Adjustable lensesతో Apple glass!

apple files patent for apple glass with adjustable lenses

Apple iPhone, Apple Watch, Apple iPod.. ఇలా Apple బ్రాండ్స్కున్న క్రేజే వేరు. Apple నుంచి వచ్చే ఏ వార్త అయినా స్పాట్లైట్లో కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొ వార్తపై గాసిప్స్ మొదలయ్యాయి. అదే Apple Glass! ఈ ప్రాజెక్ట్పై కొన్నేళ్ల ముందే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజగా, ఇప్పుడు మరోమారు ఈ Apple Glass వార్తల్లో నిలిచింది. Apple సంస్థ కొత్త patent దాఖలు చేయడమే ఇందుకు కారణం. Adjustable lensesతో ఈ Apple Glass వస్తుంది ఆ patentలో ఉంది.

సరికొత్త సాంకేతికతతో

US patent and Trademark Office వద్ద ఈ patentను దాఖలు చేసింది Apple. అయితే ఈ patentలో ఈ స్మార్ట్ glassకి సంబంధించిన డిజైన్ గురించి ఎలాంటి వివరాలు లేవు. కానీ adjustable lenses అనేది ఎంతో ఆసక్తికరమైన విషయం. పరిసర ప్రాంతాల్లో ఉన్న కాంతికి అనుగుణంగా ఈ lenses adjust అవుతుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. # Adjustable lensesతో Apple glass! #

ఇందులో light receptors ఉంటాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న కాంతికి తగ్గట్టుగా, ఫోకల్ length మర్చుకోమని ఇది lensకి సూచిస్తుంది. దీనివల్ల చుట్టుపక్క ఉన్న డివైజ్లను ఇంకా బాగా చూడగలుగుతాము. ఇది ఓ సరికొత్త సాంకేతికత. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్మార్ట్గ్లాస్లలో ఇది లేదు.

అయితే ఈ ప్రాజెక్ట్లో Apple ముందుకెళుతుందా లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. Patent దాఖలు చేసినంత మాత్రాన ప్రాడక్ట్ కార్యరూపం దాల్చుతుందని చెప్పలేము. గతంలోనూ ఎన్నో ప్రాడక్ట్స్కు పేటెంట్ దాఖలు చేసుకుని పక్కపెట్టింది Apple. # Adjustable lensesతో Apple glass! #

Click here: iPhone 13 ఇలా ఉండనుందా?

Click here: Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?