తన నూతన privacy నిబంధనల వల్ల కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది దిగ్గజ మెసేజింగ్ యాప్ WhatsApp. ఇదే ఇప్పుడు ఇతర యాప్స్కు సువర్ణ అవకాశంలాగా మారింది. ముఖ్యంగా WhatsApp privacy వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి Signal, Telegramలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. # WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! #
ఎలాన్ మస్క్ ట్వీట్తో…
మరీ ముఖ్యంగా “Use Signal” అంటూ ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్తో ఆ యాప్కు ఆదరణ భారీగా దక్కుతోంది. యాప్ signup చేసే క్రమంలో, కొన్ని నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి వెరిఫికేషన్ కోడ్స్ ఆలస్యంగా అందుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వర్లు ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోయాయి.
Telegram యాప్ది కూడా ఇంచుమించు ఇదే పిరిస్థితి. కొత్త వినియోగదారులు తమ యాప్లోకి చేరుతున్నారని ట్విట్టర్లో వెల్లడించింది Telegram. ఇక్కడ కూడా వెరిఫికేషన్ కోడ్స్ ఆలస్యమవుతుండటం గమనార్హం. # WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! #
WhatsApp privacy రగడ…
ఫేస్బుక్తో డేటా పంచుకోవడాన్ని mandatory చేయడంతో పాటు మరికొన్ని కీలక విధానాల్లో ఇటీవలే మార్పులు చేసింది Whatsapp. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో ఈ యాప్పై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఇది కేవలం బిజినెస్ ఎకౌంట్స్కే పరిమితమని, సాధారణ వినియోగదారులకు కాదని ఓ ప్రకటనలో పేర్కొంది WhatsApp. # WhatsApp ‘privacy’ వల్ల Telegram-Signalకు పండగే! #
– VISWA (writer)
click here: ఈ Telegram కొత్త ఫీచర్స్ మీరు ట్రై చేశారా?
click here: దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం