5Gతో రానున్న Redmi Note 10 Pro!

Redmi Note 10 Pro details

Redmi Note seriesకు అదిరిపోయే ఆదరణ ఉంది. కొన్నేళ్లుగా ఇది హిట్ సిరీస్. 2020లో Note9 సిరీస్లో కొత్త మోడల్స్ను విడుదల చేసింది స్మార్ట్ఫోన్ సంస్థ. ఈ Note seriesలో Note 9 Pro అత్యంత క్రేజ్ సంపాదించుకుందంటే అందరూ ఒప్పుకోవాల్సిందే.

ఈ నేపథ్యంలో Note 10 Proను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది Redmi. అయితే ఇది కేవలం చైనాలోనే విడుదల అవుతుందా? లేక అంతర్జాతీయంగా అందుబాటులో ఉంటుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Note 10 Pro ఇప్పటికే European Economic Commission, Singapore’s IMDA, Malaysia’s MCMCలో లిస్ట్ అయ్యింది. అందువల్ల ఇది అంతర్జాతీయంగా కూడా అందుబాటులోకి రావచ్చని ఓ అంచనా వేయవచ్చు.

Note 9 Proలా ఉంటుందా?

ఈ Note 10 Pro ఫీచర్స్ గురించి కూడా గోప్యంగా ఉన్నాయి. అయితే ఇది 5G సపోర్ట్తో వస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 5,000mAh కన్నా ఎక్కువ battery capacity, 30W fast charging, Android 11 సాఫ్ట్వేర్తో ఇది వినియోగదారుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.

మొత్తం మీద చూసుకుంటే ఈ Note 10 Pro, Note 9 Proకు అప్డేటెడ్ వర్షెన్లా ఉంటుందని చెప్పొచ్చు.

త్వరలోనే ఈ Note 10 Pro గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. Redmi ప్రియులు వేచిచూడక తప్పదు!

                      – VISWA (WRITER)

click here: Redmi నుంచి తొలి స్మార్ట్వాచ్..

click here: 2021లో మీ మనసు దోచే Smartphones ఇవే..!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?