stock market trading – Do’s and Don’ts

stock market trading - do's and don'ts

హాయ్ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్‌ మార్కెట్ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. # stock market trading – Do’s and Don’ts #

స్టాక్‌ మార్కెట్‌ అనేది సముద్రం లాంటిది. ఆటుపోటులు, ఒడుదొడుకులు ఇక్కడ చాలా సహజం. అందువల్ల investorsగా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా…… మనం safe zoneలో ఉండేలా చూసుకోవాలి.

అందుకే మనం ముందుగా స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో చేయాల్సిన పనులు గురించి తెలుసుకుందాం.

stock market trading – Do’s and don’ts

  1. ఒక ఇన్వెస్టర్‌గా మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి.

స్పష్టమైన లక్ష్యం లేకుండా ట్రేడింగ్ చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఒక్కోసారి అది భారీ నష్టాలకు కూడా దారితీయవచ్చు.

మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్న స్టాక్స్‌ గురించి ముందుగా Fundamental, technical analysis చేయండి. మీ సర్టిఫైడ్ పైనాన్సియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. అలాగే మీరు పొందాలనుకుంటున్న లాభం, మీరు భరించగలిగే నష్టం గురించి ముందే స్పష్టమైన అవగాహనకు రండి.

అలాగే స్టాక్స్ కొన్న తరువాత ఆ స్టాక్స్ పనితీరును, మార్కెట్ పరిస్థితులను నిత్యం గమనిస్తూ ఉండాలి. అవసరాలకు తగిన విధంగా మన ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రేటజీని మార్చుకోవాలి. అలా అని ప్రతిసారీ మీ పోర్టుఫోలియోలో భారీ మార్పులు చేయడం కూడా మంచిది కాదు. అప్పుడు మాత్రమే మీరు safe zoneలో ఉంటారు. లేదంటే భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

  1. దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించండి.

ఇప్పుడు చాలా మంది యువత స్వల్పకాలంలో భారీ లాభాలు రావాలని ఆశిస్తూ స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. స్టాక్ మార్కెట్ బేసిక్స్ కూడా తెలుసుకోకుండా ఇంట్రాడే కూడా చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం.

నిజానికి స్వల్పకాలంలో స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాలు పొందినవారు కొద్ది మంది ఉంటారు. కానీ వారికి కూడా ప్రతిసారీ ఇలా అదృష్టం కలిసిరాదు కదా. అలాగే ప్రతిసారి అదృష్టంపై భారం వేసి ట్రేడింగ్ చేయలేం కదా.

అందుకే మనం ముందుగా స్టాక్ మార్కెట్‌ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి. తరువాత fundamental, technical analysis ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి. ఆ తరువాత మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి ఆలోచించాలి.

స్వల్పకాలంలో స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాలా సహజం. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడులపై investors దృష్టి కేంద్రీకరించాలి.

INVEST CONSISTENTLY

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరివల్లా సాధ్యమయ్యే పనికాదు. నిజానికి అది అంత మంచిది కూడా కాదు. అందువల్ల systematicగా…. రెగ్యులర్‌గా….. దీర్ఘకాలం  పాటు పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. దీని వల్ల high returns వచ్చే అవకాశాలు ఉంటాయి.

అలాగే దీని వల్ల మీకు ట్రేడింగ్‌లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా rupee cost averaging వల్ల మీరు దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందే అవకాశాలు మెరుగవుతాయి.

NOTE: అయితే ప్రతిసారి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలు చేకూర్చవు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వాటి గురించి fundamental, technical analysis seriesలో చర్చించుకుందాం.

Diversify your Portfolio

పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ అనేది చాలా అవసరం. దాని వల్ల మీరు ఒక పర్టిక్యులర్‌ స్టాక్ విషయంలో లేదా సెక్టార్‌ విషయంలో కలిగే ఒడుదొడుకుల ప్రభావానికి గురికారు. నష్ట భయం కూడా బాగా తగ్గుతుంది.

అయితే ఈ పోర్టిఫోలియో డైవర్సిఫికేషన్‌ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్‌కు మాత్రమే పరిమితం కావాలి. Over diversification మంచిది కాదు. ఎందుకంటే వాటిని మీరు సమర్ధవంతంగా ట్రాక్ చేయలేరు.

స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో చేయకూడనివి!

  1. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి

మనుష్యులుగా మనకు చాలా భావోద్వేగాలు ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విషయంలో మాత్రం మనం చాలా కంట్రోల్‌గా ఉండాలి. లేకుంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుని, భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

అందుకే ప్రశాంతంగా ఉండి, హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

  1. Dont have unrealistic expectations

మీరు అవాస్తవ అంచనాలకు రాకండి. ఇంటర్నెట్‌లో దొరికే తప్పుడు సమాచారం ప్రభావానికి లోనుకాకండి. నిమిషంలో లక్ష సంపాదించా, 500 శాతం లాభం వచ్చింది లాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి. ఒకరిద్దరి విషయంలో ఇలాంటివి జరిగినా,  చాలా సందర్భాల్లో అవాస్తవమే అయి ఉంటాయి.

  1. Risky trading, overtrading చేయవద్దు

సమగ్రమైన అవగాహన లేకుండా, పెద్ద మొత్తంలో risky trades చేయకూడదు. దీని వల్ల భారీగా నష్టాలపాలయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో లాభం కోసం ఆశిస్తే… మొత్తం మూలధనమే తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. మంచి అవకాశం వచ్చే వరకు వేచి చూడడం మంచిది.

అలాగే Panic buy and panic sell చేయకూడదు. cheapగా దొరుకుతున్నాయని ఏ స్టాక్స్‌ బడితే ఆ స్టాక్స్‌  కొనకూడదు. మంచి స్టాక్స్‌ తక్కువ ధరలో దొరికితే కొనడం మంచిది. మొత్తానికి స్మార్ట్‌గా ఇన్వెస్ట్‌ చేసి, లాభం పొందండి.

హెచ్చరిక: స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్ రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల సంబంధింత డాక్యుమెంట్స్‌ను ముందుగా పూర్తిగా చదవండి. పెట్టుబడి పెట్టే ముందు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను తప్పకుండా సంప్రదించండి.

Click here: The key players in the stock market

Click here: What is the share market/ stock market?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?