Advanced Fundamental Analysis

Advanced Fundamental Analysis

అడ్వాన్స్‌డ్ ఫండమెంటల్ ఎనాలసిస్‌

ఇప్పటి వరకు మనం ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్స్‌ను, పబ్లిక్‌కి అందుబాటులో ఉన్న రిపోర్టులను ఎలా చదవాలో తెలుసుకున్నాం. మరి దీని తరువాత ఏమి చేయాలి? ఈ సమాచారం సేకరించడం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం Advanced Fundamental Analysisలో దొరుకుతుంది.

ఈ కాన్సెప్ట్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు మనం ఒక ఉదాహరణను చూద్దాం.

ఉదాహరణకు మీరు ఒక క్రికెట్‌ జట్టుకు, మంచి కెప్టెన్‌ను ఎంపిక చేయాలని అనుకున్నారు. రాహుల్‌ అనే ఆటగాడు మీ దృష్టిలో ఉన్నాడు. అప్పుడు మీరు రాహుల్‌ గురించి, మీకు తెలియకుండానే ఫండమెంటల్ ఎనాలసిస్‌ చేస్తారు. అదెలా అంటే?

ముందుగా మీ జట్టుకు కెప్టెన్‌గా రాహుల్‌ సరిపోతాడా? లేదా? అని చూస్తారు. అందుకోసం అతని వ్యక్తిగత పెర్ఫార్మెన్స్‌ను, ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తారు.

మీ అధ్యయనంలో రాహుల్‌ చాలా మంచి ప్లేయర్‌ అని నిర్ధారణ అయ్యింది. పైగా అతనికి ఆటగాడిగా 6 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. ఇదంతా చూస్తుంటే, అతను మీ జట్టుకు మంచి కెప్టెన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. రాహుల్‌ను మీరు వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మరి రాహుల్‌ కోసం మీరు ఎంత మేరకు ఖర్చు చేయగలరు? వాస్తవంగా రాహుల్‌ కోసం ఎంత ఖర్చు చేయవచ్చు? అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు:

 • రాహుల్‌కు మంచి కెప్టెన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ అతని విలువ ఎంత?
 • రాహుల్‌ కోసం రూ.15 కోట్లు వెచ్చించాలా? లేదా రూ.50 కోట్లు వెచ్చించాలా?
 • వాస్తవంగా మీ బడ్జెట్‌ కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఉందనుకుందాం. అప్పుడు రాహుల్‌ను తీసుకుంటే, ఇతర ఆటగాళ్ల మాటేమిటి?
 • ఒక వేళ రాహుల్‌ని తీసుకుంటే, జట్టుకు మంచి కెప్టెన్‌ దొరుకుతాడు. కానీ జట్టులో సరైన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఉండరు కదా!

సింపుల్‌గా చెప్పాలంటే, రాహుల్‌ను జట్టులోకి తీసుకునేందుకు మీరు చేస్తున్న ఖర్చు సరైనదేనా? నిజానికి అతనికి అంత విలువ ఉందా? అనేది మీరు చూస్తారు. అంటే మీరు ఫండమెంటల్ ఎనాలసిస్‌ చేసి, అతనిని జట్టులోకి తీసుకోవాలా? లేదా? అని నిర్ణయించుకుంటారు.

ఇదే విధంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు కూడా ఫండమెంటల్ ఎనాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ కంపెనీ యొక్క షేర్స్‌ను కొనుక్కొని, మన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసి ఉంచవచ్చా? లేదా? అని నిర్ణయించుకోవాలి. ఇందు కోసం మనం కొన్ని లెక్కలు వేయల్సి ఉంటుంది. దీనికి ఉపకరించేదే అడ్వాన్స్‌డ్ ఫండమెంటల్ ఎనాలసిస్‌.

అడ్వాన్స్‌డ్‌ ఫండమెటల్ ఎనాలసిస్ఓవర్వ్యూ

ఫండమెంటల్ ఎనాలసిస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ను చదవడం, వాటిని విశ్లేషించడంతోనే మన పని అయిపోదు. ముందుగా మనం స్టాక్ క్వాలిటీని అంచనా వేయాలి. తరువాత ఆ స్టాక్‌కు ఇన్వెస్ట్‌ చేయదగిన worth ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. దానితో పాటు ఆ స్టాక్‌ మన పోర్ట్ఫోలియోకు సరిపోతుందా? లేదా? అన్నది విశ్లేషించుకోవాలి.

Intrinsic Value

వాస్తవానికి ఓ కంపెనీ యొక్క Intrinsic Valueను కనుగొనడమే అడ్వాన్స్‌డ్‌ ఫండమెటల్ ఎనాలసిస్ యొక్క ముఖ్య లక్ష్యం. Intrinsic valueను కనుగొనడం వల్ల, ఆ కంపెనీ షేర్ overvalued గా ఉందా? undervaluedగా ఉందా? అనేది తెలుస్తుంది.

క్విటీ రీసెర్చ్‌

ఈక్విటీ రీసెర్చ్‌లో ప్రధానంగా మూడు దశలు (Phases) ఉంటాయి. అవి:

 1. కంపెనీ వ్యాపారం, ఫైనాన్షియల్స్, కార్యకలాపాలను అర్థం చేసుకోవాలి.
 2. అప్లికేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్టర్స్‌ చెక్‌లిస్ట్‌ (Investor’s Checklist)
 3. వాల్యుయేషన్ (valuation).

ఈక్విటీ రీసెర్చ్‌లో భాగంగా ఈ మూడు ఫేజ్‌లను సరిగ్గా అర్థం చేసుకునేందుకు 30 ఏళ్ల బాలయ్య అనే investorను ఉదాహరణకు తీసుకుందాం.

 1. కంపెనీ వ్యాపారం, ఫైనాన్షియల్స్, కార్యకలాపాలను అర్థం చేసుకోవడం

బాలయ్య ఏ కంపెనీలో అయితే పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాడో, దాని యొక్క ఫైనాన్షియల్స్పై, ఆన్యువల్ రిపోర్ట్స్‌పై రీసర్చ్ చేయడానికి తగినంత సమయం కేటాయించాడు.  తాను చేసిన రీసర్చ్ను, నిపుణులు, సర్టిఫైడ్‌ అనలిస్ట్‌లు రూపొందించిన రిపోర్టులతో, ఇతర సమాచారంతో పోల్చిచూశాడు.

అన్నీ సరిచూసుకున్నాక, తాను ఇన్వెస్ట్ చేద్దామనుకున్న కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందని గుర్తించాడు. దానిలో పెట్టుబడులు పెడితే, భవిష్యత్‌లో మంచి లాభాలు వచ్చే అవకాశముందని తెలుసుకున్నాడు.

ఆ తరువాత, ఆ కంపెనీ షేర్లు తన పోర్ట్‌ఫోలియోకు సరిపోతాయా? లేదా? అని చూసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం Investor check listను అప్లై చేశాడు.

 1. Application of the investors check list

పర్టిక్యులర్‌ కంపెనీ స్టాక్‌పై తనకున్న అంచనాలను (expectations), బాలయ్య ఓ చెక్లిస్ట్ రూపంలో పెట్టుకున్నాడు. ఆ కంపెనీ తన చెక్లిస్ట్ను సంతృప్తి పరుస్తోందా? లేదా? అన్నది చూసుకున్నాడు.

మనం కూడా బాలయ్య Investor’s check listను చూద్దాం.

బాలయ్య అంచనాలు 
(Expectations)
బాలయ్య రీజనింగ్ 
(Reasoning)
 PAT margin – 15% శాతం కంటే ఎక్కువ. లాభాలు ఎంత ఎక్కువగా ఉంటే, అవి షేర్హోల్డర్లకు అంత లాభం చేకూరుతుంది.
Operating revenue:  ప్రతి ఏటా పెరుగుతోంది. Operating revenue పెరుగుతుంటే, కంపెనీ వృద్ధి చెందుతున్నట్టు అర్థం.
Earnings per share: ప్రతీ ఏటా పెరుగుతోంది. EPS పెరిగితే షేర్హోల్డర్లకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.
Return on capital employed: 40% శాతం కంటే ఎక్కువ. ROCE ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీ తన ఓవరాల్ క్యాపిటల్ను అంత సమర్థంగా వినియోగించుకుంటున్నట్టు లెక్క.
Debt to equity ratio: ఒకటి కంటే తక్కువ. Debt to equity ratio తక్కువగా ఉందంటే, కంపెనీ అప్పులపై పెద్దగా ఆధారపడడంలేదని అర్థం చేసుకోవచ్చు.
Average collection period: 15 రోజుల కంటే తక్కువ. Average collection period తక్కువగా ఉందంటే, కంపెనీ తన debtors నుంచి చాలా తక్కువ సమయంలోనే పేమెంట్స్ కలెక్ట్‌ చేసుకోగలుగుతోందని లెక్క.
Operating cash flow ratio: ఒకటి కంటే ఎక్కువ. Operating cash flow ఎక్కువగా ఉందంటే, current debtsను చెల్లించేందుకు, తగినంత క్యాష్‌ను కంపెనీ జనరేట్ చేస్తున్నట్లు.
 1. వాల్యూయేషన్‌ (Valuation)

చివరికి కంపెనీ తన చెక్లిస్ట్ను సంతృప్తిపరిచినట్టు గుర్తించిన బాలయ్య, valuation ప్రక్రియను మొదలుపెడతాడు.

ఉదాహరణకు, బాలయ్య ఎంచుకున్న కంపెనీ యొక్క షేర్‌, స్టాక్ మార్కెట్లో రూ.325 వద్ద ట్రేడ్ అవుతోందని అనుకుందాం. మరి రూ.325 ధర వద్ద ఆ స్టాక్‌ను కొనవచ్చా? లేదా? అనేది బాలయ్యకు ఎలా తెలుస్తుంది?

దీనికి సమాధానం – ‘Valuation’ ద్వారా తెలుస్తుంది.

కంపెనీ యొక్క Real Intrinsic Value తెలుసుకునేందుకు valuation ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా కంపెనీ షేర్ ధర overvaluedగా ఉందా? undervaluedగా ఉందా? అనేది తెలుస్తుంది. అందుకే రానున్న ఛాప్టర్లలో దీనిపై ప్రత్యేక దృష్టిపెడదాము.

ముఖ్యాంశాలు

 • వాస్తవానికి కంపెనీ యొక్క Intrinsic Valueను కనుక్కోవడమే advanced fundamental analysis యొక్క లక్ష్యం.
 • ఇన్వెస్టర్‌ ముందుగా Stock qualityని అసెస్ చేయాలి. తరువాత ఆ స్టాక్‌ విలువను గుర్తించాలి. అది మన పోర్ట్‌ఫోలియోకు సరిపోతుందా? లేదా? అన్నది చూసుకోవాలి.
 • Intrinsic valueను కొనుగొనడం వల్ల ఓ స్టాక్ Overvaluedగా ఉందా? లేదా Undervaluedగా ఉందా అనేది తెలుస్తుంది.
 • ఈక్విటీ రీసెర్చ్లో ప్రధానంగా మూడు Phases ఉంటాయి. అవి:
 1. కంపెనీ వ్యాపారాన్ని, ఫైనాన్షియల్స్‌ను, కార్యకలాపాలను అర్థం చేసుకోవడం.
 2. investor’s checklistను అప్లై చేయడం.
 3. వాల్యుయేషన్(valuation) పూర్తి చేయడం.

Click here: ఫండమెంటల్ ఎనాలసిస్ అంటే ఏంటి?

Click here: Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?