బ్యాలెన్స్ షీట్‌ను చదవడం ఎలా?
FUNDAMENTAL ANALYSIS PART – 7
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో కంపెనీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలు మరియు overall profitabilityకి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది.
మరి కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలను ఎక్కడ చూడాలి?
కంపెనీ యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా Balance sheetను చూడాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క assets, liabilities మరియు share capital వివరాలు ఇందులోనే ఉంటాయి.
ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
BALANCE SHEET
Balance sheetలో రెండు భాగాలు ఉంటాయి.
- Assets
- Equity and liabilities
ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ని తీసుకున్నా, assets విలువ మరియు equity and liabilities విలువలు సమానంగా ఉంటాయి. నిజానికి ఇలా ఉండి తీరాలి.
Assets = Equity and Liabilitiesగా ఉండటానికి ఓ లాజిక్ ఉంది. అది ఏంటంటే, కంపెనీలు అప్పులు లేదా షేర్ క్యాపిటల్ రూపంలో సమకూర్చుకున్న నిధులతోనే కదా, వాటికి Assets ఏర్పడేది.
మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకునేందుకు HUL యొక్క P&L statementను తీసుకున్నాం.
అందుకే Balance sheetను అర్థం చేసుకునేందుకు కూడా మనం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ (2019-20)నే ఉదాహరణగా తీసుకుందాం.
Balance sheet Balance sheet continued
బ్యాలెన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ల Layout, Structureలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల మనం డైరక్ట్గా కంటెంట్‌లోకి వెళ్లిపోదాం. ముందుగా Assetsను పరిశీలిద్దాం.
Assets
Assetsలో రెండు ప్రైమరీ కేటగిరీలు ఉంటాయి. అవి:
- Non-current assets
- Current assets
Non-current assets
నాన్ కరెంట్ అస్సెట్స్‌నే long-term assets అని కూడా అంటారు. ఏడాదికి మించి కంపెనీ దగ్గర ఏవైనా assets ఉంటే వాటిని non-current assets అని అంటారు. వీటిని క్యాష్ రూపంలో మార్చుకోవడం అంత సులభం కాదు.
Property, Plant and Equipment
కంపెనీకున్న సొంత భూములు లేదా లీజుకు తీసుకున్న భూములు, భవనాలు, ప్లాంట్, పరికరాలు, ఫర్నీచర్, ఆఫీస్ ఎక్విప్‌మెంట్ మొదలైన fixed assets అన్నీ ఈ విభాగంలో ఉంటాయి. హెచ్యూఎల్ బ్యాలెన్స్ షీట్లోని నోట్ – 3లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
అలాగే కంపెనీ ఈ ఏడాదిలో కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు, ఇప్పటికే ఉన్న ఆస్తుల తరుగుదల (value of depreciation) గురించిన వివరాలు కూడా నోట్ – 3లోనే ఉన్నాయి.
Note 3: property, plant and equipment Note: leased assets
Capital work in progress (CWIP)
Fixed assets యొక్క production, constructionకు సంబంధించిన ఖర్చులన్నీ ఈ CWIPలో ఉంటాయి.
Goodwill and other intangible assets
Goodwill అంటే ఏళ్లుగా కంపెనీ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు. సహజంగా వీటిని intangible assetsగా పరిగణిస్తారు. హెచ్యూఎల్ బ్యాలెన్స్ షీట్లోని నోట్ 4లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
Note 4: intangible assets
Financial assets
ఓ కంపెనీ తన యొక్క Subsidiaries, అసోసియేట్ కంపెనీలు, జాయింట్ వెంచర్స్లో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడులను financial assetsగా పేర్కొంటారు.
వీటితో పాటు దీర్ఘకాలిక డిపాజిట్లు, ఫైనాన్షియల్ మర్కెట్ పెట్టుబడులు, ఇతర కంపెనీలకు ఇచ్చిన రుణాలను కూడా financial assetsగానే పరిగణిస్తారు.
హెచ్యూఎల్ బ్యాలెన్స్ షీట్లోని నోట్ 5-8లో Financial assets సంబంధించిన వివరాలు ఉన్నాయి.
Non-current tax assets and deferred tax assets
భవిష్యత్తులో ఆదాయంపై పన్నులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉపయోగించుకునే దీర్ఘకాలిక assets ఇందులో ఉంటాయి. ఉదాహరణకు, పన్నులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చినా లేదా పన్నులను ముందుగానే చెల్లించాల్సి వచ్చినా అవి non-current tax assetsలో జోడిస్తారు.
Other non-current assets
పైన పేర్కొన్న ఏ కేటగిరీ కిందనూ వర్గీకరించలేని, other ancillary, miscellaneous long term assetsను ఈ కేటగిరీలో జోడిస్తారు.
Current assets
కంపెనీ ఒక ఏడాది వ్యవధిలో నగదు (Cash) రూపంలో మార్చుకోగలిగే ఆస్తులను Current assets అంటారు. వీటిని short-term assets అని కూడా అంటారు. అంటే ఇలాంటి ఆస్తులను స్వల్పకాలంలో సులువుగా అమ్మవచ్చు లేదా నగదుగా మార్చుకోవచ్చు. హెచ్యూఎల్ బ్యాలెన్స్ షీట్లో Current assets చూడవచ్చు.
Inventories (ఇన్వెంటరీలు)
ఒక కంపెనీ వద్ద ఉండే Goods, material stockను inventoriesగా పేర్కొంటారు. Raw materials, packing materials నుంచి work-in progress, finished goodsకు సంబంధించినవన్నీ ఇన్వెంటరీస్ కిందకే వస్తాయి. నోట్ 11లో Inventoriesకి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
Note 11: inventories
Financial assets
Non-Current assets మాదిరి కాకుండా, ఈ financial assetsలో కంపెనీకి సంబంధించిన అన్ని స్వల్పకాల పెట్టుబడుల (Short-term investments) వివరాలు ఉంటాయి. Bank balance, short-term financial market investments, cash balances, trade receivables ఇందులో ఉంటాయి.
కంపెనీ అమ్మిన ప్రోడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన పేమెంట్స్ ఇంకా అందాల్సి ఉంటే, వాటిని trade receivables విభాగంలో చూపిస్తారు.
నోట్స్ 6,8,12,13,14లలో HUL యొక్క current financial assetsని మనం చూడవచ్చు.
Other current assets
పైన పేర్కొన్న ఏ కేటగిరీకి చెందని అన్ని ఇతర ancillary, miscellaneous short term assetsను ఈ కేటగిరీలో చేరుస్తారు.
Assets held for sale
కంపెనీ ఒక సంవత్సర కాల వ్యవధిలో, అమ్మివేయాలనే ఉద్దేశంతో ఉంచే non-current assetsను ఇందులో చేర్చుతారు. అందుకే వీటిని non-current assets సెక్షన్ నుంచి current assets సెక్షన్లోకి మారుస్తారు.
Total assets
బ్యాలెన్స్ షీట్‌లోని assets సెక్షన్‌లో ఉన్న అన్నింటి విలువను కలిపి ‘total assets’గా పేర్కొంటారు.
Equity and liabilities
ఇందులో మూడు ప్రైమరీ కేటగిరీలు ఉంటాయి. అవి:
- Equity
- Non-current liabilities
- Current liabilities.
ఇప్పుడు ఈ మూడింటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.
Equity
ఇందులో రెండు ఉపవిభాగాలు (Subdivisions) ఉంటాయి.
- Equity share capital
- Other equity
Equity share capital:
కంపెనీ యొక్క మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ విలువను ఇది సూచిస్తుంది. number of authorized equity shares, number of issued and paid-up equity shares, the face value of the shares ఇందులో ఉంటాయి. ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్లో ఉంటాయి.
Other equity
Security premium, outstanding employee stock options వంటివి ఇందులో ఉంటాయి. క్యాపిటల్ రిజర్వులు, క్యాపిటల్ రిడెమ్షన్ రిజర్వులు(Capital redemption), retained earnings కూడా ఇందులోనే ఉంటాయి.
Other equity విభాగంలో ఉండే వీటన్నింటి గురించిన summaryని నోట్స్ విభాగంలో చూడవచ్చు.
Liabilities
Assetsలాగే liabilitiesలోనూ రెండు ఉపవిభాగాలు (Subdivisions) ఉంటాయి. అవి:
- Non-current liabilities
- Current liabilities
Non-current liabilities
కంపెనీ ఒక్క ఏడాదిలోపు తీర్చలేని liabilitiesని non-current liabilities అంటారు. ఎందుకంటే వీటిని స్వల్పకాలంలో సెటిల్‌చేయడం సాధ్యంకాదు.
Financial liabilities
ఒక కంపెనీ చెల్లించాల్సిన దీర్ఘకాలిక రుణ బాధ్యతలు (long-term debt obligations) ఇందులో ఉంటాయి. Ancillary and miscellaneous financial liabilities అయిన lease liabilities, ఉద్యోగుల సంబంధిత బాధ్యతలు, భద్రతా డిపాజిట్లు మొదలైనవి ఈ విభాగం కిందకు వస్తాయి.
PROVISIONS
కంపెనీలు సాధారణంగా తమ ఖాతా పుస్తకాల్లో, ఇప్పటికే ఉన్న బాధ్యతలు లేదా ప్రస్తుత బాధ్యతల (Present liabilities) కోసం Provisionsని చేస్తుంటాయి. కంపెనీ వీటిని భవిష్యత్‌లో తప్పకుండా నెరవేర్చాల్సి ఉంటుంది.
అన్ని long-term provisionsని ఈ ప్రొవిజన్స్ ట్యాబ్‌లో చేర్చుతారు.
NON-CURRENT LIABILITIES
కంపెనీ భరిస్తున్న దీర్ఘకాలిక tax liabilities ఇందులో ఉంటాయి.
Current liabilities
ఒక ఏడాది కాలంలో కంపెనీ తిరిగి చెల్లించాల్సిన liabilities ఇందులో ఉంటాయి. వీటినే short-term liabilities అని కూడా అంటారు. అంటే వీటిని ఒక్క సంవత్సరంలోపే చెల్లించాల్సి ఉంటుంది. హెచ్యూఎల్ బ్యాలెన్స్ షీట్లోని Current liabilitiesలో ఇవి కనపడతాయి…
Financial liabilities
కంపెనీ చెల్లించాల్సిన short-term liabilities ఇందులో ఉంటాయి.
సప్లయర్స్కు కంపెనీ చెల్లించాల్సిన Trade payables మరియు చెల్లించని డివిడెండ్, జీతాలు (Salaries), వేతనాలు (Wages), బోనస్, current lease liabilities లాంటివి ఈ financial liabilities కిందకు వస్తాయి.
Other current liabilities
పైన పేర్కొన్న ఏ కేటగిరీకి చెందని liabilities ఈ విభాగం కిందకు వస్తాయి. కస్టమర్ అడ్వాన్సులు, టీడీఎస్(tax deducted at source), ప్రావిడెంట్ ఫండ్ లాంటి statutory duesని ఇందులో చేర్చుతారు.
Provisions
అన్ని స్వల్పకాల మరియు current provisionsను ఇందులో పొందుపరుస్తారు.
Total liabilities
Equity and liabilities సెక్షన్లోని మొత్తం valuesని కలిపితే వచ్చే విలువను total equity and liabilitiesగా పరిగణిస్తారు.
దీని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి?
ఫండమెంటల్ ఎనాలసిస్లో ఈ ఫైనాన్షియల్ నంబర్లు, రేషియోలు ఎంతో కీలకం. కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అనే విషయాలను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. తదుపరి ఛాప్టర్లో వీటిని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ముఖ్యాంశాలు
- బ్యాలెన్స్ షీట్లో రెండు భాగాలుంటాయి. అవి: Assets and Liabilities.
- Assetsలో రెండు ప్రైమరీ కేటగిరీలు ఉంటాయి. అవి: non-current assets and current assets.
- కంపెనీ ఏవైతే assetsను ఏడాది కన్నా ఎక్కువ కాలం తన దగ్గర ఉంచుకుంటుందో వాటిని non-current assets అంటారు. property, plant and equipment, capital work-in-progress, goodwill and other intangibles, financial assets, and non-current tax assets ఇందులో ఉంటాయి. వీటిని అంత సులభంగా క్యాష్లోకి మార్చుకోలేము.
- ఓ కంపెనీ assetsను ఏడాదిలోపు క్యాష్ రూపంలో మార్చుకోగలిగితే వాటిని current assets అంటారు. Inventories, financial assets, other current assets ఇందులో ఉంటాయి.
- equity and liabilities of a balance sheetలో మూడు ప్రైమరీ కేటగిరీలు ఉంటాయి. అవి: equity, non-current liabilities, and current liabilities.
- Equityలో మరో రెండు ఉపవిభాగాలు (Subdivisions) ఉంటాయి. అవి: Equity share capital, other equity.
- Assetsలాగే liabilitiesలోనూ రెండు ఉపవిభాగాలు (Subdivisions) ఉంటాయి. అవి: Non-current liabilities, Current liabilities
Click here: ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?
Click here: Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?