Xiaomi products కోసం వినియోగదారులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తారు. వారిని సంతృప్తిపరిచేందుకు Xiaomi కూడా ఎప్పటికప్పుడు కొత్త productsను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడది Xiaomi Mi 11 వంతు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది Xiaomi. ఈలోపే దీనికి సంబంధించిన విశేషాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Four-sided curved displayతో ఈ Xiaomi Mi 11 మన ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. Xiaomi నుంచి ఓ పెద్ద అప్గ్రేడ్ వచ్చినట్టే. Mi 10, Mi 10 Proలో dual curved displays మాత్రమే ఉన్నాయి. #Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!#
ఇందులో Snapdragon 875 SoC ఉంటుందని సమాచారం. ఇదే జరిగితే.. మొత్తం చైనా స్మార్ట్ఫోన్ రంగంలో ఈ టెక్నాలజీ ఉన్న తొలిఫోన్ ఇదే అవుతుంది. ఇక కెమెరాకు కూడా భారీగా ప్లాన్ చేస్తోందంట ఈ Xiaomi. 108-megapixel – 192 megapixel మధ్యలో ఉండే అవకాశం ఉందట. ఇతర lensesలో 48- megapixel ultra wide angle lens కూడా ఉండనుందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
చైనాలో వచ్చే ఏడాది తొలినాళ్లల్లోనే ఈ Xiaomi Mi 11ను ఆవిష్కరించే అవకాశముందని పలువురు tipsters అభిప్రాయపడుతున్నారు. అయితే చైనాలో విడుదలైన కొన్ని వారాలకు లేదా నెలలకు దీనిని ప్రపంచ మార్కెట్లోకి తీసుకొస్తుందట Xiaomi. #Xiaomi Mi 11 ఇలా ఉంటే ఇక కొనాల్సిందే!#
– VISWA (WRITER)
Click here: ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!
Click here: శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?