చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన PUBG పునరాగమనం కోసం ఆన్లైన్ గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే PUBG కూడా అప్డేటెడ్ వర్షెన్ గురించి వివరాలు ప్రకటించింది. కానీ PUBG కోసం గేమింగ్ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. మార్చి 2021 వరకు ఇండియాలో PUBG రీలాంచ్ అయ్యే అవకాశాలు లేవని సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది PUBG ప్రియులకు చేదువార్తే. # అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త! #
అనుమతులు రాలేదు..
PUBG Mobile India ను దేశంలో విడుదల చేసేందుకు ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది PUBG Corporation. ఎన్ని రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు. దీంతో గేమ్ ఇప్పట్లో రిలీజ్ కాకపోవచ్చని PUBG Mobile India కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
‘PUBGని ఇండియాలో విడుదల చేసేందుకు మావైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేని పరిస్థితి. రానున్న కొన్ని నెలలు, కనీసం మార్చి 2021 వరకు అయినా PUBG మార్కెట్లోకి రాకపోవచ్చు. ఇది బాధాకరమైన విషయమే,’ అని ఓ అధికారి వెల్లడించారు. దీంతో కనీసం నూతన ఏడాదికైనా PUBG ఆడొచ్చనుకున్న వారికి నిరాశే ఎదురైంది. # అయ్యో PUBG- గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త! #
నిజానికి PUBG సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీది. కానీ దీనిని చైనాకు చెందిన Tencent ఫ్రాంఛైజీగా పనిచేసేది. ఫలితంగా అనేక చైనా యాప్స్తో పాటు దీనిని కూడా నిషేధించింది కేంద్రం. అనంతరం Tencentకు గుడ్బై చెప్పి కొత్త వర్షెన్తో, మరింత దేశీయంగా ఉండే PUBGని రూపొందించారు.
click here: ఇండియాలోకి Redmi 9 Power.. ఓ లుక్కేయండి
click here: WhatsApp Web నుంచి వీడియో కాల్ చేసేద్దామా!