What is an index?

what is an index?

ఇండెక్స్ (సూచీ) అంటే ఏమిటి?

 హాయ్ ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్ indices గురించి తెలుసుకుందాం. # What is an index? #

BSE, NSEల్లో వేలాది స్టాక్స్……. లిస్ట్ అయి ఉంటాయి. So అన్ని లిస్టెడ్  కంపెనీల షేర్ల కదలికలను ట్రాక్ చేయడం మనకు సాధ్యమయ్యే పనికాదు. అలా కాకుండా నిర్థిష్ట సంఖ్యలో కొన్ని well established and financially strong కంపెనీల షేర్లను ఎంచుకొని, వాటి కదలికలను ట్రాక్ చేయడం చాలా సులువుగా ఉంటుంది కదా. ఇలా ఓ నిర్ధిష్ట సంఖ్యలో ఎంచుకున్న స్టాక్‌లనే index అని అనవచ్చు.

ఈ ఇండెక్స్‌లోని స్టాక్స్ బాగా perform చేస్తే మార్కెట్ లాభాల దిశగా పయనిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాకాకుండా వాటి performance poorగా ఉంటే మార్కెట్ నష్టాల దిశగా పయనిస్తున్నట్లు భావించవచ్చు.

అంతే కాకుండా ఈ indices ద్వారా మార్కెట్ మూవ్‌మెంట్‌ను, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను కూడా సులువుగా ఆర్థం చేసుకోవడానికి వీలవుతుంది.

Benchmark indices in India

అందుకే BSE, NSEలు కొన్ని స్టాక్‌ మార్కెట్ indicesను రూపొందించాయి. వాటిలో ప్రధానంగా రెండు Benchmark indices ఉన్నాయి. అవి

  1. The S&P BSE SENSEX
  2. The CNX NIFTY

ఇప్పుడు SENSEX & NIFTYల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

The S&P BSE SENSEX

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీని ‘సెన్సెక్స్’ అంటారు. దీనిని 1986లో introduceచేశారు. ఇది భారతదేశంలోనే oldest index.

NOTE:

ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన స్టాండర్ట్ అండ్ పూర్స్‌ (S&P)……… BSE SENSEXను రూపొందించడానికి తన సాంకేతిక నైపుణ్యాన్నిఅందించింది. అందువల్లనే సెన్సెక్స్‌ను టెక్నికల్‌గా The S&P BSE SENSEXగా పిలుస్తారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్‌లో TOP 30 most traded స్టాక్స్ ఉన్నాయి.

CNX NIFTY (NIFTY 50)

CNX NIFTYనే నిఫ్టీ 50 అంటారు. దీనిని 1996లో ప్రారంభించారు. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీగా పనిచేస్తోంది.

CNX NIFTYలోని CNX ట్యాగ్‌ CRISIL మరియు NSEలను సూచిస్తుంది.

NOTE:

నిఫ్టీ 50 అనేది Indian index services & Products Limited (IISL) యాజమాన్యంలో ఉంది.

IISL అనేది భారతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) మరియు NSEల జాయింట్ వెంచర్ సంస్థ.

Other sector- specific indices:

సెన్సెక్స్ మరియు నిఫ్టీ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థలోని బహుళ రంగాలను కవర్ చేస్తున్నాయి కనుక ఇవి broad market indicesగా పరిగణించబడుతున్నాయి.

అయితే BSE, NSEలు……. ఈ రెండు సూచీలతో పాటు… నిర్ధిష్టంగా వివిధ రంగాల లేదా పరిశ్రమల పనితీరును ట్రాక్ చేసేందుకు sectorial indicesని కూడా ఏర్పాటుచేశాయి.

ఉదాహరణకు: BANK NIFTY, BSE AUTO లాంటి sector specific indexలు.

బ్యాంకు నిఫ్టీలో ఇండియన్‌ బ్యాంకింగ్ సెక్టార్‌లోని టాప్ 12 స్టాక్స్ ఉన్నాయి. అలాగే BSE AUTOలో automotive industryలోని టాప్ 15 స్టాక్స్‌ ఉన్నాయి.

ఈ indices వల్ల investorsకి కలిగే లాభాలు ఏమిటి?

స్టాక్ మార్కెట్ సూచికలు పెట్టుబడిదారులకు సమాచార సంపదను అందిస్తాయి. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో, అలాగే సాధారణ పెట్టుబడిదారుల సెంటిమెంట్స్‌ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. అలాగే పెట్టుబడిదారులు తమ investment strategyని తగిన విధంగా రూపొందించుకునేందుకు, దానిలోనూ మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుకల్పిస్తుంది.

Click here: MUHURAT TRADING అంటే ఏమిటి?

Click here: What is the share market/ stock market?

 

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?