II తం భూసుతా ముక్తి ముదార హాసం
వందే యతో భవ్య భవం దయాశ్రీ
శ్రీ యాదవం భవ్య భతో యదేవం
సంహారదా ముక్తిముతా సుభూతంII
ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ఉంటుంది. ఈ శ్లోకం ”శ్రీరామకృష్ణవిలోమ కావ్యం”లోనిది. # తెలుగు కవుల పద క్రీడా విన్యాసం #
ఈ కావ్యాన్ని రాసిన మహానుభావుడు దివిసీమలో 14వ శతాబ్దంలో జనించిన దైవజ్ఞ సూర్యసూరి. ఆయన ఆలోచనల్ని, కవిత్వాన్ని క్రీడలా చేసి చూపించిన మహనీయుడు.
ఎడమ నుంచి, కుడికి చదివితే…
పై శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివితే శ్రీరాముని స్తుతి కనిపిస్తుంది.
“ఎవరైతే సీతమ్మను రక్షించారో, ఎవరి చిరునువ్వు మనోహరంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భతమో, ఎవరి నుంచి అయితే దయ వర్షిస్తుందో అట్టి శ్రీరాముని నమష్కరిస్తున్నాను” అని అర్థం.
కుడి నుంచి ఎడమ చదివితే…
పై శ్లోకాన్ని కుడి నుంచి ఎడమకు చదివితే శ్రీకృష్ణుని స్తుతి కనిపిస్తుంది.
“శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు పాత్రోధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణనికి నమష్కరిస్తున్నాను” అని అర్థం వస్తుంది.
ఇదీ చూడండి: అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’
ఇదీ చూడండి: శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?