ఇక Twitter వినియోగదారులు తమ Snapchat ఖాతాలోనూ ట్వీట్లను పోస్ట్ చేయవచ్చు. ఈ మేరకు snapchatతో కొలాబొరేట్ అయ్యింది సామాజిక మాధ్యమ దిగ్గజం. స్టిక్కర్స్ రూపంలో ట్వీట్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. Snapchatతో పోలిన Fleets ఫీచర్ను ట్విట్టర్ ఆవిష్కరించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ట్విట్టర్, స్మాప్‌చాట్ జతకట్టడం ప్రాధాన్యం ఏర్పడింది.
Snapchatలో ఎలా ట్వీట్ పోస్ట్ చెయ్యాలి?
- ముందుగా ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేయాలి.
- iPhoneలో ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి, షేర్ చేయాలనుకుంటున్న ట్వీట్స్‌పై టాప్ చెయ్యాలి.
- ఆ ట్వీట్ కింద స్మాప్‌చాట్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద టాప్ చేస్తే స్టిక్కర్ వస్తుంది.
ఆండ్రాయిడ్‌కు కూడా త్వరలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దీనిని పరీక్షించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
– VISWA (WRITER)
Click here: ఈ ఏడాది Most liked tweet ఎవరిదో తెలుసా?
Click here: Google maps నుంచి community feed ఫీచర్