Hike.. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది.. రంగురంగుల థీమ్స్, ఎమోజీలు, అదిరిపోయే స్టిక్కర్లు. Messaging app ప్రియులు ఈ Hikeను కనీసం ఒక్కసారైనా వినియోగించే ఉంటారు. ఈ దేశీయ messaging appsకు అంతటి ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. WhatsApp వంటి విదేశీ యాప్స్ పోటీ తట్టుకోలేక Hike మూతపడింది. మరి ఈ మెసేజింగ్ యాప్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. # గుడ్ బై Hike… మూతపడ్డ దేశీయ messaging app #
2012లో Hikeను ఆవిష్కరించారు. కొన్ని రోజుల్లోనే దీనికి విపరీతమైన ఆదరణ లభించింది. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా WhatsApp విప్లవం తీసుకొచ్చింది.
100 మిలియన్ యూజర్స్
2016 నాటికి Hikeకు 100 మిలియన్ యూజర్స్ ఉన్నారు. 10 భారతీయ భాషల్లో ఇది పనిచేసేది. Hike కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ఇటీవలే మెసేజింగ్ యాప్ సీఈఓ కెవిన్ భార్తి మిట్టల్ వెల్లడించారు.
అయితే.. ఎందుకు మూసివేస్తున్నారనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు Hike. యూజర్స్ తమ conversations, dataను యాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Hike messengerను Vibe, Rushతో రిప్లేస్ చేయనున్నారు. ఇవి ఆండ్రాయిడ్, iOSలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కొన్నేళ్లుగా.. అత్యధిక పెట్టుబడులను Hike సొంతం చేసుకోగలిగింది. $261 మిలియన్ విలువగల పెట్టుబడులు సంపాదించుకుంది. ఇందులో $175 2016లో Foxconn, Tencent నుంచే అందాయి. # గుడ్ బై Hike… మూతపడ్డ దేశీయ messaging app #
కానీ WhatsApp ఆధిపత్యంతో Hikeకు క్రేజ్ తగ్గిపోయింది. 2019 డిసెంబర్ నాటికి నెలకు కేవలం 2 మిలియన్ మంది యాక్టివ్ యూజర్సే ఉన్నారు.
– VISWA (WRITER)
Click here: WhatsApp- Telegram- Signalలో ఏది ‘భద్రం’?
Click here: ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే!