వార్షిక నివేదిక అంటే ఏమిటి?

What is an annual report?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో “వార్షిక నివేదిక” అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఒక కంపెనీకి చెందిన ఆర్థిక, ఆర్థికేతర అంశాలు మరియు ఇతర కార్యకలాపాల వివరాలు తెలిపే దానిని వార్షిక నివేదిక (Annual report) అంటారు. దీని ద్వారా మనం… కంపెనీ యొక్క గుణాత్మక అంశాలను (Qualitative aspects), భవిష్యత్ దృక్పథాన్ని(future outlook) తెలుసుకోవచ్చు.

కంపెనీలు… ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఈ వార్షిక నివేదికను ప్రచురించి.. షేర్ హోల్డర్లకు, ప్రమోటర్లకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు, SEBIకి అందజేస్తుంటాయి. అలాగే ఈ వార్షిక నివేదికను తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటాయి.

వెబ్‌సైట్‌లోని Investors sectionలో ఉండే ఈ వార్షిక నివేదికను… ఇన్వెస్టర్లతో పాటు సాధారణ ప్రజలు కూడా చూడవచ్చు.

కంపెనీలు స్వయంగా రూపొందించే ఈ వార్షిక నివేదికలో చాలా సెక్షన్‌లు ఉంటాయి. వాటిలో ఆ కంపెనీకి చెందిన micro and macro economic conditionsతో పాటు అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.

ఒక కంపెనీ యొక్క వార్షిక నివేదికలోన ప్రధాన విభాగంలో కంపెనీకి చెందిన financials మరియు అకౌంటింగ్ డేటా ఉంటాయి. వీటితో పాటు కంపెనీ యొక్క qualitative aspects కూడా ఉంటాయి.

Annual reportలోని ముఖ్యమైన సెక్షన్‌లు:

  1. కంపెనీ ఓవర్‌వ్యూ
  2. కంపెనీ బిజినెస్ స్ట్రేటజీ
  3. Corporate social responsibility
  4. Management discussion and analysis

కంపెనీ ఓవర్‌వ్యూ

వార్షిక నివేదికలో… ప్రారంభంలోనే కంపెనీ యొక్క brief introduction & history ఉంటుంది. ఈ సెక్షన్‌లో ఆ కంపెనీ యొక్క వివిధ డివిజన్లు గురించి, sub-brands గురించిన వివరాలు ఉంటాయి. వీటితోపాటు కంపెనీ యొక్క ఉత్పత్తులు, సేవలు గురించిన సమాచారం మరియు గణాంకాలు కూడా ఉంటాయి.

ఈ సెక్షన్‌లోనే… గడచిన సంవత్సరంలో కంపెనీ చెందిన mergers, demergers మరియు acquisitions, business expansion గురించిన వివరాలు సైతం ఉంటాయి.

బిజినెస్ స్ట్రాటజీ

ఇన్వెస్టర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన విభాగం ఇది. దీనిలో కంపెనీకి చెందిన భవిష్యత్ లక్ష్యాలు, అందుకోసం అనుసరిస్తున్న వ్యాపార వ్యూహాలు, విధానాలు ఉంటాయి. అలాగే కంపెనీ యొక్క vision, goals and valuesకు సంబంధించిన mission statements కూడా ఉంటాయి.

డైరెక్టర్స్‌ రిపోర్ట్

వార్షిక నివేదికలోని మరో ముఖ్యమైన సెక్షన్‌ డైరెక్టర్స్‌ రిపోర్ట్‌. దీనిలో వివిధ రకాల subsections ఉంటాయి. వాటిలో కంపెనీకి చెందిన ముఖ్య ఆర్థిక అంశాలు, చేపట్టిన కార్యకలాపాలకు వచ్చిన ఫలితాలు, కంపెనీ వ్యవహారాల స్థితి, బిజినెస్ డిస్క్రిప్షన్‌ ఉంటాయి.

అలాగే మానవ వనరుల నిర్వహణ మరియు విధానాలు; కార్పొరేట్ పాలన విధానాలు, ఆడిటర్లు మరియు ఆడిట్ నివేదికల సమాచారం ఉంటుంది.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR):

డైరెక్టర్స్‌ రిపోర్ట్‌లోని ఒక ఉపవిభాగం – Corporate Social Responsibility.

సమాజహితం కోసం కంపెనీ చేపడుతున్న కార్యక్రమాలు గురించి CSR తెలుపుతుంది. ఉదాహరణకు.. పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేయడం, లాభాపేక్షలేని సంస్థలకు ధనంగానీ, అవసరమైన సామగ్రిని కానీ విరాళంగా ఇవ్వడం, దాతృత్వ కార్యకలాపాలు చేపట్టడం లాంటివి కార్పొరేట్ సామాజిక బాధ్యత కిందకు వస్తాయి.

ఒక పెట్టుబడిదారుగా మీరు… కంపెనీ యొక్క CSR కార్యకలాపాలను పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవల వల్ల… ప్రజల్లో ఆ కంపెనీ పట్ల good will కలుగుతుంది. ఫలితంగా కంపెనీకి పరోక్షంగా లాభం చేకూరుతుంది.

Management discussion

ఈ విభాగంలో గత సంవత్సరంలో కంపెనీ యొక్క పరిమాణాత్మక, గుణాత్మక పనితీరు గురించిన వివరాలు ఉంటాయి. ఇది కంపెనీ మేనేజ్‌మెంట్‌ యొక్క point of view గురించి ఆర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అలాగే కంపెనీ యొక్క స్థూల ఆర్థిక పరిస్థితి గురించి మనకు తెలుపుతుంది.

పరిశ్రమ నిర్మాణం మరియు పరిణామాలపై కంపెనీ మేనేజ్‌మెంట్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, సంస్థకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లు గురించి… అలాగే కంపెనీ అంతర్గత నియంత్రణ సంస్థలు, వాటి సమర్థత గురించిన వివరాలు కూడా ఈ సెక్షన్‌ ఉంటాయి.

వీటన్నింటినీ విశ్లేషించడం ద్వారా ఒక ఇన్వెస్టర్‌గా మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ పెట్టుబడిని సరైనా మార్గంలో పెట్టి, సంపదను సృష్టించుకోగలుగుతారు.

Click here: ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?

Click here: stock market trading – Do’s and Don’ts

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?