ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్‌మెంట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా?

fundamental analysis part 6

 FUNDAMENTAL ANALYSIS PART – 6

ప్రాఫిట్‌ అండ్ లాస్‌ స్టేట్‌మెంట్‌ను – ఎనాలసిస్ చేయడం ఎలా?

పీ అండ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? దానిని ఎలా అర్థం చేసుకోవాలనేది గత ఛాప్టర్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు  Profit & Loss statementను ఎలా ఎనాలసిస్ చెయ్యాలో తెలుసుకుందాం.

లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్టర్లుగా మనం పీ అండ్ ఎల్ స్టేమెంట్ను లోతుగా విశ్లేషించుకోవాలి. దీని కోసం కంపెనీ ఫైనాన్షియల్ డేటాను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ రేషియోస్ను ఉపయోగించి సరైన ఎనాలసిస్ చేసుకోవాలి.

P&L statement analysis చేయాలంటే కేవలం లేటెస్ట్‌ ఫైనాన్షియల్ రేషియోస్ను మాత్రమే చూస్తే సరిపోదు. కంపెనీ యొక్క గత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను, ప్రస్తుత సంవత్సర స్టేట్మెంట్తో పోల్చి చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో మనం ఎంచుకున్న కంపెనీ ఉన్న రంగంలోని ఇతర కంపెనీల గణాంకాలతోనూ పోల్చి చూడాలి. అప్పుడు మాత్రమే మనం పెట్టుబడి పెట్టాలనుకున్న కంపెనీ ఏ మేరకు వృద్ధి చెందగలదో ఒక అంచనాకు రావచ్చు.

గత ఛాప్టర్‌లో మనం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) 2019-20 ఆన్యువల్ రిపోర్ట్‌ను ఉదాహరణగా తీసుకున్నాం కదా. అందుకే ఈ ఛాప్టర్‌లోనూ ఆ కంపెనీ యొక్క Annual reportనే ఉదాహరణగా తీసుకుందాం.

profit and loss statement                                            profit and loss statement

 
మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన financial numbers, ratios and their calculations

వాస్తవానికి financial ratios చాలా ఉన్నాయి. వీటిని నిపుణులు నాలుగు క్యాటగిరీలుగా విభజించారు.

  • Profitability ratios
  • Leverage ratios
  • Valuation ratios
  • Operating ratios

పీ అండ్ ఎల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్లోని వివరాల ఆధారంగా వీటిని లెక్కించవచ్చు. ప్రస్తుతానికి పీ అండ్ ఎల్ స్టేట్మెంట్ ఆధారంగా వీటిని లెక్కిద్దాం.

  1. Operating revenue

కంపెనీ ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని operating revenue అంటారు. ప్రధాన వ్యాపారంతో కంపెనీ ఎంత సంపాదిస్తోందనేది దీనితో తెలుసుకోవచ్చు. అందుకు ఓ ఫార్ములా ఉంది.

Operating revenue

హెచ్యూఎల్ operating revenue= రూ.38,785 కోట్లు.

2. particulars                                                             particulars


  1. Operating expenses

ప్రధాన వ్యాపారానికి అవసరమైన ఖర్చులను తెలియజేసేదే operating expenses.

Operating expenses

ఈ ఫార్ములాను ఉపయోగించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, అంతకుముందటి ఏడాది హెచ్యూఎల్ operating expenses ఎలా ఉన్నయో చూద్దాం.

Operating expenses                                               Operating expenses

(2019-20) లో హెచ్‌యూఎల్ ఆపరేటింగ్‌ ఎక్స్‌పెన్సిస్‌= రూ. 29,185 కోట్లు (రూ.30,229 కోట్లు రూ.106 కోట్లు రూ.938 కోట్లు)

(2018-19) లో హెచ్‌యూఎల్‌ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సిస్‌ = రూ. 29,587 కోట్లు (రూ.30,139 కోట్లు రూ.28కోట్లు రూ.524 కోట్లు)

  1. Earnings before interest, tax, depreciation an amortization (EBITDA)

ఫైనాన్షియల్ ఎనాలసిస్లో EBITDA కీలక పాత్ర పోషిస్తుంది. PBT, PATలను చూస్తే కేవలం లాభాలే తెలుస్తాయి. కానీ ఈ EBITDAతో కంపెనీ యొక్క ఆదాయం జెనరేట్ చేయగలిగే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు.

EBITDA ఎంత ఎక్కువగా ఉంటే, కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అంత మెరుగ్గా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

EBITDA

దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది.

EBITDA formula

ఈ రెండో ఫార్ములాను హెచ్యూఎల్కు అప్లై చేసి చూద్దాం.

EBITDA of HUL (2019 -20) = రూ.9,600 కోట్లు

(రూ.38,785కోట్లు – రూ.29,185 కోట్లు)

అయితే కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలంటే ఇదొక్కటే సరిపోదు. కంపెనీ ఆదాయం ఎంత పెరిగిందనేది తెలుసుకోవడానికి ఈ గణాంకాలను, అంతకు ముందు ఆర్థిక సంవత్సర గణాంకాలతో పోల్చి చూడాలి.

EBITDA (2018-19) = రూ.8,637 కోట్లు

(రూ.38,224కోట్లు – రూ.29,587 కోట్లు)

ఈ రెండు గణాంకాలను పోల్చితే.. హెచ్యూఎల్ EBITDA రూ.963 కోట్లు పెరిగినట్టు అర్థమవుతుంది. ఇది చాలా మంచి విషయం.

  1. EBITDA margin

కంపెనీ యొక్క సామర్థ్యాన్ని (ఎఫీషియెన్సీ)ని అంచనా వేసేందుకు ఈ EBITDA margin ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాథమిక కార్యకలాపాల నుంచి కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తోందనేది ఇది చెబుతుంది. EBITDA margin ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీ తన ప్రాథమిక కార్యకలాపాల నుంచి అంత ఎక్కువ లాభాలను అర్జిస్తున్నట్టు అర్థం. ఆ ఫార్ములాను చూద్దాం.

EBITDA margin

హెచ్యూఎల్ total sales నోట్ 24లో ఉంది.

EBITDA margin for 2019-20 in %= (రూ.9,600 కోట్లు/ రూ.38,273 కోట్లు) x 100 = 25.08%

note 24                                                   note 24

EBITDA margin for 2018-19 in %= (రూ.8,637 కోట్లు/ రూ.37,660 కోట్లు) x 100 = 22.93%

note 24                                                     note 24

 

ఈ గణాంకాలను పోల్చి చూస్తే.. కంపెనీ యొక్క ఎఫీషియెన్సీ 2.15 శాతం పెరిగినట్టు అర్థమవుతుంది.

  1. Profit after taxes (PAT) margin

PAT marginను లెక్కించడం చాలా సలుభం. కంపెనీ యొక్క overall profitabilityని ఇది సూచిస్తుంది. PAT margin ఎంత ఎక్కువగా ఉంటే, కంపెనీ యొక్క profitability అంత మెరుగ్గా ఉన్నట్టు.

PAT margin in %

హెచ్యూఎల్ PAT margin in % (2019-20) = (రూ.6,738 కోట్లు / రూ.38,273 కోట్లు) x 100 = 17.60%

 tax                                                        tax

హెచ్యూఎల్ PAT margin in % (2018-19) = (రూ.6,036 కోట్లు / రూ.37,660 కోట్లు) x 100 = 16.02%

note 24                                                      note 24

 

అంటే ఒక్క ఏడాదిలో హెచ్యూఎల్ profitability (17.60-16.02) 1.58 శాతం పెరిగింది. ఇది కూడా చాలా మంచి విషయం.

tax note 24 

  1. Interest coverage ratio

దీనినే debt service ratio అని కూడా అంటారు. ఒక కంపెనీ తను తీసుకున్న అప్పులను ఎంత సమర్థవంతంగా తీర్చగలదో తెలుపుతుంది.

సాధారణంగా కంపెనీలు తమ అవసరాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటిని వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది. మరి కంపెనీకి ఆ సామర్థ్యం ఉందో లేదో తెలిపేదే interest coverage ratio. ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. కంపెనీ తన debts అంత సులభంగా తీర్చేయగలదని అర్థం.

Interest coverage ratio

Where, EBIT (earnings before interest and tax)

= EBITDA – depreciation and amortisation

హెచ్యూఎల్ EBIT (2019-20) = రూ.9,600 కోట్లు రూ.938 కోట్లు = రూ.8,662 కోట్లు

అందువల్ల Interest coverage ratio of HUL (2019-2020) = రూ.8,662కోట్లు / రూ.106కోట్లు = 81.72

expenses                                                   expenses

అంటే హెచ్‌యూఎల్ every single rupee of debt interest payment మీద 81.72 రెట్లు ఆదాయాన్ని సంపాదిస్తోంది.

7. Cost of goods sold (COGS)

ఓ కంపెనీ Finished goods (తయారైన వస్తువులను) కొనుగోలుచేయడం కోసం లేదా ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చును COGS అంటారు.  Finished goodsకు అయ్యే ఖర్చుతో పాటు ముడిసరుకు, లేబర్ తదితర ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి.

COGS

హెచ్యూఎల్ COGS(2019-20)= రూ. 11,572కోట్లు+ రూ. 6,342కోట్లు+ రూ. 263కోట్లు= రూ. 18,177కోట్లు

expenses note 32                                                                  expenses note 32
  1. Operating ratio

ఓ కంపెనీ operational efficiencyని లెక్కించేందుకు Operating ratio ఉపయోగపడుతుంది. Operating expensesకి, salesకి మధ్య బంధాన్ని చెబుతుంది. ఒక కంపెనీ తన యొక్క Operating costsను ఎంత ఎఫీషియంట్‌గా తగ్గించుకోగలదో ఈ రేషియో సూచిస్తుంది.

Operating ratio in %

హెచ్యూఎల్  Operating ratioను లెక్కిద్దాం.

Cost of goods sold (COGS)= రూ.18,177 కోట్లు

Other operating expenses = రూ.11,008 కోట్లు

Employee benefit expenses + changes in inventories of finished goods (including stock-in-trade) and work-in-progress + other expenses (excluding power/fuel/light/water, ఎందుకంటే అది COGSలో ఉంది కాబట్టి.)

= (రూ.1,691 కోట్లు రూ.121 కోట్లు + రూ.9,701 కోట్లు రూ.263 కోట్లు) = రూ.11,008 కోట్లు

Net sales= రూ.38,273 కోట్లు

note 24                                                       note 24

అందువల్ల హెచ్యూఎల్ Operating ratio (2019-20) = 76.25%

[(రూ.18,177 కోట్లు + రూ.11,008 కోట్లు)/ రూ.38,273 కోట్లు) x 100 = 76.25%

సహజంగా మాన్యుఫాక్చురింగ్‌ కంపెనీల operating ratio 70% నుంచి 80% మధ్యలో ఉంటే మంచిది.

Important Formulas

Operating revenue

Operating expenses

EBITDA

EBITDA formula

EBITDA margin

PAT margin in %

Interest coverage ratio

COGS

Operating ratio in %

Click here: How to read Profit and Loss statement?

Click here: Annual Reportని అధ్యయనం చేయడం ఎలా?

 

 

 

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?