What is fundamental analysis?
స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఓ అస్సెట్ (Asset) యొక్క విలువ(value)ను తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు.
అపోహలు వీడండి!
అపోహ: ఫండమెంటల్ ఎనాలసిస్ అనేది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం.
అపోహ: స్టాక్ మార్కెట్ నిపుణులు, అత్యంత అనుభవజ్ఞులు మాత్రమే ఫండమెంటల్ ఎనాసిస్ చేయగలరు.
అపోహ: మనలాంటి సామాన్యులకు ఫండమెంటల్ ఎనాలసిస్ చేయడం సాధ్యం కాదు.
ఇలాంటి అపోహలను మనం తక్షణమే విడిచిపెట్టాలి.
నిజానికి మీలోనే ఒక అనలిస్ట్ ఉన్నాడు/ఉంది!
నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఉదాహరణకు ఓ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేసే పని మీకు అప్పగించారని అనుకుందాం. అప్పుడు జట్టుకు సరైన సారథిని మీరు ఎలా ఎంచుకుంటారు?
- ఇప్పటి వరకు ప్లేయర్ చేసిన ప్రదర్శన
- ప్లేయర్ స్ట్రైక్ రేట్
- ప్లేయర్ యావరేజ్
- ఫీల్డ్లో ఆ ప్లేయర్ ప్రవర్తన
దాదాపు మీరు చూసేవి ఇవే కదా! క్రికెట్ నిపుణులు కూడా ఈ అంశాలనే పరిగణిస్తారు. (నిపుణులు మరిన్ని అంశాలను కూడా పరిగణిస్తారు. అది వేరే విషయం.)
నిజానికి మీరు క్రికెట్ నిపుణులు కారు. ఓ సాధారణ క్రికెట్ అభిమాని మాత్రమే. అయినప్పటికీ, ఓ జట్టు కెప్టెన్ను ఎంపిక చేసేటప్పుడు సాధారణంగా ఏయే అంశాలను పరిగణించాలో మీకు తెలుసు. అంటే మీలోనూ ఓ మాదిరి అనలిస్ట్ ఉన్నట్లే కదా!
క్రికెట్ ఒక్కటే కాదు, రోజువారీ జీవితంలోనూ వేరువేరు సందర్భాల్లో మీరు ఫండమెంటల్ ఎనాలసిస్ను ఉపయోగిస్తూ ఉంటారు.
ఉదాహరణకు
మీరు ఒక జత దుస్తులు కొందామనుకున్నారు. అప్పుడు మీరు ఏఏ అంశాలను పరిగణిస్తారు?
- అసలు డ్రెస్ తీసుకుంటున్నది ఎందుకు?
- ఎలాంటి డ్రెస్ తీసుకోవాలి?
- ఆ డ్రెస్ సైజు ఎంత ఉండాలి?
- ఏ రంగు డ్రెస్ తీసుకోవాలి?
- బడ్జెట్ ఎంత?
- ఏ బ్రాండ్ డ్రెస్ తీసుకోవాలి?
- డ్రెస్తో పాటు మ్యాచింగ్ యాక్ససరీస్ ఏవైనా తీసుకోవాలా?
రోజువారీ జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకునేది ఇలాగే కదా? దీనినే ఫండమెంటల్ అనాలసిస్ అంటారు. కానీ మీరు రోజువారీ పనుల్లో భాగంగా దీనిని చేస్తుండడం వల్ల… అది ఫండమెంటల్ అనాలసిస్ అని మీకు తెలియదు.
స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఒక అస్సెట్ లేదా కంపెనీ యొక్క ఫండమెంటల్ ఎనాలసిస్ను కూడా ఇదే విధంగా చేస్తారు!
ఫండమెంటల్ అనాలసిస్
సింపుల్‌గా చెప్పాలంటే ఏదైతే కంపెనీలో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో దానికి ఆ అర్హత ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడమే “ఫండమెంటల్ ఎనాలసిస్”.
ఫండమెంటల్ అనాలసిస్ నిర్వచనం
ఏదైనా అస్సెట్ యొక్క విలువ(value)ను గుర్తించడానికి ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు. కంపెనీ వ్యాపారాన్ని, దాని భవిష్యత్తును ప్రభావితం చేయగలిగే అంశాలపై ఇది దృష్టి పెడుతుంది. కంపెనీ యొక్క ఎకనామిక్స్‌ను, ఫైనాన్షియల్స్ను ఎనలైజ్ చేసేందుకు ఈ ఫండమెంటల్ ఎనాలసిస్ ఉపయోగపడుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ స్టాక్ వాల్యూకు అనుగుణంగా ఆ స్టాక్ ధర ఉందా? లేదా? అన్నది ఈ ఫండమెంటల్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకోవచ్చు.
దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి!
ఉదాహరణకు Reliance Industries Ltd.ను తీసుకుందాం.
RIL SHARE PRICE -1
2020 ఫిబ్రవరి 20న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క షేర్ ధర రూ.1,841.95గా ఉంది.
RIL SHARE PRICE – 2
2020 మార్చి 23 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర రూ.875.75కి పడిపోయింది.
సాధారణ ఇన్వెస్టర్లు ఈ గణాంకాలను చూసి, షేర్ ధర పడిపోయింది కాబట్టి, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టకూడదని అనుకుంటారు.
RIL SHARE PRICE – 3
కానీ 2021 జనవరి 18 నాటికి అదే రిలయన్స్ షేర్ ధర రూ.2,099.40కి పెరిగిపోయింది.
దీనిని అనుసరించి మనం ఏం అర్థం చేసుకోవాలి?
RIL SHARE PRICE – 4
స్వల్పకాలంలో స్టాక్ ధరల్లో ఒడుదొడుకులు చాలా సహజం. ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది.
కానీ మంచి వాల్యుతో, ఫండమెంటల్గా స్ట్రాంగ్‌గా ఉండే కంపెనీ దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తుంది.
ఏ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్‌గా ఉందో ఎలా తెలుసుకోవాలి?
ఫండమెంటల్ అనాలసిస్ చేయడం ద్వారా ఒక కంపెనీ స్ట్రాంగ్‌గా ఉందా? లేదా? అనేది తెలుసుకోగలుగుతాం. అయితే ఇందుకోసం సరైన టెక్నిక్స్ ఉపయోగించాలి. అవేంటో తదుపరి ఛాప్టర్‌లో తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
- ఓ అస్సెట్ యొక్క వాల్యూ తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నిక్‌నే ఫండమెంటల్ ఎనాలసిస్ అంటారు.
- కంపెనీ వ్యాపారాన్ని, భవిష్యత్తుని ప్రభావితం చేయగలిగే అంశాలపై ఫండమెంటల్ ఎనాలసిస్ దృష్టిపెడుతుంది.
- ఓ కంపెనీ యొక్క ఎకనామిక్స్‌ను, ఫైనాన్షియల్స్ను విశ్లేషించేందుకు ఫండమెంటల్ ఎనాలసిస్ ఉపయోగపడుతుంది.
- ఫండమెంటల్ ఎనాలసిస్ ద్వారా స్టాక్ వాల్యూకు అనుగుణంగా దాని ధర ఉందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు.
- మనం వెచ్చించేది స్టాక్ ప్రైజ్, మనకి లభించేది ఆ స్టాక్ వాల్యూ.
- స్వల్పకాలంలో స్టాక్ ప్రైజ్‌ల్లో ఒడుదొడుకులు సహజం. అయితే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తుంది.
Click here: వార్షిక నివేదిక అంటే ఏమిటి?
Click here: ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?