హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఒక ఇన్వెస్టర్‌గా మనం స్టాక్ మార్కెట్ నుంచి మంచి లాభాలు ఆశిస్తాం. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని మనకు బాగా తెలుసు. అందుకే మనం పెట్టుబడులు పెట్టే ముందు.. మూడు important factors గురించి తెలుసుకోవాలి. అవి
- అస్థిరత (volatility)
- రిస్క్ (Risk)
- ద్రవ్యత (liquidity)
స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత:
Stock marketలో సెక్యూరిటీల లేదా స్టాక్‌ల ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక స్టాక్ ధర బాగా ఒడుదొడుకులకు లోనవుతూ ఉంటే… అది బాగా ఆస్థిరంగా (volatile)గా ఉందని అంటాం. అలాకాకుండా స్టాక్ ధరలో పెద్దగా మార్పులు లేకపోతే..ఆ స్టాక్ ధర స్థిరంగా ఉంది అంటాం.
మరి ఒక ఇన్వెస్టర్‌గా మనం…. బాగా అస్థిరంగా ఉన్న స్టాక్ కొనాలా? లేకపోతే ఇంచు స్థిరంగా ఉన్న స్టాక్ కొనాలా?
ఈ ప్రశ్నకు సరైన సమాధనం చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఇన్వెస్టర్ మనస్తత్వాన్ని అనుసరించి ఈ ప్రశ్నకు సమాధానం మారుతుంటూ ఉంటుంది.
Risk
సాధారణంగా… మీరు రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉన్నవారైతే బాగా అస్థిరంగా ఉన్న స్టాక్‌ను కొంటారు. దీని వల్ల భారీ లాభం కానీ, భారీ నష్టంగానీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడకపోతే… కచ్చితంగా ఇంచుమించు స్థిరంగా ఉన్న స్టాక్‌ను ఎంపిక చేసుకుంటారు. దీర్ఘకాలపాటు వేచి ఉంటారు. దీని వల్ల రిస్క్ తగ్గి, లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ స్ట్రాటజీ వల్ల ప్రతిసారీ లాభం పొందుతామన్న గ్యారెంటీ ఏమీ లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో loss వచ్చే అవకాశం కూడా ఉంది.
రిస్క్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అవి
- Systematic risk
- Unsystematic risk
ఒక కంపెనీ బిజినెస్ చేసే సెగ్మెంట్ లేదా ఎంటైర్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి సిస్టమేటిక్ రిస్క్ తీసుకుంటాం.
Specific industry లేదా సెగ్మెంట్ లేదా సెక్యూరిటీ పనితీరుపై ఆధారపడి unsystematic risk తీసుకుంటాం.
ఒక సెక్యూరిటీ యొక్క రిస్క్‌ను లేదా పోర్ట్‌ఫోలియో యొక్క రిస్క్‌ను అంచనా వేయడానికి చాలా numerical techniques ఉన్నాయి. ఉదాహరణకు
- Variance and covariance
- Variance covariance matrix
- The portfolio standard deviation calculator
Liquidity (ద్రవ్యత)
ఒక ఇన్వెస్టర్‌గా మనం… మన పెట్టుబడిని లేదా assetను సులువుగా క్యాష్ రూపంలోకి మార్చుకోగలగాలి. ముఖ్యంగా Market priceతో సంబంధం లేకుండా మన పెట్టుబడిని లేదా Assetను క్యాష్ రూపంలోకి మార్చుకోగలగాలి.
దీనిని మరింత సింపుల్‌గా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం…!
అప్పారావు అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం హైదరాబాద్ శివార్లలో ఒక విలాసవంతమైన ఇళ్లు కొన్నాడు. ప్రస్తుతం తను ఇళ్లు కొన్న ప్రదేశంలో మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది కనుక…. భవిష్యత్‌లో ఆ ఇంటి వల్ల మంచి passive income వస్తుందని అతను ఆశించాడు. అదే సమయంలో అప్పారావు తమ్ముడు సుబ్బారావు Physical gold కొన్నాడు.
సరిగ్గా సంవత్సరం గడిచిన తరువాత… అప్పారావుకి అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. కానీ సరైన tenantగానీ, బయ్యర్‌గానీ దొరకలేదు. దీనితో తనకు ఆస్తి ఉన్నా… దానిని డబ్బు రూపంలోకి మార్చుకోలేక నానా అవస్థలు పడ్డాడు.
దీనితో సుబ్బారావు తన అన్నయ్యకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడానికి సిద్ధమయ్యాడు. అతనికి వెంటనే బయ్యర్ దొరికాడు. దీనితో తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి… డబ్బు చేసుకున్నాడు. కుటుంబ అవసరాలు తీర్చగలిగాడు.
పై ఉదాహరణ బట్టి రియల్ ఎస్టేట్ కంటే బంగారానికి liquidity ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతూ ఉంది. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఈ లిక్విడిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. (గమనిక: కొన్ని స్టాక్స్‌ను విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది. వాటిని సులువుగా అమ్మి డబ్బు చేసుకోలేము. అది ఎందుకో తరువాతి ఆర్టికల్స్‌లో detailగా చర్చిద్దాం.)
మనం రిస్క్, అస్థిరత, ద్రవ్యతల గురించి తెలుసుకున్నాం. మరి వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే… కచ్చితంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. అది ఎలాగే చూద్దాం.
Risk and volatility
ఒక stock price చాలా అస్థిరంగా ఉంటే… దానిపై పెట్టుబడి పెట్టడం బాగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాకాకుండా ఒక stock price ఇంచుమించు స్థిరంగా ఉంటే… దానిపై పెట్టుబడి పెట్టడం కాస్త saftyతో కూడుకున్నదని భావించవచ్చు. (అయితే కచ్చితంగా లాభం వస్తుందని గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము.)
లిక్విడిటీ అండ్ రిస్క్
ఒక assetకి లిక్విడిటీ ఎక్కువగా ఉంటే.. దానిపై పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే పెద్ద రిస్క్ లేకుండానే ఈ ఆస్తిని అమ్మివేసి డబ్బు చేసుకోవచ్చు.
అలాకాకుండా ఆ assetకి లిక్విడిటీ తక్కువగా ఉంటే మాత్రం… దానిపై పెట్టుబడి పెట్టడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. ఎందుకంటే… మనం ఆ assetని అమ్మి సులువుగా డబ్బు చేసుకోలేం.
Click here: వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు
Click here: మ్యూచువల్ ఫండ్స్ – రకాలు