iPhone 12కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. Apple ఫోన్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్ ఈ iPhone 12. దీనికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. ఈ కొత్త మోడల్ తమ చేతికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వినియోగదారులు ఎదురుచూశారు. అయితే iPhone 12లో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ను స్వయంగా ఉపయోగించిన వారే Appleకు కంప్లయింట్లు చేస్తున్నారట. # iPhone 12లో ఇన్ని సమస్యలా? #
ముఖ్యంగా సిగ్నల్లో విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నట్టు సమాచారం. అందులోనూ ప్రయాణంలో ఉన్నప్పుడు Connectivity పోవడం జరుగుతోందని చెబుతున్నారు. Verizon, AT&T network, T-mobile యూజర్స్ ఈ సమస్యను రిపోర్ట్ చేశారు. సిగ్నల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు వస్తుండటం గమనార్హం.
ఇప్పటికే 100కుపైగా వినియోగదారులు complaints ఇచ్చారు. అయితే దీనిపై Apple ఇంకా అధికారికంగా స్పందించలేదు. iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max.. ఇలా అన్ని మోడళ్లల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. తరచూ signals dropను యూజర్స్ ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే రోజుకు ఏకంగా 15సార్లు ఈ సమస్యకు గురవుతున్నట్టు వెల్లడించారు. Airplan mode ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. # iPhone 12లో ఇన్ని సమస్యలా? #
– VISWA (WRITER)
Click here: Apple Foldable iPhone కల నెరవేరేనా?
Click here: iPhone 13 ఇలా ఉండనుందా?