మా మట్టి వాసన..
మా ఊరి చెరుకు ఫ్యాక్టరీ…
మా నీలమ్మ చెరువు గాలి…
మా పచ్చని పంట పొలాలు..
మా భీమేశ్వర స్వామి గుడి..
మా ప్రసన్నాంజనేయుడు..
మా ఊరి బస్సు ప్రయాణం..
అలుపెరుగని బాటసారికి… అనువైన పయనం
మా కాకినాడ కాజా.. మా పిఠాపురం రాజా..
మా రావి చెట్టు గాలి.. మా జ్ఞాపకాల మజిలీ..
చుకుచుకు రైలులో.. బంధాల బోగీలలో…
మా ఊరి రైలు ప్రయాణం…
కనులపండగ.. మనసునిండగ..
చెరిగిపోని ఓ జ్ఞాపకం..
మా అమ్మ చేతి వంట..
మా చెల్లి నోటి మాట..
మా నాన్న వెంట చేయి పట్టుకొని నడక..
మా తమ్ముడితో స్కూటర్ ప్రయాణం…
మా మట్టి వాసన.. మధురాతి మధురం..
– యుగ (కె.ఎమ్.కె)
ఇదీ చూడండి: మనసు మాటున మాటలు…
ఇదీ చూడండి: stock market trading – Do’s and Don’ts