బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు (Investors) అవగాహన కల్పించి, తగు రక్షణ కల్పించడం కోసం ప్రత్యేకంగా “స్టాక్ మార్కెట్ గైడ్”ను https://www.bseindia.com/ websiteలో పొందుపరిచింది. # ఇన్వెస్టర్ల కోసం స్టాక్ మార్కెట్ గైడ్ #
ట్రేడ్ అమలు చేసిన ఒక్క వర్కింగ్ డే లోపల… ఆర్డర్ నెంబర్, ట్రేడ్ నెంబర్, ట్రైడ్ టైమ్, ట్రేడ్ ప్రైజ్ వివరాలతో సహా, అన్ని లావాదేవీల గురించిన సమగ్ర సమాచారంతో కూడిన కాంట్రాక్ట్ నోట్‌ను బ్రోకర్ నుంచి ఇన్వెస్టర్ పొందాల్సి ఉంటుంది.
Note: ఈ కాంట్రాక్ట్ నోట్‌లో సెబీ మరియు స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా నిర్దేశించిన విధంగా విధించిన ఛార్జీల వివరాలు కూడా ఉంటాయి. ఇందులో ఏమైనా తేడాలు ఉంటే, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు.
సమస్యల పరిష్కారం కోసం…
ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గైడ్‌లో పెట్టుబడిదారుల హక్కుల గురించి సమగ్రమైన సమాచారం ఉంది. ముఖ్యంగా మార్కెట్ లావాదేవీల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, అందుకోసం ప్రాథమికంగా ఎవరిని సంప్రదించాలో కూడా ఇందులో నిర్ధిష్టంగా పేర్కొనడం జరిగింది. కనుక ప్రతి ఇన్వెస్టర్ BSE వెబ్‌సెట్‌లోని ఈ సమాచారాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.
BSE స్టాక్ మార్కెట్ గైడ్ లింక్: https://www.bseindia.com/static/investors/services.aspx
ఇదీ చూడండి: The key players in the stock market
ఇదీ చూడండి: Different types of markets