భారత మార్కెట్లు విదేశీ సంస్థలకు ఎంతో ముఖ్యం. అందుకే కొత్త కొత్త ప్రాడక్ట్స్తో భారత వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రముఖంగా స్మార్ట్ఫోన్లతో దేశంలో హవా సృష్టించిన Oneplus, Oppo, Realme బ్రాండ్లు, ఇప్పుడు తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో IOT పరికరాలపై దృష్టి సారించి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖంగా ఇందుకోసం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్మార్ట్ టీవీ రంగాన్ని ఎంచుకుంటున్నాయి. # స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!
పోటీగా!
ఇప్పటికైతే స్మార్ట్ టీవీల్లో Xiaomiదే అగ్రస్థానం. అయితే ఈ సంస్థకు గట్టి పోటీ ఇచ్చేందుకు Oppo సన్నద్ధమవుతోంది. స్మార్ట్ టీవీతో పాటు బ్లూటూత్, స్మార్ట్ వాచ్ వంటి డివైజ్‌లను నవంబర్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వీటిని చైనాలో రిలీజ్ చేసింది. అక్కడ Entertainment, home appliances, fitness వంటిపై ఎక్కువ దృష్టి పెట్టింది.
Realme నుంచి ఇప్పటికే స్మార్ట్ టీవీ మార్కెట్లో విడుదలైంది. ఇక ఇప్పుడు తన IOT సామ్రాజ్యన్ని పెంచుకోవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే mid, high, premium సెగ్మెంట్లలో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. # స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను! #
అయితే Oneplus మాత్రం వీటికి కొంత భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. కేవలం affordable segment పైనే దృష్టి సారించింది. ఇలా తన స్మార్ట్ టీవీ వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. 2021 నాటికి వివిధ రకాల స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది.
– VISWA (WRITER)
Click here: 1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు?