స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్ సమయాన్ని మూడు సెక్షన్‌లు విభజించారు. అవి:

క్రమసంఖ్య
పేరు
సమయం
1.
ప్రీ-ఓపెనింగ్ సెషన్‌
ఉదయం 9.00 – 9.15
2.
నార్మల్‌ సెషన్
ఉదయం 9.15 – 3.30
3.
క్లోజింగ్ సెషన్‌
ఉదయం 3.30 – 4.00

 Pre-opening session (ప్రీ-ఓపెనింగ్ సెషన్‌)

ఉదయం 9.00 నుంచి 9.15 గంటల మధ్య ప్రీ-ఓపెనింగ్‌ సెషన్‌ ఉంటుంది. ఈ ప్రీ-ఓపెనింగ్‌ సెషన్‌ను మరళా మూడు సెక్షన్‌లు విభజించారు. అవి:

1ఉదయం 9.00 నుంచి 9.08 గంటల వరకు
2ఉదయం 9.08 నుంచి 9.12 గంటల వరకు
3ఉదయం 9.12 నుంచి 9.15 గంటల వరకు

 ఉదయం 9.00 నుంచి 9.08 గంటల వరకు

భారత స్టాక్ మార్కెట్ ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు లావాదేవీల కోసం తమ ఆర్డర్లను ప్లేస్‌ చేస్తారు. ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత, ఈ ఆర్డర్లను సీక్వెన్స్‌ను అనుసరించి ముందుకు తీసుకెళతారు. ఈ సమయంలోనే ఇన్వెస్టర్లు తమ ఆర్డర్లను మార్చుకోవడం (Change)గానీ, రద్దు చేయడం (Cancel)గానీ చేయవచ్చు. అయితే ఈ 8 నిమిషాల సెషన్‌ తరువాత ఇన్వెస్టర్లు ఎటువంటి కొత్త ఆర్డర్లను ప్లేస్‌ చేయలేరు.

ఉదయం 9.08 నుంచి 9.12 గంటల వరకు

ఈ సెషన్‌లో Multilateral order matching system ద్వారా సెక్యూరిటీల తుది ధరలు (final prices) నిర్ణయించబడతాయి.  ముఖ్యంగా డిమాండ్ అండ్‌ సప్లై నిష్పత్తిని అనుసరించి సెక్యూరిటీల ధరలు (Prices) నిర్ణయించబడతాయి. ఫలితంగా కచ్చితమైన లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది.

ముఖ్యగమనిక: ఇప్పటికే మనం ప్లేస్‌ చేసిన ఆర్డర్‌ను ఈ సెషన్‌లో సవరించడానికి (modification) వీలుపడదు.

ఉదయం 9.12 నుంచి 9.15 గంటల వరకు

ఈ సమయం ప్రీ-ఓపెనింగ్‌ మరియు నార్మల్‌ ఇండియన్‌ షేర్‌ మార్కెట్ టైమింగ్‌ మధ్య పరివర్తన కాలంగా (transition period) ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా, అదనంగా ఆర్డర్లు ప్లేస్‌ చేయలేము. అలాగే 9.08 నుంచి 9.12 గంటల మధ్య ప్లేస్ చేసిన ఆర్డర్లను సవరించడంకానీ, రద్దు చేయడంగానీ చేయలేము.

Normal Session (నార్మల్‌ సెషన్‌)

ప్రైమరీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌ టైమింగ్‌ ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో Bilateral order matching system ద్వారా లావాదేవీలు జరుగుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా డిమాండ్ అండ్‌ సప్లైల ఆధారంగా సెక్యూరిటీల ధరలు నిర్ణయించబడతాయి.

Bilateral order matching system చాలా అస్థిరమైనది. దీని వల్లనే మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతూ ఉంటుంది. ఇదే సెక్యూరిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

ఈ అస్థిరత (volatility)ని తగ్గించడానికే, మల్టీ-ఆర్డర్‌ సిస్టమ్‌ను రూపొందించి ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లో ప్రవేశపెట్టారు.

Closing Session (క్లోజింగ్ సెషన్‌)

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్ ట్రేడింగ్‌ సాయంత్రం 3.30 గంటలకు ముగుస్తుంది. ఈ సమయం తరువాత ఎలాంటి లావాదేవీలు నిర్వహించరు. ఈ సమయంలోనే స్టాక్‌ మార్కెట్‌ Closing Price నిర్ణయించబడుతుంది. ఇది మరుసటి రోజు స్టాక్‌ మార్కెట్‌ Opening Priceపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ క్లోజింగ్ టైమ్‌ కూడా రెండు సెషన్‌లుగా విభజించబడింది.

  1. సాయంత్రం 3.30 నుంచి 3.40 గంటల వరకు
  2. సాయంత్రం 3.40 నుంచి 4.00 గంటల వరకు
3.30 PM 3.40 PM Session

స్టాక్‌ ఎక్స్ఛేంజిలో సాయంత్రం 3.00 నుంచి 3.30 గంటల వరకు ట్రేడైన సెక్యూరిటీల సగటు ధరల (weighted average) ఆధారంగా ముగింపు ధరను నిర్ణయిస్తారు.

కొన్ని లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ సగటు ధరల (weighted average price) ఆధారంగా, బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ, అలాగే సెక్టార్స్‌ ఇండెక్స్‌లైన S&P AUTO లాంటి వాటి ముగింపు ధరలను లెక్కిస్తారు.

3.40 PM 4.00 PM

ఇది Post market ముగింపు సమయం. ఈ సెషన్‌లో తరువాతి రోజు ట్రేడింగ్ కోసం బిడ్స్ వేయవచ్చు. ఈ సమయంలో ప్లేస్‌ చేసిన బిడ్స్‌ కచ్చితంగా ధ్రువీకరించబడతాయి (confirmed). మరుసటి రోజు మార్కెట్‌ ఓపెనింగ్ ప్రైజ్‌లోని మార్పులతో సంబంధం లేకుండా ఈ లావాదేవీలు నిర్ణీత ధర వద్ద పూర్తవుతాయి.

ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ

Post market సెషన్‌లో బిడ్లు వేసిన ఇన్వెస్టర్లు safe zoneలో ఉన్నట్లు లెక్క. ఎలా అంటే,

మరుసటి రోజు మార్కెట్ ఓపెనింగ్ ప్రైజ్‌, ఇవాళ్టి క్లోజింగ్ ప్రైజ్‌ కన్నా ఎక్కువగా ఉందనుకోండి. ఇన్వెస్టర్‌కు మంచి లాభం వస్తుంది.

ఒకవేళ మరుసటి రోజు మార్కెట్‌ ఓపెనింగ్ ప్రైజ్‌, ఇవాళ్టి క్లోజింగ్‌ ప్రైజ్‌ కన్నా తక్కువగా ఉంటుందన్న సూచనలు ఉంటే, ఉదయం 9.00 నుంచి 9.08 గంటల మధ్య ఉన్న 8 నిమిషాల సమయంలో ఆ బిడ్లను రద్దు (Cancel) చేసుకోవచ్చు.

NSEలో సాంకేతిక సమస్యలు

24-ఫిబ్రవరి-2021న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (NSE)లో సాంకేతిక సమస్య (Technical glitch) తలెత్తింది. ఫలితంగా చాలా సమయంపాటు ట్రేడింగ్ నిలిచిపోయింది. దీనితో ఫ్యూచర్స్‌, ఈక్విటీ మార్కెట్లలో పొజిషన్స్ తీసుకున్న ట్రేడర్స్‌ కాస్త కలవరపడ్డారు.

NSE గతంలోనూ ఇలాంటి సమస్యలను ఫేస్‌ చేసింది. 2017 జూలైలో దాదాపు 3 గంటలపాటు సాంకేతిక సమస్యల కారణంగా ట్రేడింగ్ నిలిచిపోయింది. అప్పుడు ఉదయం 10 గంటలకు ట్రేడింగ్ నిలిపివేసిన NSE, తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రేడింగ్‌ని పునరుద్ధరించింది. అప్పుడు SEBI ఎన్‌ఎస్‌ఈకి జరిమానా విధించడం కూడా జరిగింది.

డిజాస్టర్ రికవరీ సైట్‌

NSEలో తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యపై SEBI ఆరా తీసింది. ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని (డిజాస్టర్ రికవరీ సైట్‌) ఎందుకు ఉపయోగించలేదో తెలియజేయాలని ఆదేశించింది. ట్రేడింగ్ నిలిపివేయడానికి సంబంధించిన పూర్తి కారణాలను తెలపాలని స్పష్టం చేసింది.

దీనిపై స్పందించిన NSE, తాము కనెక్టివిటీ కోసం రెండు టెలికాం సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొంది. అయితే ఆ రెండు సంస్థలు కూడా విఫలమయ్యాయని, అందుకే సాంకేతిక సమస్య తలెత్తిందని NSE వివరణ ఇచ్చింది.

సమయంలో మార్పులు

ఇలాంటి సాంకేతిక సమస్యలు సంభవించినప్పుడు మార్కెట్ టైమింగ్స్‌లో కూడా మార్పులు జరుగుతాయి.

24-ఫిబ్రవరి-2021న ప్రీ-మార్కెట్‌ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందని, Pre-market will be live at 1.15 PM అని ప్రకటించింది. కానీ అలా జరగలేదు.

తరువాత Cash and Derivatives ట్రేడింగ్ సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించింది.

అంటే, ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టాక్ ఎక్స్ఛేంజిలు తమతమ టైమింగ్స్‌లో కొద్దిగా మార్పులు చేస్తుంటాయి.

Click here: MUHURAT TRADING అంటే ఏమిటి?

Click here: మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?