ఆర్య నాగరికత

ఆర్య నాగరికత / వైదిక నాగరికత

భారతదేశంలో సింధు నాగరికత తరువాత అభివృద్ధి చెందిన రెండో నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతకు ఆద్యులు.

నార్డిక్’ అనేది జాతి పదము కాగా, ‘ఆర్య’ అనేది భాషా పదము. ఆర్యులతోనే మన దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయ్యింది. వీరు సంకలనం చేసిన సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటారు. ఈ వేద సాహిత్యమే ఆర్యుల గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఇస్తుంది. అందుకే ఆర్య నాగరికతను వైదిక నాగరికత అంటారు.

పురావస్తు శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ నాగరికతను “Painted Gray Ware (PGW)” నాగరికత అంటారు. ఆర్యులు ఉపయోగించిన ప్రత్యేకమైన కుండపాత్రలనే PGW అంటారు.

వేద సాహిత్యం

ఆర్యులు అద్భుతమైన వేదసాహిత్యాన్ని మనకు కానుకగా అందించారు. ఈ వేద సాహిత్యం తరతరాలుగా మౌఖికంగా వ్యాప్తిలో ఉండి, గుప్తుల కాలంలో గ్రంథస్తం చేయబడింది.

వేద సాహిత్యంలో ప్రధానంగా 8 విభాగాలు ఉన్నాయి. అవి:

 1. వేదాలు
 2. బ్రాహ్మణాలు
 3. అరణ్యకాలు
 4. ఉపనిషత్తులు

NOTE: పై నాలుగింటిని శృతి సాహిత్యం అంటారు. వీటిని మానవులు రాయలేదు. కనుక వీటిని అపౌరుషేయములు అని అంటారు. దేవతల ద్వారా ఇవి ఋషులకు అందించబడ్డాయని చెబుతారు.

5. వేదాంగాలు

6. పురాణాలు

7. ఉపవేదాలు

8. ఇతిహాసాలు

NOTE: ఈ నాలుగింటిని స్మృతి సాహిత్యం అని అంటారు. వీటిని ఋషీశ్వరులు రచించి, మానవాళికి కానుకగా అందించారు.

వేదాలు

ఋగ్వేదం:

ఇందులో 1028 శ్లోకాలు ఉన్నాయి.  వీటిలో 1017 ప్రధానమైనవి, కాగా 17 అనుబంధమైనవి. ఇవి ప్రధానంగా వివిధ దేవతల ప్రార్థనలకు సంబంధించినవి. ఇందులోనే సావిత్రి దేవతకు సంబంధించిన అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రం ఉంది.

ఋగ్వేదంలో 10 మండలాలు (ఛాప్టర్స్‌) ఉన్నాయి. వీటిలో 10వ మండలమైన పురుషసూక్తంలో వర్ణవ్యవస్థ గురించి పేర్కొనబడింది.

పురుషసూక్తం ప్రకారం, బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు సృష్టించబడ్డారు.

యజుర్వేదం:

యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువులు (Rituals) గురించి తెలియజేస్తుంది.

యజుర్వేదంలో 2 భాగాలు ఉన్నాయి. అవి:

 1. శుక్ల యజుర్వేదం: శుక్ల అనగా తెలుపు. ఇది పద్యరూపంలో ఉంటుంది.
 2. కృష్ణ యజుర్వేదం: కృష్ణ అనగా నలుపు. ఇది గద్యరూపంలో రాయబడింది.
సామవేదం:

ఇది సంగీతానికి సంబంధించిన వేదం. వాస్తవానికి ఋగ్వేద మంత్రాలనే రాగయుక్తంగా సామవాదంలో వ్రాశారు.

Note: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలను కలిపి త్రయీ వేదంగా పేర్కొంటారు.

అధర్వణ వేదం:

అధర్వణ వేదంలో 20 ఖండాలు, 711 మంత్రాలు ఉన్నాయి. అధర్వణ వేదంలో భూతప్రేతాలను నివారించే మంత్రాలు మొదలుగునవి ఉన్నాయి. అందుకే చాలా కాలం పాటు అధర్వణ వేదాన్ని వేద సాహిత్యంలో భాగంగా గుర్తించలేదు.

త్రయీ వేదాలను మాత్రమే ఆర్యులు రచించారని, అధర్వణ వేదం అనేది అనార్యుల రచన అని భావిస్తున్నారు.

నేడు అధర్వణ వేదం పైప్పాలద సంహిత, శౌనకీయ సంహితగా లభ్యమవుతోంది.

బ్రాహ్మణాలు

బ్రాహ్మణాలు ప్రధానంగా యజ్ఞయాగాలు గురించి తెలియజేస్తాయి. ఇవి గద్యరూపంలో రాయబడ్డాయి. బ్రాహ్మణాలు మొత్తం ఏడు ఉన్నాయి. ఇవి చతుర్వేదాలకు అనుబంధంగా రాయబడ్డాయి.

 1. ఐతరేయ బ్రాహ్మణం
 2. కౌశితకి బ్రాహ్మణం

ఈ రెండు బ్రాహ్మణాలు ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు

Note: “ఆంధ్ర” అనే పదము మొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. ఐతరేయ బ్రాహ్మణంలో దక్షిణ భారతదేశంలో కళింగ, పుళింద, మూతిబ, సబర, ఆంధ్ర తెగలు జీవిస్తున్నారని పేర్కొనబడింది.

 1. శతపథ బ్రాహ్మణము : ఇది శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథం.

Note: శతపథ బ్రాహ్మణం రాజసూయ, వాజపేయ మొదలైన యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుంది. అలాగే వడ్డీ వ్యాపారాన్ని గురించి మొదటిసారిగా ఈ గ్రంథమే పేర్కొంది. వైశ్యుల్లో కుసిదిన్‌ అనే వడ్డీ వ్యాపారులు అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసేవారని తెలియజేసింది.

 1. తైత్తరీయ బ్రాహ్మణము: ఇది కృష్ణ యజుర్వేదానికి అనుబంధ గ్రంథము.
 2. తాండ్యమహ బ్రాహ్మణము

Note: బ్రాహ్మణాలు అన్నింటిలో తాండ్యమహ బ్రాహ్మణము మొట్టమొదిటిది. ఈ గ్రంథంలో అనార్యులు వ్రత్యస్తోమ క్రతువు ద్వారా ఆర్యులుగా మారవచ్చు అని చెప్పబడింది.

 1. జైమినీయ బ్రాహ్మణము

NOTE: ఈ రైండు బ్రాహ్మణాలు సామవేదానికి అనుబంధ గ్రంథాలు.

 1. గోపథ బ్రాహ్మణము: ఇది అధర్వణ వేదానికి అనుబంధ గ్రంథం.

అరణ్యకాలు

ఏడు బ్రాహ్మణాలకు అనుబంధంగా ఏడు అరణ్యకాలు వ్రాయబడ్డాయి. అవి:

 1. ఐతరేయ అరణ్యకం
 2. కౌశితకి అరణ్యకం
 3. శతపథ అరణ్యకం
 4. తైత్తరీయ అరణ్యకం
 5. జైమినీయ అరణ్యకం
 6. తాండ్యమహ అరణ్యకం
 7. గోపథ అరణ్యకం

ఉపనిషత్తులు

ఉపనిషత్తులను వేదాంతం అని అంటారు. మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా తాత్విక అంశాల గురించి చర్చిస్తాయి.

చాందోగ్య ఉపనిషత్తు: ఆశ్రమాల గురించి మొదటిసారిగా ఈ ఉపనిషత్తులోనే పేర్కొనబడింది. అయితే ఇందులో తొలి మూడు ఆశ్రమాలైన బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం గురించి మాత్రమే పేర్కొనబడింది. సన్యాసాశ్రమం గురించి ఇందులో ప్రస్తావన లేదు.

బృహదారణ్యక ఉపనిషత్తు: యజ్ఞవల్క్యుడు తన భార్యలైన కాత్యాయని, మైత్రేయిలతో జరిపిన తాత్విక సమాలోచనలు ఉన్నాయి.

ముండకోపనిషత్తు: భారత జాతీయ చిహ్నంలోని “సత్యమేవ జయతే” సూక్తి ఇందులో నుంచే తీసుకున్నారు.

జబలోపనిషత్తు: మానవజీవితంలో నాలుగు ప్రధాన ఆశ్రమాలైన బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమాల గురించి పేర్కొంది.

శ్వేతాశ్వతర ఉపనిషత్తు: “భక్తి” గురించి తెలియజేసిన తొలి గ్రంథం. భక్తి ద్వారా మోక్షం లభిస్తుందని స్పష్టం చేసింది.

Wait for  PART -2 

ఇదీ చూడండి: మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా?

ఇదీ చూడండి: అభిమన్యు – ది రియల్‌ వారియర్‌

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?